Breaking News Live: విశాఖ ఏజెన్సీలో నాటుతుపాకీతో బావను కాల్చి చంపిన బావమరుదులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం పొడిగానే ఉండనుంది.
ఈ ఈశాన్య గాలుల ప్రభావంతో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇక గత 24 గంటల్లో సముద్రంలో ఏర్పడ్డ మేఘాల వల్ల నిన్న రాత్రి విశాఖపట్నంలోని ఉత్తర భాగాల్లో వర్షాలు కురిసాయని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ తెలిపారు. రాత్రి సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయని అన్నారు.
తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. తూర్పు దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 4 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంటుంది. ముందు రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 30.6 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 17.6 డిగ్రీలుగా నమోదైంది.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు భారీగా పెరిగింది. గ్రాముకు రూ.100 చొప్పున ఎగబాకింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.500 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.46,800 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,050 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.67,400గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,400 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,800 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,050గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,400గా ఉంది.
విశాఖ ఏజెన్సీలో నాటుతుపాకీతో బావను కాల్చి చంపిన బావమరుదులు
విశాఖ ఏజెన్సీలో దారుణం ఘటన చోటుచేసుకుంది. చింతపల్లి మండలం కిటుముల పంచాయతీ భూసిబంధ గ్రామంలో బామమరుదులు తుపాకీతో బావను కాల్చిచంపారు. పాత కక్షల నేపథ్యంలోనే హతమార్చినట్లు మృతుడు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాంగి సుమత్ తన భార్య రస్సుతో బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తుండగా నాటు తుపాకీతో కాల్పులు జరిపారు బావమరుదులు పెంటయ్య, నాగేశ్వరరావు. సంఘటనా స్థలంలోనే పాంగి సుమత్ కుప్పకూలాడు. ఈ ఘటనపై పాంగీ సుమత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్ చల్
కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. దీంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అకాడమిక్ బిల్డింగ్ సమీపంలోని బాయ్స్ హాస్టల్ వద్ద విద్యార్థులకు ఎలుగుబంటి కనిపించింది. సమీపంలోని శేషాచలం కొండల నుంచి క్యాంపస్ లోకి ఎలుగుబంటి వచ్చినట్లు తెలుస్తోంది. క్యాంపస్‌లో దాదాపు 5000 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు సంబంధించిన రక్షణ గోడ కొన్నిచోట్ల దెబ్బతినడంతో అందులోంచి ఎలుగుబంటి క్యాంపస్ లోకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలోకి ఎలుగుబంటి వచ్చిందన్న సమాచారం తమకు తెలియదని అటవీశాఖ అధికారులు అంటున్నారు.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్ చల్
కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. దీంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అకాడమిక్ బిల్డింగ్ సమీపంలోని బాయ్స్ హాస్టల్ వద్ద విద్యార్థులకు ఎలుగుబంటి కనిపించింది. సమీపంలోని శేషాచలం కొండల నుంచి క్యాంపస్ లోకి ఎలుగుబంటి వచ్చినట్లు తెలుస్తోంది. క్యాంపస్‌లో దాదాపు 5000 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు సంబంధించిన రక్షణ గోడ కొన్నిచోట్ల దెబ్బతినడంతో అందులోంచి ఎలుగుబంటి క్యాంపస్ లోకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలోకి ఎలుగుబంటి వచ్చిందన్న సమాచారం తమకు తెలియదని అటవీశాఖ అధికారులు అంటున్నారు.
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కాసేపట్లో ముచ్చింతల్ ఆశ్రమానికి
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ గౌరవ స్వాగతం పలికారు. మరికాసేపట్లో రాష్ట్రపతి కోవింద్ ముచ్చింతల్ వెళ్లనున్నారు. అక్కడ సమతామూర్తి కేంద్రం, ఆలయాలు, బృహన్‌మూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు. అనంతరం రామానుజాచార్యుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించనున్నారు. రామానుజుల స్వర్ణ విగ్రహాన్ని 120 కిలోల బంగారంతో రూపొందించారు. సమతామూర్తి కేంద్రంలోని భద్రవేది మొదటి అంతస్తులో 54 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు.
జల్లికట్టు పోటీల్లో అపశ్రుతి
చిత్తూరు జిల్లా, కుప్పం సరిహద్దు ప్రాంతమైన కోలార్ జిల్లా బంగరుపేట తాలూకా తనిమడుగులో జల్లికట్టు వేడుకలు జోరుగా సాగుతున్నాయి. జల్లికట్టులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతలను పరిశీలించేందుకు వెళ్ళిన కేజిఎఫ్ డీఎస్పి మురళీధర్ తో పాటుగా పలువురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. భధ్రతను పర్యవేక్షిస్తున్న పోలీసుల పైకి ఎద్దు దూసుకుని రావడంతో పోలీసులకు గాయాలు అయ్యాయి. గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం కుప్పం పి.ఈ.ఎస్ ఆస్పత్రికి తరలించారు.