అన్వేషించండి

Kishan Reddy : తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి - కన్నీరు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి !

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి కన్నీరు పెట్టుకోవడం హైలెట్ గా నిలిచింది.

Kishan Reddy :  తెలంగాణ బీజేప అధ్యక్షుడిగా  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెడ్డిబాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు అప్పగించారు.  రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి  బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ముందుగా నిర్ణయించిన శుభ ముహూర్తంలో 2023 జూలై 21న ఉదయం 11.45 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.  అంతకుముందు పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఉదయం 7.30 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 8.20 గంటలకు అంబర్ పేటలోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కిషన్ రెడ్డి.  కిషన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు,  తెలంగాణ ఏర్పడిన 2014లో ఓసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి సభలో.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.  బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించిన సమయంలో.. ఆయన్ను చూసి కన్నీళ్లు వచ్చాయని.. బాత్రూంకి వెళ్లి ఏడ్చానంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. బండి సంబయ్ ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూనే.. ఆయన వల్లే తెలంగాణలో బీజేపీ బలపడిందన్నారు.  జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలు సంజయ్ నాయకత్వంలోనే జరిగాయని గుర్తు చేశారు.                          

కేసీసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడేందుకే బీజేపీలో చేరానని.. పార్టీ మారే ప్రసక్తే లేదని.. కిషన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తానని ప్రకటించారు.   మునుగోడులో నైతిక విజయం బీజేపీదే అన్నారాయన. బీజేపీబీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని ప్రచారం చేస్తున్నారని.. ఎప్పటికీ అలా జరగదన్నారు రాజగోపాల్ రెడ్డి. కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణలో.. బండి సంజయ్ గురించి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.                       

ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కొరకు  బీజేపీ జాతీయ నాయకత్వం  సంస్థాగత మార్పులు చేసింది.ఈ క్రమంలోనే  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న  బండి సంజయ్ ను తప్పించి  ఆయన స్థానంలో  కిషన్ రెడ్డిని నియమించింది.  బండి సంజయ్ ను బీజేపీ జాతీయ నాయకత్వంలోకి తీసుకుంది. 2024 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక  స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవలనే  హైద్రాబాద్ లో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులతో  జేపీ నడ్డా సమావేశమయ్యారు. దక్షిణాదిలో  వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  చర్చించారు.  దక్షిణాదిలోని  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ  ప్రయత్నిస్తోంది.                          

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget