అన్వేషించండి

Revanth Reddy: రచ్చబండ కార్యక్రమం కొనసాగిస్తాం.. కేసీఆర్ వడ్లు ఎవరికి అమ్ముతారు?

3 నెలల నుంచి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉరిశిక్ష విధిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పండించిన పంట కొనుగోలు చేయక పోవడం వల్ల రైతుల చనిపోయారన్నారు.

తెలంగాణలో చివరి గింజ వరకు పంటను కొనాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న ఆయనను అదుపులోకి తీసుకుని.. అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత సాయంత్రం ఆయనను విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. వరి కొనుగోలు చేయకుంటే సీఎం కేసీఆర్ ని రైతులు ఉరేస్తారని తీవ్రంగా విమర్శించారు. పంట కొనుగోలు విషయంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు దొందు.. దొందేనని వ్యాఖ్యానించారు. రైతులను వరి వద్దు అని కేసీఆర్ మాత్రం తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాలలో వరి ఎందుకు వేసాడు? అని ప్రశ్నించారు. 

రైతులు చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ధైర్యం నింపలేకపోతుంది. రైతుల కల్లాల దగ్గరకి వెళ్ళి రైతులకు ధైర్యం చెప్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్. రైతుల సమస్యలు పక్కన పెట్టి, నిరుద్యోగ సమస్య ముందు పెట్టుకుంది రాష్ట్ర బీజేపీ నేతలు. బీజేపీ,టీఆరెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు. ఉద్యోగాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నిరుద్యోగులను మోసం చేశారు. దయచేసి రైతులు అధైర్య పడి ఆత్మహత్య చేసుకోవద్దు. చావు పరిష్కారం కాదు. 
                                                                                                - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

రైతుల వరి పంటను కొనుగోలు చేయను అని మాట్లాడిన కేసీఆర్.. తన ఫామ్ హౌస్ లో పండిన పంటను ఎవరికి అమ్ముతారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ వడ్లు కొన్న వాళ్లు... రైతుల వడ్లు కొనరా? అని అడిగారు. రచ్చబండ కార్యక్రమం కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు టీఆరెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లో ఉన్నాయని విమర్శించారు. బీజేపీ, టీఆరెస్ నేతల వైఖరి వల్లనే నేడు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను రాజులు చేస్తామని వ్యాఖ్యానించారు. యాసంగి లో వడ్లు పండించండి.. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి అయిన సరే కొనుగోలు చేయిస్తామన్నారు.

గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 150 ఎకరాలలో వరి పంట సాగుచేశారని, దానిని మీడియాకు చూపిస్తానని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎర్రవెల్లిలో రచ్చబండకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఇంతలో పోలీసులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. హౌస్ అరెస్టులు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు పహారా కాశారు. రచ్చబండకు వెళ్లేందుకు రేవంత్ ఇంటి నుంచి బయటికి రాగానే పోలీసులు అరెస్టు చేసి.. అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించి.. సాయంత్రం విడుదల చేశారు.

Also Read: Congress Rachabanda: కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం ఉద్రిక్తం... రేవంత్ రెడ్డి అరెస్టు, కీలక నేతల హౌస్ అరెస్టులు... టీఆర్ఎస్ ప్రభుత్వం హక్కులను కాలరాస్తుందని మధు యాష్కీ ఆగ్రహం

Also Read: TS BJP Deeksha : జనవరిలోగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే అసెంబ్లీని జరగనివ్వం.. నిరుద్యోగ దీక్షలో టీ బీజేపీ హెచ్చరిక !

టాప్ హెడ్ లైన్స్

Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget