అన్వేషించండి

Revanth Reddy Open Letter: సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ- జీతాలు చెల్లింపులపై ప్రస్తావన

Revanth Reddy Open Letter: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. అందులో కాంట్రాక్టుతో పాటు జూనియర్ లెక్చరర్ల జీతాల చెల్లింపుల గురించి తెలిపారు.

Revanth Reddy Open Letter: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల, జూనియర్ లెక్చరర్ల జీతాల చెల్లింపు గురించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, జూనియర్ లెక్చరర్లు కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఉండవని, అందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. అవిభక్త రాష్ట్రంలో పాలకులు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎంతో బాధ కలిగించారని అన్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఒక్క సంతకంతో ఈ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సార్లు హామీ ఇచ్చారని వివరించారు. అంతేకాకుండా 2014లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అనుకున్నట్లుగానే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని.. అయినా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల కష్టాలు తీరలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీతాల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రెగ్యులరైజేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. మే నెలలో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్లకు కూడా ఏప్రిల్ నెల జీతాలు అందలేదన్నారు. కొన్ని జిల్లాల్లో డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వందలాది మంది ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నా.. నెలల తరబడి సకాలంలో వేతనాలు అందక అవస్థలు పడుతున్నారని చెప్పుకొచ్చారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారి ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి లేఖలో తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు అప్పులకే మొగ్గు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో చెల్లించలేక మానసిక క్షోభకు గురవుతున్నారని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేవారని రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియని దుస్థితి నెలకొందని అన్నారు. ఇప్పుడు కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలు ఐదారు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రమని చెప్పుకోవడం తప్ప కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని విద్యావేత్త కొఠారీ అన్నారని గుర్తు చేశారు. అందుకే దేశ భవిష్యత్తును నిర్ణయించే తరగతి గదుల్లో బోధించే లెక్చరర్లకు జీతాలు చెల్లించకుండా వేధించడం సహించరానిదంటూ మండి పడ్డారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు సకాలంలో వేతనాలు అందేలా చూడాల్సిన బాధ్యత తెలంగాణ సర్కారుపైనే ఉందని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పక్షాన నిలబడి వారితో పోరాటం చేయిస్తుందని చెప్పుకొచ్చారు. 

మా డిమాండ్లు ఇవే: రేవంత్ రెడ్డి

కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు ఐదు నుంచి ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు ప్రతి నెలా సకాలంలో వేతనాలు అందేలా చూడాలన్నారు. ఇవే కాకుండా వివిధ కారణాల వల్ల క్రమబద్ధీకరించబడని వారిని వెంటనే క్రమబద్ధీకరించాలని లేఖలో తెలిపారు. .

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Embed widget