(Source: ECI/ABP News/ABP Majha)
Telangana News : ప్రజలంతా ఒకేసారి జాతీయ గీతాలాపన - తెలంగాణ రికార్డ్ !
తెలంగాణ ప్రజలంతా ఒకేసారి జాతీయ గీతాలాపన ఆలపించి రికార్డు సృష్టించారు. ప్రజలు ఎక్కడి వారక్కడ పదకొండున్నరకు నిలబడిపోయి జాతీయ గీతం ఆలపించారు.
Telangana News : ఉదయం 11.30. తెలంగాణ మొత్తం ఒక్క సారిగా లక్షలాది గొంతులు నుంచి జాతీయ గీతం ఆలపించాయి. ఇళ్లల్లో ఉన్నా.. ఆఫీసుల్లో ఉన్నా.. డ్రైవింగ్‌లో ఉన్నా.. ట్రాఫిక్‌లో ఉన్నా..అందరూ ఒక్క నిమిషం పాటు స్టిఫ్ అలర్ట్ అయ్యారు. ఎక్కడి వారక్కడ జాతీయ గీతాన్ని ఆలపించారు. 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. రాష్ట్రంలోని అన్నీ ప్రధాన కూడళ్లు, మంత్రులు, ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు,అంగన్‌వాడీ కేంద్రాల్లో జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు.
మన తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉప్పల్ రింగ్ రోడ్ లో సామూహిక జాతీయ గీతాలాపన చేయడం జరిగింది.
— Dr BonthuRammohan (@bonthurammohan) August 16, 2022
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తెలంగాణ జాతి ఐక్యతని చూపి మన భారతీయతను గర్వంగా చాటిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు..జై హింద్ 🇮🇳#IndiaAt75@trspartyonline @KTRTRS pic.twitter.com/gmd2rfhJFF
సామూహికంగా జాతీయ గీతాలాపన చేయడమే కాదు.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పలువురు ప్రముఖులు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు @GMRMLAPTC గారి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉదయం 11:30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు @TelanganaCMO @KTRTRS @trsharish @trspartyonline @TRSTechCell @Collector_SRD pic.twitter.com/2DXgW1aoTC
— Gudem Mahipal Reddy (@GMRMLAPTC) August 16, 2022
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఆగస్ట్ 8న ప్రారంభమయ్యాయి. ఆగస్ట్ 22 వరకు వజ్రమహోత్సవాలు కొనసాగనున్నాయి. వజ్రోత్సవాల్లో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వం. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో భాగంగానే మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో అందరూ పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు.
సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఐ.బి చౌరస్తాలో జరిగిన సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్నాను. సీఎం శ్రీ కేసీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం నుంచి సామాన్య పౌరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. pic.twitter.com/UItH0OInfH
— N Diwakar Rao MLA (@NDiwakarRao) August 16, 2022
ఇలా ఓ రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది ఒకే సారి జాతీయ గీతాలాపన చేయడం రికార్డుగా భావిస్తున్నారు. గతంలో ఇలాంటి సందర్భాలు అరుదుగా ఉన్నాయని చెబుతున్నారు.
కొడంగల్ పట్టణంలోని, అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం 11గం.30ని. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో కీలక ఘట్టం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రజలు, నాయకులు, అధికారులతో కలసి ఆలపించడం జరిగింది.@KTRTRS pic.twitter.com/oe8AYUrMBk
— Patnam Narender Reddy (@PNReddyTRS) August 16, 2022