అన్వేషించండి

Vande Bharat Train: తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ బుకింగ్స్ నేటి నుంచే ప్రారంభం

Vande Bharat Train: రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు నుంచే ఆ రైలుకు సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. 

Vande Bharat Train: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో వేచి చూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఆదివారం ఉదయం పది గంటల నుంచి అందుబాటులోకి రానుంది. క్షణాల్లో వేగం అందుకుంటూ గంటకు 90 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో పట్టాలపై పరుగులు తీస్తుంది. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైలుకు పచ్చెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపనున్నట్లు సమాచారం. అయితే ఈ రైలుకు సంబంధించిన బుకింగ్స్ ఈరోజు నుంచే ప్రారంభం అయ్యాయి. వందే భారత్ రైల్లో మొత్తం 16 కోచ్ లు ఉంటాయి. ఇందులో రెండు కోచ్ లు ఎగ్జిక్యూటివ్ కేటగిరీవి. మిగతావి ఎకానమీ కోచ్ లు. ఎగ్జిక్యూటివ్ కోచ్ లో 104 సీట్లు ఉంటాయి. ఎకానమీ క్లాస్ లో వెయ్యి 24 కాగా.. మొత్తం 1,128 ఉంటాయి. 

ఆన్ లైన్ తో పాటు కౌంటర్లలో కూడా ఈ టికెట్లు అందుబాటిలో ఉంటాయి. ధరపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే చెన్నై-మైసూర్ మార్గంలో వందే భారత్ రైలు టికెట్ ధర రూ.1200కు(ఏసీ చైర్ కార్ కోసం), ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోసం రూ.2,200కి తక్కువగా లేదు. దూరాన్ని బట్టి విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ టికెట్ ధర ఎంత అనేది నిర్ధారించనున్నారు. అయితే రేపు ప్రారంభం కాబోయే ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ 21 స్టేషన్లలో ఆగుతుంది. మార్గమధ్యంలో చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ జంక్షన్, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతూ.. విశాఖ చేరుకుంటుంది. ఆ తర్వాత అంటే రెండోరోజు నుంచి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. 

మామూలుగా అయితే నాలుగు స్టేషన్లలోనే..

వందే భారత్ రైలు సికింద్రాబ్ద లో బయలుదేరి విశాఖ చేరుకునేలోపు కేవలం నాలుగు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. సోమవారం నుంచి రెగ్యులర్ ప్రయాణాన్ని ప్రారంభించనున్న వందేభారత్ రైలు, సికింద్రాబాద్ స్టేషన్ లో మధ్యాహ్నం  గంటలకు బయలు దేరుతుంది. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలోనే ఆగనుంది. గమ్యస్థానమైన విశాఖకు రాత్రి 11.30 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. అవే నాలుగు స్టేషన్లలో నిర్దేశిత సమయాల్లో ాగుతూ మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. 

1128 మంది ప్రయాణికులు కూర్చునే అవకాశం..

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. మొత్తం 1128 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉందని అధికారులు వెల్లడించారు. ఒక్కో కోచ్ పొడవు 23 మీటర్లు కాగా, 52 మంది కూర్చునేలా ఫస్ట్ క్లాస్ కోచ్‌లు రెండున్నాయి. రైలును స్లైడింగ్‌ డోర్లు, రీడింగ్‌ లైట్స్‌, అటెండెంట్‌ కాల్‌ బటన్లు, ఆటోమెటిక్‌ ఎగ్జిట్‌, ఎంట్రీ డోర్లు, సీసీటీవీ కెమెరాలు, పడుకునే సౌకర్యం కలిగిన కుర్చీలతో అత్యధునికంగా తీర్చిదిద్దారు.  ఈ ట్రైన్ పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షలో ఉంటుంది. ఈ సీసీ కెమెరాలు లోకో పైలెట్‌ క్యాబిన్‌కు అనుసంధానించి ఉంటాయి. లోకో పైలెట్‌ కంట్రోల్లోనే కోచ్‌ల తలుపులు తెరుచుకునే, మూసివేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. మెట్రో రైల్లో మాదిరిగా ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం టాక్‌ బ్యాక్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Konda Surekha: కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget