అన్వేషించండి

Rahul Gandhi: మహిళలకు ఏడాదికి రూ.1 లక్ష, రైతులకు కనీస మద్ధతు ధర- కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన రాహుల్ గాంధీ

Telangana Congress Manifesto: సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తుక్కుగూడ జన జాతర సభలో రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. ఇందులో తెలంగాణ అంశాలను పేర్కొన్నారు.

Congress Manifesto: తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్ లో 6 గ్యారంటీలు ప్రకటించిన తుక్కుగూడలోనే కాంగ్రెస్ మరో సభ నిర్వహిస్తోంది. తుక్కుగూడ వేదికగా రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికలకు 5 గ్యారంటీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు. అంతకుముందు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి కాంగ్రెస్ తుక్కుగూడలో నిర్వహిస్తోన్న జన జాతర సభకు హాజరయ్యారు. తుక్కుగూడ వేదికగా రాహుల్ గాంధీ తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు శంఖారావం పూరించారు. 

తుక్కుగూడలో జన జాతర బహిరంగసభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘తెలంగాణలో కొన్ని నెలల కిందట రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం మేం 6 గ్యారంటీలను ఇక్కడే తుక్కుగూడ వేదికగా ఆవిష్కరించాం. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల కోసం న్యాయ పత్రం పేరుతో హామీల మేనిఫెస్టోను ఆవిష్కరించాం. మేం ఇక్కడ చెప్పినప్పుడు కాంగ్రెస్ గ్యారంటీలు. కానీ తరువాత అవి ప్రజల గొంతు వినిపించిన గ్యారంటీలుగా మారాయి. రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అయినా చెప్పినట్లుగానే అమలు చేసింది కాంగ్రెస్ ’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ ఇంకా మాట్లాడుతూ.. ‘దేశ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలను ఇచ్చింది. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాం. ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీది కాదు, ప్రజలకు కావాల్సిన మేనిఫెస్టో. ప్రజలు కోరుకున్న మేనిఫెస్టో ఇది. మేనిఫెస్టోలో ప్రధానంగా 5 గ్యారంటీలు ఉన్నాయి. 

1) నిరుద్యోగులకు లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలను అందిస్తాం. అప్రెంటిస్ కార్యక్రమం మొదలుపెట్టాలని నిర్ణయించాం. జాతీయ ఉపాధి తరహాలో దేశ వ్యాప్తంగా ఏడాది పాటు అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ ఇస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో లక్ష రూపాయల జీతం వచ్చేలా చేస్తాం. యువలకులకు సంబంధించి ఎన్నో విషయాలు చేర్చినట్లు మేనిఫెస్టో చూస్తే మీకు అర్థమవుతుంది. 

2) ఉద్యోగం చేసే మహిళలు కుటుంబసభ్యుల బాగోగులు చూసుకుంటూ రెండు డ్యూటీలు చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం వచ్చాక చాలా మంది పేదలయ్యారు. వీరి కోసం నారీ న్యాయ్ స్కీ్మ్ తీసుకొస్తున్నాం. ప్రతి పేద కుటుంబంలో ఓ మహిళకు ఏడాదికి రూ.1 లక్ష రూపాయలు అందిస్తాం. ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.  

3) కిసాన్ న్యాయం - దేశంలో వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతిరోజూ 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మోదీ సర్కార్ ధనవంతులకు రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది. రైతులకు ఏ న్యాయం చేయలేదు. మేం కేంద్రంలో అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేస్తాం. పంట కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. ఎంఎస్ స్వామినాథన్ ఫార్ములా ప్రకారం కనీస మద్ధతు ధర కల్పించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

4) కార్మికులకు న్యాయం  -  కార్మికులకు, కూలీలకు కనీస వేతనం తీసుకొస్తాం. జాతీయ ఉపాధి పథకంలోగానీ, ఇతర పథకాల కింద రోజువారి పనులు చేస్తే రోజూ కనీసం రూ.400 వచ్చేలా చర్యలు తీసుకుంటాం. 

5) దేశంలో 50 మంది జనాభా వెనకబడి ఉన్నారు. 15 శాతం జనాభా దళితులు ఉన్నారు. 8 శాతం జనాభా ఆదివాసీలు, గిరిజనులు ఉన్నారు. 15 శాతం మైనార్టీలు ఉన్నారు. 5 శాతం జనాభా జనరల్ కేటగిరికి చెందిన నిరుపేదలు ఉన్నారు. మొత్తంగా చూస్తే 90 శాతం జానాభా వీరే. కానీ వీళ్లు ఏ పెద్ద సంస్థలో ఉండరు. వీరికి అంతగా అవకాశాలు లేవు. మీడియా కంపెనీ ఓనర్లను గమనిస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కనిపించరు. దేశంలో పెద్ద కంపెనీల జాబితా చూస్తే వీళ్లు ఒక్కరూ కనిపించరు. దేశాన్ని నడిపించే 90 మంది ఐఏఎస్ లలో ముగ్గురు బీసీలున్నారు. వీరిలో ఒక్క గిరిజనుడు, దళితులు ముగ్గురు మాత్రమే ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. బడ్జెట్ లో ఖర్చయ్యే 100లో కేవలం 6 రూపాయలను దళితులు, ఆదివాసీలకు ఖర్చు పెడుతున్నారు. తెలంగాణలో చేసినట్లు దేశ వ్యాప్తంగా కుల గణన చేపడతాం. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget