అన్వేషించండి

Pawan Kalyan on Nageshwar: జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?

Pawan Warning: విశ్లేషణల పేరుతో వ్యక్తిత్వాన్ని కించ పరిస్తే సహించేది లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు .అమిత్ షాతో మాట్లాడుతుంటే వాళ్లు విన్నాారా అని ప్రొ. నాగేశ్వర్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Pawan Kalyan Serious Warning: 

వ్యక్తిగత ఎదుగుదల కోసం తనను పంచింగ్ బ్యాగ్‌లా వాడుకోవడం మానేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శకులకు.. విశ్లేషకులను హెచ్చరించారు. తన సహనాన్ని పరీక్షించొద్దన్నారు. సోమవారం రాజమండ్రిలో పార్లమెంటరీ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ చాలా తీవ్ర స్థాయిలో రియాక్టయ్యారు. ముఖ్యంగా రాజకీయ విశ్లేషణల పేరుతో క్యారెక్టర్ ను కించ పరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు . రాజకీయాల్లో తనను  పంచింగ్ బ్యాగ్ లా వాడుకోవడం ఇకపై సాధ్యం కాదని, సహనానికీ ఒక హద్దు ఉంటుందని గత పుష్కర కాలంగా తాను ఎన్నో అవమానాలను, వ్యక్తిగత విమర్శలను భరిస్తూ వచ్చానని, కానీ తన మౌనాన్ని బలహీనతగా భావిస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  "భరిస్తాం, సహిస్తాం.. హద్దులు దాటితే తాట తీస్తాం" అంటూ ఆయన ఇచ్చిన హెచ్చరించారు. 

ప్రొ. నాగేశ్వర్‌పై పరోక్ష కామెంట్స్

ఇటీవల పవన్ కల్యాణ్ గురించి రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. వైసీపీ అధినేత జగన్‌ను అరెస్ట్ చేయాలని పవన్ కల్యాణ్ అడిగితే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిరాకరించారని ఆయన చేసిన కామెంట్లపై జనసేన నేతలు తీవ్రంగా రియాక్టయ్యారు. ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. దానిపై పవన్ కల్యాణ్ ఇవాళ రియాక్ట్ అయ్యారు. ప్రొఫెసర్ పేరెత్తకుండానే ఇాలాంటివి తాను సహించలేనన్నారు. అమిత్‌షాతో నేను మాట్లాడినప్పుడు.. ఆయన పక్కన ఉన్నారా..? ఆయనంటే గౌరవం ఉంది.. కానీ దారినపోయే వాళ్లు చేసినట్లుగా.. ఓ స్థాయిలో ఉన్న వాళ్లు ఇలాంటి కామెంట్లు చేయకూడదు.. " అన్నారు. 

వ్యక్తిత్వ హననంపై ఆగ్రహం 

రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ ఒక పథకం ప్రకారం తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించబోనని పవన్ హెచ్చరించారు. "నాకు కులం, ప్రాంతం అంటగడుతున్నారు. కానీ నేను తిరిగి సమాధానం ఇస్తే మాత్రం మీకు కులం గుర్తొస్తుందా? మేధావులమని చెప్పుకునే వారు తమ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే మేము చేతులు కట్టుకుని కూర్చోవాలా?" అని ఆయన ప్రశ్నించారు. సామాన్య మనుషుల్లాగే తమకూ ఆవేశం, కడుపు మంట ఉంటాయని, ఇకపై ప్రతి విమర్శకు అదే స్థాయిలో కౌంటర్లు ఉంటాయని స్పష్టం చేశారు. నేను అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి? ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.  'నేను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చాను. శత్రువు బలంగా ఉన్నప్పుడే ఎదుర్కొంటా.. బలహీనులను కాదు' అని వ్యాఖ్యానించారు.  


జగన్ జైలు కోసం నేను అడుగుతానా..? నా తెగింపు తెలీదా..?

