అన్వేషించండి
Gold Seize: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో భారీగా బంగారం స్వాధీనం
Hyderabad News: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని దాదాపు 34 కేజీల బంగారం సీజ్ చేశారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో బంగారం పట్టివేత
Gold Seized Near Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport) సమీపంలో పోలీసులు శుక్రవారం భారీగా బంగారం పట్టుకున్నారు. తనిఖీల సందర్భంగా బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా.. ఓ కారులో 34 కేజీల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు తరలిస్తున్నట్లు గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలు ముంబయి నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నట్లు గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు చెప్పారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















