అన్వేషించండి

పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే

Professor Nageshwar | కాసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అంటూ సోషల్ మీడియా ప్రచారంపై ఏబిపి దేశం ఆయనను సంప్రదించింది. అరెస్ట్ వార్తలపై ఏబిపి ప్రతినిధితో ఫోన్లో మాట్లాడిన నాగేశ్వర్ ఏమన్నారంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది.
  • పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నాగేశ్వర్ స్పందన, అరెస్ట్ వార్తలు షికార్లు చేశాయి.
  • అరెస్ట్ వార్తలను ప్రొఫెసర్ నాగేశ్వర్ ఖండించి, భద్రత కల్పించారని తెలిపారు.
  • ఏపీ హోం మంత్రి కూడా అరెస్ట్ వార్తలను ఖండించారు.

ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం తారాస్థాయికి చేరింది. జనసేన అంతర్గత సమావేశంలో పవన్, అమిత్ షా మధ్య జరిగిన సంభాషణలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఓ టీవీ ఛానెల్ డిబేట్ లో జనసేనను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నాగేశ్వర్ ను జనసేన, పవన్ అభిమానులు టార్గెట్ చేయడం, తిరిగి నాగేశ్వర్ వాటికి కౌంటర్ ఇవ్వడంతో మొదలైన వివాదం కాస్తా పవన్ కళ్యాణ్ స్పందించే వరకూ వెళ్లింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. క్రెడిబిలిటీ ఉన్న ప్రొఫెసర్ వంటి వ్యక్తులు ఇలా మాట్లాడం సరికాదంటూ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు ఇక చూస్తూ ఊరుకోమంటూ పవన్ ఘాటుగా స్పందించారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అని ప్రచారం..

సీన్ కట్ చేస్తే మంగళవారం ఉదయం నుండి ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు షికార్లు కొట్టాయి. తెలంగాణకు ఏపి పోలీసులు చేరుకున్నారని, హైదరాబాద్ లోని నాగేశ్వర్ ఇంటి వద్దకు ఏపి పోలీసులు వచ్చారంటూ వాట్సప్ గ్రూపుల్లో వార్తలు దుమారం రేపాయి. ఇంకేముంది మరికాసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అని అంతా అనుకుంటున్న సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ను ABP Desam సంప్రదించింది.

అరెస్ట్ వార్తల పై ఏబీపీ దేశం ప్రతినిధితో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫోన్లో మాట్లాడారు. అవన్నీ బోగస్ వార్తలేనని, నమ్మాల్సిన అవసరం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. నా ఇంటి వద్ద ఉన్నది పోలీసులే కానీ వాళ్లు ఏపీ పోలీసులు కాదు, తెలంగాణ పోలీసులు అని క్లారిటీ ఇచ్చారు. ఇటీవల తనపై వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా బెదిరింపు మేసేజ్ లు, కాల్స్ రావడంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు ‘ఏబీపీ దేశం’కు తెలిపారు ఫ్రొఫెసర్ నాగేశ్వర్.

Also Read: AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం

పవన్ కళ్యాణ్ తో వివాదంపై ఏమన్నారంటే..

పవన్ కళ్యాణ్ , అమిత్ షాకు సంబంధించిన వ్యవహారంలో నేను చేసిన కామెంట్స్ ను ఉపసంహరించుకున్నాను. ఇప్పటికే జనసేన క్యాడర్ కు కూడా ఈ విషయంపై ఎటువంటి కామెంట్స్ చేయొద్దంటూ పార్టీ నుండి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇది ఇప్పటికే ముగిసిన వివాదం. దీనిపై మాట్లాడటం సరికాదు. ముగిసిన అధ్యాయం తెరవమంటే కుదరదు. నేను ఉపసంహరించుకున్న మాటలపై నేను మళ్లీ మాట్లాడను. ఇప్పటి వరకూ ఏపీ పోలీసుశాఖ నుండి నాకు ఎటువంటి నోటీసులు రాలేదు. నాపై కేసు నమోదైనట్లు ఏపి పోలీసులెవ్వరూ చెప్పలేదు. ఫోన్ లేదా వాట్సప్ ద్వారా ఏపి పోలీసుల నుండి నాకు ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం అందలేదు.

Also Read: TDP Mahanadu 2026: నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ మహానాడు.. ఈసారి అజెండా, తీర్మానాలు, ప్రత్యేకతలు ఇవే

అరెస్ట్ వార్తలపై స్పందించిన ఏపీ హోం మంత్రి

ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేసేందుకు ఏపి పోలీసులు తెలంగాణ చేరుకున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఏపీ హోం మంత్రి అనిత తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. నాగేశ్వర్ ను అరెస్ట్ చేసేందుకు ఏపీ నుండి పోలీసులు ఎవరూ హైదరాబాద్ వెళ్లలేదు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దురుద్దేశ్యంతోనే ఇలాంటి అసత్య ప్రచారం చేసి, కావాలనే ట్రోల్ చేస్తున్నారు. ఇటువంటి వారిపై చట్టపరంగా పోలీసుశాఖ తగిన చర్యలు తీసుకుంటుందంటూ ఫేక్ ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

Frequently Asked Questions

పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య వివాదం ఎందుకు మొదలైంది?

జనసేన అంతర్గత సమావేశంలో పవన్, అమిత్ షా మధ్య జరిగిన సంభాషణలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల వల్ల ఈ వివాదం మొదలైంది.

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అవుతారని వార్తలు రావడానికి కారణం ఏమిటి?

సోషల్ మీడియాలో ఆయనపై బెదిరింపు సందేశాలు, కాల్స్ రావడంతో తెలంగాణ పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. అయితే, కొందరు దీన్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని తప్పుగా ప్రచారం చేశారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలపై స్పందించారా?

అవును, పవన్ కళ్యాణ్, అమిత్ షాకు సంబంధించిన వ్యవహారంలో తాను చేసిన కామెంట్స్ ను ఉపసంహరించుకున్నానని, ఇది ముగిసిన వివాదమని తెలిపారు.

ఏపీ హోం మంత్రి అరెస్ట్ వార్తలపై ఏమన్నారు?

ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు తెలంగాణ వెళ్లలేదని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఏపీ హోం మంత్రి తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
CM Revanth Reddy: హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ!
హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget