అన్వేషించండి

Tapping Case : ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - 3 రోజుల్లో ప్రభాకర్ రావు రాక - తర్వాత కేసీఆర్ అరెస్టేనా ?

Prabhakar Rao : ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు మూడు రోజుల్లో హైదరాబాద్ రానున్నారు. ఇలా వచ్చే షరతు మీద పాస్ పోర్టు ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

Prabhakar Rao to arrive in Hyderabad in three days : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్  ప్రభాకర్ రావు ఇండియాకు రానున్నారు. ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను జస్టిస్ బి.వి. నాగరత్న ,జస్టిస్ సతీష్ చంద్ర శర్మల బెంచ్ ఈ కేసును విచారించింది.  

ప్రభాకర్ రావు పాస్‌పోర్టు, గతంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పాస్ పోర్టును  తిరిగి అతనికి అందజేయాలని కోర్టు ఆదేశించింది. పాస్‌పోర్టు అందిన మూడు రోజుల్లో ప్రభాకర్ రావు భారత్‌కు తిరిగి రావాలని కోర్టు ఆదేశించింది. అతను దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని, దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని సూచించింది. అదే సమయంలో   తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు తెలంగాణ పోలీసులకు ఆదేశించింది. దీంతో తాత్కాలికంగా అరెస్టు నుంచి తప్పించుకోవచ్చు.   పాస్‌పోర్టు అందిన మూడు రోజుల్లో భారత్‌కు తిరిగి వస్తానని ప్రభాకర్ రావు కోర్టుకు అఫిడవిట్ రూపంలో రాతపూర్వక హామీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 5కు వాయిదా వేసింది. 

సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయిన  ప్రభాకర్ రావు, గత భారత రాష్ట్ర సమితి (BRS) ప్రభుత్వంలో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు,   హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్‌లను  గా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2024 మార్చిలో పంజాగుట్ట పోలీసులు ఈ కేసును నమోదు చేసిన తర్వాత, ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు.  ఏడాదిన్నరగా అమెరికాలో ఉంటున్నారు. విచారణకు సహకరించకపోవడంతో  ఆయనను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. పాస్ పోర్టు రద్దు చేశారు. డిపోర్టేషన్ ఏర్పాట్లు చేస్తున్నారు. తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని అమెరికాలో ఆయన పెట్టుకున్న పిటిషన్లను అక్డి కోర్టులు కొట్టేశాయి.  దీంతో అన్ని దారులు మూసుకుపోయినట్లయింది. 

చివరికి తన పాస్ పోర్టు ఇప్పిస్తే తానే వస్తానని.. పాస్ పోర్టు ఇచ్చిన మూడు రోజుల్లో ఇండియాకు వస్తానని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఆయనకు చాన్సిచ్చింది. పాస్ పోర్టు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. మూడు రోజుల్లో ప్రభాకర్ రావు ఇండియాకు రానున్నారు.   ఇప్పటికే శ్రవణ్ రావు అనే మరో నిందితుడు కూడా ఇండియాకు వచ్చారు. అయనను పలుమార్లు ప్రశ్నించారు. వేరే కేసులో అరెస్టు చేశారు.   గతంలో వీరిద్దరూ ఇండియాకు వచ్చిన మరుక్షణం కేసీఆర్ ను అరెస్టు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. వీరిని బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు.  ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు వచ్చేశారు..మరొకరు వస్తున్నారు. 

ట్యాపింగ్ కేసులో అంతా..  ప్రభాకర్ రావు , కేసీఆర్   చెప్పినట్లే చేశామని..ఇతర నిందితులు చెప్పారు. చాలా కాలం అరెస్ట్ అయి వారంతా బెయిల్ పై బయటకు వచ్చారు.  ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్పే విషయాలు కీలకం కానున్నాయి.            

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget