అన్వేషించండి

తెలంగాణలో 13 రోజులపాటు రాహుల్ భారత్ జోడో యాత్ర, పూర్తి షెడ్యూల్ ఇదే

అక్టోబర్ 24న రాహుల్ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. తెలంగాణలో మొత్తం 13 రోజులకు రాహుల్ గాంధీ పాదయాత్రను కుదించారు.

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో యాత్ర ముగించుకున్న రాహుల్ గాంధీ ప్రస్తుతం కర్ణాకలో పాదయాత్ర చేస్తున్నారు. అనంతరం తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. అక్టోబర్ 24న తెలంగాణలో ప్రవేశించనున్న రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలో 13 రోజులపాటు జరగనుంది. ఇందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది పీసీసీ. తెలంగాణలో 359 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ షెడ్యూల్..
కాంగ్రెస్ ను మరోసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడంలో భాగంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా తెలంగాణలో మొత్తం 13 రోజులకు రాహుల్ గాంధీ పాదయాత్రను కుదించారు. 13 రోజుల పాటు రోజు వారీగా రాహుల్ యాత్రలో పాల్గొనే నియోజకవర్గాల జాబితా కూడా సిద్ధం చేశారు. మక్తల్  నియోజకవర్గం కృష్ణా మండలం, కృష్ణా గ్రామం వద్ద తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఈ విషయాన్ని తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల వెల్లడించారు.

1వ రోజు షెడ్యూల్..
తెలంగాణలో తొలిరోజు రాహుల్ గాంధీ మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారత్ జోడో యాత్ర.. కొడంగల్, నారాయణ పేట, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గ నేతలతోపాటు రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొంటారు. 

2వ రోజు షెడ్యూల్..
దేవరకద్ర నియోజకవర్గంలో కల్వకుర్తి, దేవరకొండ, వనపర్తి, అచ్చంపేట సెగ్మెంట్ నేతలతో కలిసి రాహుల్ పాదయాత్ర

3వ రోజు షెడ్యూల్..
మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్రలో తాండూర్, పరిగి, దేవరకొండ మినహా నల్గొండ పార్లమెంట్ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.

4వ రోజు షెడ్యూల్..
జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర..
నాగర్ కర్నూల్ ఖమ్మం లోక్ సభలోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలు పాల్గొంటారు.

5వ రోజు షెడ్యూల్..
షాద్ నగర్ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్రలో
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు భువనగిరి లోక్ సభ లోని అసెంబ్లీ కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు.

6వ రోజు షెడ్యూల్..
శంషా బాద్ రీజియన్‌లో జరిగే యాత్రలో హైదరాబాద్ లోక్ సభలోని అసెంబ్లీ స్థానాలతోపాటు రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గ నేతలు రాహుల్ తో కలిసి పాదయాత్రలో ఉంటారు

7వ రోజు షెడ్యూల్..
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పాదయాత్రలో చేవెళ్ల లోక్ సభలోని మహేశ్వరం, రాజేంద్ర నగర్ మినహా మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లు, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొంటారు.

8వ రోజు షెడ్యూల్..
బీహెచ్ఈఎల్ ప్రాంతంలో రాహుల్ భారత్ జోడో పాదయాత్ర సాగనుంది. ఈరోజు మల్కాజ్ గిరి, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ నేతలు యాత్రలో భాగస్వాములు అవుతారు.

9వ రోజు షెడ్యూల్..
సంగారెడ్డిలో రాహుల్ యాత్ర కొనసాగిస్తారు. మెదక్, వరంగల్ లోక్ సభ సెగ్మెంట్లలోని పార్టీ నేతలు వెంట ఉంటారు.

10వ రోజు షెడ్యూల్..
జోగి పేటలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు. ఈ యాత్రలో జహీరాబాద్, పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని నేతలు భాగస్వాములు అవుతారు.

11వ రోజు షెడ్యూల్..
రాహుల్ పాదయాత్ర శంకరం పేట ప్రాంతంలో కొనసాగనుంది.
ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు.

12వ రోజు షెడ్యూల్..
తెలంగాణలో రాహుల్ యాత్ర 12వ రోజు జుక్కల్ ప్రాంతంలో జరుగుతుంది. ఈరోజు పాదయాత్రలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలు హాజరు కానున్నారు.

13వ రోజు షెడ్యూల్..
వరుసగా రెండో రోజు జుక్కల్ లోనే రాహుల్ పాదయాత్ర కొనసాగిస్తారు. చివరిరోజు పాదయాత్రలో కరీంనగర్ లోక్ సభ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలతోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలో ముగియనుంది.



టాప్ హెడ్ లైన్స్

Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget