Weather Updates: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు - ఏపీ, తెలంగాణలో నేటి నుంచి మోస్తరు వర్షాలు
Rains In Telangana : ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి కొమొరిన్ ప్రాంతం, మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్ర, కర్ణాటకలో 0.9 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఏపీ, తెలంగాణలో కొన్నిచోట్ల నేడు వర్షాలు కురుస్తాయి.
![Weather Updates: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు - ఏపీ, తెలంగాణలో నేటి నుంచి మోస్తరు వర్షాలు Rains In AP Telangana: Weather updates today 5 September 2022 Rain News Weather Updates: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు - ఏపీ, తెలంగాణలో నేటి నుంచి మోస్తరు వర్షాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/25e39ed6ff99f35895d6af93344bc8561662343905182233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rains in Telangana AP: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు లేక వాతావరణం వేడెక్కుతోంది. నేటి నుంచి కొన్నిరోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల మాత్రమే తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణం వైపు నుంచి గాలులు వీస్తున్నాయి. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి కొమొరిన్ ప్రాంతం, మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక లోపల 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
తెలంగాణలో వర్షాలు, ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్
రాష్ట్రానికి మరోసారి వర్ష సూచన ఉంది. ఆగస్టు 9 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగరి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. ఈ మేరకు ఆగస్టు 9 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ నగరంలో ఉదయం మేఘాలతో ఉన్నా, మధ్యాహ్నానికి వేడి గాలులు వీచనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడి ఉపశమనం కలుగుతుందని అధికారులు తెలిపారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 4, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఆదివారం ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. నేడు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల వర్షాలు లేక, పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అన్నదాతలు వర్షాల కోసం చూస్తున్నారు.
Impact based forecast of Andhra Pradesh dated 04.09.2022 pic.twitter.com/s9K60UP2RE
— MC Amaravati (@AmaravatiMc) September 4, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి రెండు రోజులపాటు తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో మాత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ కేంద్రం. కృష్ణా, గుంటూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. దక్షిణ కోస్తాంధ్రలో తీరంలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. రాయలసీమలో చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)