అన్వేషించండి

Revanth Reddy: సోనియాగాంధీ ఎన్నిక ఏకగ్రీవం, రేవంత్ ఎమోషనల్ ట్వీట్

Rajyasabha: సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా ఆమెకు కాంగ్రెస్ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు.

Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోటీ లేకపోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో పెద్దల సభలోకి సోనియా అడుగుపెట్టనున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్బంగా సోనియాగాంధీకి కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా సోనియాగాంధీకి ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

'తల్లిగా అమరుల త్యాగాలకు తల్లడిల్లి… నాయకురాలిగా స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి… తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన శ్రీమతి సోనియాగాంధీ గారు రాజ్యసభకు ఎన్నిక కావడం సంతోషకరం.  నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున సోనియమ్మకు హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ రేవంత్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సోనియాగాంధీకి తాను పుష్పగుచ్చం అందిస్తున్న ఫొటోను తన ట్వీట్‌కు జత చేశారు. రేవంత్ ట్వీట్ వైరల్‌గా మారగా.. సోనియాకు కాంగ్రెస్ కార్యకర్తలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆమె ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ పార్లమెంట్ స్థానం నుంచి ఆమె గెలుస్తూ వస్తున్నారు. వయస్సు రీత్యా, అనారోగ్యం కారణంగా వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని సోనియా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమె స్థానమైన రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. సోనియా స్థానం నుంచి ఆమె కూతురు, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేస్తున్న ప్రియాంక.. ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగలేదు. కానీ రానున్న ఎన్నికల్లో పోటీలోకి దిగాలని చూస్తున్నారు. దీంతో రాయ్‌బరేలీ అయితే సేఫ్ అని ప్రియాంక భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. దీంతో అక్కడ నుంచి పోటీ చేస్తే  ప్రియాంక గెలుపు ఖాయమని హస్తం పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.

కాగా రాయ్‌బరేలీ ప్రజలకు ఇటీవల సోనియా ఒక లేఖ రాశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఇక నుంచి తానకు నేరుగా సేవ చేసే అవకాశం ఉండదంటూ ఎమోషనల్ అయ్యారు. భవిష్యత్తులోనూ తన కుటుంబానికి అండగా ఉంటారని ఆశిస్తున్నానని, రాయ్‌బరేలీ ప్రజలందరూ ఎప్పుడూ తన హృదయంలోనే ఉంటారని అన్నారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది రాయ్‌బరేలీ ప్రజల వల్లనేనని, అక్కడి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఎల్లప్పుడూ కష్టపడతానని లేఖలో పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలతో తన కుటుంబానికి ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉందని, తన అత్తమామల నుంచి తనకు అదృష్టంగా ఇది లభించిందని తెలిపారు. తమ కుటుంబం కష్టాల్లో ఉన్న సమయంలో ఇక్కడి ప్రజలు తమకు అండగా నిలిచారని, అప్పుడే మన మధ్య బంధం మరింత బలపడందని అన్నారు. త్వరలోనే రాయ్‌బరేలీ ప్రజలను కలుస్తానని సోనియాగాంధీ తన లేఖలో పేర్కొన్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Pushpa 2 Collection: 1000 కోట్లు క్లబ్‌లో సినిమా... పుష్పరాజ్ వసూళ్ల జాతర... సామి నువ్వు ఆడాలా బాక్సాఫీస్ బద్దలవ్వాలా
1000 కోట్లు క్లబ్‌లో సినిమా... పుష్పరాజ్ వసూళ్ల జాతర... సామి నువ్వు ఆడాలా బాక్సాఫీస్ బద్దలవ్వాలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Pushpa 2 Collection: 1000 కోట్లు క్లబ్‌లో సినిమా... పుష్పరాజ్ వసూళ్ల జాతర... సామి నువ్వు ఆడాలా బాక్సాఫీస్ బద్దలవ్వాలా
1000 కోట్లు క్లబ్‌లో సినిమా... పుష్పరాజ్ వసూళ్ల జాతర... సామి నువ్వు ఆడాలా బాక్సాఫీస్ బద్దలవ్వాలా
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Embed widget