అన్వేషించండి

Jogu Ramanna: ఎమ్మెల్యే జోగు రామన్న వాహనం తనిఖీ చేసిన పోలీసులు 

Jogu Ramanna: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు మొదలు పెట్టారు. ఎక్కడికక్కడ ప్రత్యేకంగా చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Jogu Ramanna: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు మొదలు పెట్టారు. ఎక్కడికక్కడ ప్రత్యేకంగా చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రజలు, నాయకులు, ఎమ్మెల్యే అనే తేడా లేకుండా వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా సరిహద్దున పిప్పర్వాడ టోల్ ప్లాజా మీదుగా ఆదిలాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే జోగురామన్న వాహనాన్ని సైతం పోలీసులు తనిఖీలు చేశారు. పొలీసు అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే సహకరించారు. పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. 

పోలీసుల విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా వాహన తనిఖీకి ఎమ్మెల్యే జోగు రామన్న సహకరించారు. పోలీసుల పనితీరుపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. వారికి అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తితో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, సజావుగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. బంధువుల ఇంటి నుంచి ఎమ్మెల్యే జోగురామన్న ఆదిలాబాద్ వెళ్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే వెంట బీఅర్ఎస్ నాయకులు పాకాల రామచందర్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కారింగుల ప్రణయ్ ఉన్నారు. 

రూ.20 కోట్లు సీజ్
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో 258 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్నారు. అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 12 ఉదయం వరకు దాదాపు రూ.20.43 కోట్లు సీజ్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అన్ని చెక్‌పోస్టుల దగ్గర అధికారులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి.. సరైన దృవీకరణ పత్రాలు లేని నగదును స్వాధీనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదే స్థాయిలో మద్యం సైతం పట్టుబడుతోంది. అక్టోబర్ 9 నుంచి 12 తేదీ వరకు రూ.86.92 లక్షలు విలువ చేసే, 31,730 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ తనిఖీల్లో డబ్బు మద్యం కాకుండా బంగారు ఆభరణాలు కూడా సీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 9 నుంచి 12 తేదీ వరకు రూ.14.65 కోట్లు విలువగల బంగారం, వెండి, వజ్రాలను సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. అలాగే మత్తు పదార్థాలు కూడా ఈ తరీక్షల్లో బయటపడుతున్నాయి. రూ.89 లక్షలు విలువ చేసే మత్తుపదార్థాలను అధికారులు సీజ్ చేశారు. తనిఖీల్లో లాప్టాప్‌లు, వాహనాలు ఇతర వంట సామాగ్రి, స్పోర్ట్స్ థింగ్స్, చీరలు కూడా సీజ్ చేశారు. వాటి విలువ 22 లక్షలకు పైగానే ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నగదు, బంగారం ఇతర వస్తువుల తరలింపుపైనా ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఓటర్లను ప్రభావితం చేసేలా తాయిలాలు, నగదు పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలపై నిఘా ఉంటుంది.  నిబంధనల ప్రకారం, రూ.50 వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకు మించి డబ్బు, బంగారం, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే సామగ్రి ఉంటే వాటిని పోలీసులు సీజ్ చేస్తారు. పోలీసులు, అధికారుల తనిఖీల్లో సరైన పత్రాలు చూపించకుంటే.. వాటిని సీజ్‌ చేసే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఎవరైనా తమ వెంట పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళ్తుంటే, అందుకు సంబంధించిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంటే ఉంచుకోవడం ఉత్తమం.

టాప్ హెడ్ లైన్స్

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget