Telangana Registration Services: తెలంగాణలో ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు, సర్వర్ డౌన్ సమస్యే కారణం!
Telangana Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలు ఎక్కడికక్కడ నిలచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.
Registration Services Stopped: తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వీసులు నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు ఎదరు చూస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆధార్ ఈ కేవైసీ సర్వర్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఉదయం నుంచి భూముల రిజిస్ట్రేషన్ ఆగిపోయిందని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన క్రయ విక్రయదారులు ఆఫీస్ బయట పడిగాపులు కాస్తున్నారు. అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సాంకేతిక సమస్యతో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో భూముల కొనుగోలు, అమ్మకాలు జరిపే వాళ్లు పడిగాపులు కాస్తున్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో భూముల క్రయ విక్రయ సేవలు నిలిచిపోయాయి. సెప్టెంబర్ 11వ తేదీన ఉదయం నుంచి సర్వర్ డౌన్ సమస్య తలెత్తడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా సేవలు నిలిచిపోయాయి. ఆస్తుల రిజిస్ట్రేష
ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఇటీవల తరచుగా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. తాజాగా.. మంగళవారం కూడా ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. మరో రెండు రోజుల్లో భూముల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవడంతో ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూ కట్టారు. అయితే.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని సర్వర్లు నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
న్ లో ప్రజలు ఇబ్బందులు పడుతున్ానరు. ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ఉదయం నుంచి రిజిస్టర్ కార్యాలయం రిజిస్ట్రేషన్ కోసం వేచి చూస్తున్నామని క్రయ విక్రయదారులు చెప్పారు. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కనీస వసతులు కూడా లేవన్నారు.
ఇటీవలే ఏపీలోనూ నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు..!
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో రోజూ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరో రెండ్రోజుల్లో భూముల విలువ పెరుగుతూ వుండటంతో .. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. చలానాల ధర పెరగడంతో తమపై అధిక భారం పడుతుందని భావించి సామాన్యులు తమ భూముల క్రయ విక్రయాలు త్వరగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సర్వర్లు మొరాయించడంతో సోమవారం ఉదయం నుంచి భూముల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. 2010కి ముందు రాష్ట్రంలో మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరిగేవి.
ఏపీలో భూముల ధరలు పెంచేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. జులై ఫస్ట్ నుంచి చాలా ప్రాంతాల్లో భూముల మార్కెట్ వ్యాల్యూ పెరగనుంది. దానికి సంబంధించి జిల్లాల జాయింట్ కలెక్టర్లు ధరలు నిర్థారిస్తూ జాబితా సిద్ధం చేశారు. గతేడాది జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఒకసారి మార్కెట్ ధరలు పెంచింది ఏపీ ప్రభుత్వం. జిల్లా కేంద్రాలతోపాటు డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రేట్లు హైక్ చేసింది. తాజాగా మరోసారి భూముల ధరలు పెంపునకు రెడీ అయింది. అయితే.. గతంలో ఎక్కడెక్కడ ధరలు పెంచలేదో ఆయా ప్రాంతాల్లో మాత్రమే ల్యాండ్ రేట్లు పెరగనున్నాయి. అందులోనూ.. డిమాండ్ ఎక్కువగా ఉన్న చోటే ధరలు పెంచబోతోంది ఏపీ సర్కార్.