Himachal Floods: వరదల్లో చిక్కుకున్న తెలంగాణ డాక్టర్లు, మంత్రి హరీశ్ కీలక ఆదేశాలు
మెడికల్ స్టూడెంట్స్ జూన్ నెల 28న ఇంకో ఇద్దరు స్నేహితులతో కలిసి లద్దాఖ్, మనాలి పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది.
![Himachal Floods: వరదల్లో చిక్కుకున్న తెలంగాణ డాక్టర్లు, మంత్రి హరీశ్ కీలక ఆదేశాలు Osmania medical collage students stucks in Himachal pradesh floods Himachal Floods: వరదల్లో చిక్కుకున్న తెలంగాణ డాక్టర్లు, మంత్రి హరీశ్ కీలక ఆదేశాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/11/8f1bf48f19bc5e5f5049667e944df5fb1689086481348234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఉత్తర భారతంలో వరదల వల్ల అక్కడి జనజీవనం అతలాకుతలం అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ వరదలు భీభత్సం రేపుతుండగా, అక్కడ తెలంగాణకు చెందిన వారు చిక్కుకుపోయారు. వీరు ఉస్మానియా మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ చదువుతున్నారు. ఈ మెడికల్ స్టూడెంట్స్ జూన్ నెల 28న ఇంకో ఇద్దరు స్నేహితులతో కలిసి లద్దాఖ్, మనాలి పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. వారు ఈ నెల 8న మనాలి నుంచి స్నేహితులతో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత వారు ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. వరదల్లో చిక్కుకున్న మెడికోల గురించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆరా తీశారు. వారి ఆచూకీ తెలుసుకోవాలని, డాక్టర్లను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)