జగన్‌ను జైలులోకి పంపించమని తాను కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను అడిగానని చెప్పడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జగన్‌ ను జైలుకు పంపమని అడగాల్సిన అవసరం తనకేంటన్నారు. ఒకవేళ ఆయన జైలుకు వెళితే తన పార్టీకి ఏమైనా లాభమా అని ప్రశ్నించారు. డర్టీ పాలిటిక్స్ చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని.జగన్ కంటే ముందే తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. వైఎస్ ఉన్నప్పుడే తుపాకి సరెండర్ చేసి రాజకీయాల్లోకి వచ్చానని అంతటి తెగింపు ఉన్న తాను జగన్‌పై కంప్లెయింట్ చేస్తానా ..? అని ప్రశ్నించారు.  అయినా ప్రధాని, హోం మంత్రిలను కలిసినప్పుడు దేశ భవిష్యత్, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాలు మాట్లాడతాం కానీ... జగన్ గురించి ఎందుకు చెబుతామన్నారు.  అయినా జగన్‌ను ఏం చేయాలో వ్యవస్థలకు తెలుసన్నారు. 

పార్టీ నేతలకు హెచ్చరిక

గీతదాటుతున్న పార్టీ నేతలకు పవన్ హెచ్చరికలు జారీ చేశారు. తనకు నచ్చినట్లుగా పార్టీని నడుపుతానని ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోవచ్చన్నారు. కులాల మధ్య  చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పదవులు వచ్చిన తర్వాత చాలా మంది జనసేన నాయకులు మెత్తబడిపోయారని, అలాంటి నాయకులు జనసేనకు అవసరం లేదని స్పష్టం చేశారు.  మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు. శత్రువులు బయట ఎక్కడో లేరు.. మన పార్టీలోనే ఉన్నారు అంటూ పార్టీ నేతలకు పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనలో ఉండగలిగేవాళ్లు మాత్రమే పార్టీలో ఉండండి అని స్పష్టం చేశారు. నేను టీడీపీ కోసం కాదు.. రాష్ట్రం కోసం సర్దుకుపోతున్నా  అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇకపై జనసేన కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని, వ్యక్తిగతంగా విమర్శిస్తే అదే స్థాయిలో బదులిస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 

తమిళనాడు రాజకీయాలను చూసి జెలసీ కలిగింది..!

జనసేనాని పవన్ కళ్యాణ్ పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజకీయాలపై, అక్కడ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే సాధించిన తాజా విజయాలపై అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనను, విజయ్‌ను పోలుస్తూ వస్తున్న కామెంట్లపై స్పందించిన ఆయన.. తమిళ పాలిటిక్స్‌ను చూస్తే తనకు కొంత అసూయ  కలిగిందని మనసులో మాటను బయటపెట్టారు. "అక్కడ రాజకీయాలు ఎంత సుఖంగా సాగాయో చూశాను.. తమిళనాడులో విజయ్ అభిమానులంతా విభేదాలు లేకుండా ఏకతాటిపై నిలబడ్డారు, ఎంచక్కా కటౌట్లు పెట్టుకున్నారు, ప్రచారం చేశారు, ఒకేసారి సీఎంను చేసేశారు. కానీ ఆంధ్రాలో నా పరిస్థితి అలా కాదు. నన్ను దాదాపు 15 సంవత్సరాల పాటు రోడ్డు మీద దేకిచ్చారు  అంటూ పవన్ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పడ్డ కష్టాలను, ఆవేదనను గుర్తుచేసుకున్నారు.  "మనకు అనుకూలంగా మాట్లాడటానికి కనీసం సొంతంగా టీవీ ఛానళ్లు ఉన్నాయా? ఆఖరికి మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అయినా నాకు ఏదైనా కష్టం వస్తే ఒకే తాటిపై, ఏకాభిప్రాయంతో నిలబడుతున్నాయా?" అంటూ పార్టీ అంతర్గత లోపాలను సున్నితంగా వేలెత్తి చూపారు. కేవలం సినిమా క్రేజ్, కటౌట్లు చూసి ఓట్లేసే సంస్కృతి కంటే ఏపీలో కుల సమీకరణాలు, పక్కా వ్యూహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయని, అందుకే తాను ఎన్నో అవమానాలు భరించి, పొత్తుల ఫార్ములాతో నిలబడాల్సి వచ్చిందని వివరించారు.  

 

టాప్ హెడ్ లైన్స్

Aggipetti Macha : ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
Vijayawada Police: విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
Chandrababu Naidu CII Partnership Summit: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget