అన్వేషించండి

KCR No Women Candidates : ఏడుగురే మహిళా అభ్యర్థులు - కవిత ఉద్యమం నీరుగారిపోయినట్లేనా ?

బీఆర్ఎస్ జాబితాలో కేవలం ఏడుగురు మహిళా అభ్యర్థులకు మాత్రమే చోటు దక్కింది.


KCR No Women Candidates :   భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేసే 115 మంది అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేశారు. ఇందులో ఏడుగురు మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు. అంటే.. కనీసం ఏడుశాతం శాతం కూడా అవకాశం కల్పించలేదు. ఇప్పుడే కాదు..కేసీఆర్ ఎప్పుడూ ఆ రేంజ్ కన్నా ఎక్కువ అవకాశం కల్పించలేదు. కానీ ఈ సారి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే.. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత .. బీఆర్ఎస్ జాతీయ పార్టీ పెట్టిన తర్వాత.. ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్ ఉద్యమం తెరపైకి తీసుకు వచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు.  పార్లమెంట్ లో మహిళా బిల్లు పెట్టాలని 33 శాతం రిజర్వేషన్లకు ఆమోదించాలని డిమాండ్ చేశారు. 

ఇప్పుడు కల్వకుంట్ల కవిత డిమాండ్ ను ఆమె తండ్రి, తమ పార్టీ చీఫ్ కేసీఆరే పట్టించకోనట్లుగా అయింది. కేవలం ఆరుగురు అంటే ఆరుగురు మహిళా అభ్యర్థులు మాత్రమే జాబితాలో ఉన్నారు. ఈ అంశంపై ఆమె స్పందించే అవకాశం లేదు. సొంత పార్టీని .. అదీ కూడా తండ్రిని ప్రశ్నించలేరు. కానీ ఇక  ముందు ఆమె మహిళా రిజర్వేషన్ కోసం ఉద్యమం అంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ పిలిచారని అందుకే మహిళా రిజర్వేషన్ పేరుతో  పోరాటం చేశారన్న విమర్శలు వచ్చాయి. ఆ కేసు లో కదలికలు ఆగిపోవడంతో.. కవిత కూడా మహిళా రిజర్వేషన్ ఉద్యమం గురించి పట్టించుకోలేదు. 

గత మార్చిలో ఆమె మహిళా రిజర్వేషన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు.  మిస్డ్ కాల్ కార్యక్రమంతో పాటు  దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు , చర్చలు నిర్వహిస్తామని ప్రకటించారు.  మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు పంపాలని అనుకున్నారు. అప్పుడే మహిళా బిల్లు ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టర్ ను విడుదల చేశారు.  మహిళలకు సాధికారత కల్పిద్దాం, దేశానికి సాధికారత కల్పిద్దాం. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి... మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు అని పోస్టర్ లో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకూ మళ్లీ ఆ ఉద్యమం గురించి మాట్లాడలేదు. 
  
వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో సీపీఐ ఎంపీ గీతాముఖర్జీ దేశమంతా తిరిగి మహిళల స్థితిగతులపై అధ్యయనం చేసి పార్లమెంటుకు నివేదిక ఇచ్చారు. ఆ తరువాత దేవెగౌడ హ యాంలో కొన్ని రాజకీయ పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. మన్మోహన్‌సింగ్‌, దేవెగౌడ, గుజ్రాల్‌ ప్రధానులుగా ఉన్నప్పుడు ఆయా ప్రభుత్వాలకు పూర్తి స్థాయి సంఖ్యాబలం లేదు. కానీ మోదీ ప్రభుత్వానికి పూ ర్తిస్థాయి మెజారిటీ ఉన్నది. మోదీ సర్కారు బిల్లు తేవడానికి ఇష్టపడటం లేదు. బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు తెస్తే సమర్థిస్తామని అన్ని పార్టీలు చెబుతున్నాయి. దీంతో కవిత పోరాటానికి మద్దతు లభించింది. కానీ ఇప్పుడు సొంత పార్టీలో సీట్లు అతి తక్కవగా కేటాయించడంతో..  ఆమె ఉద్యమం గురించి మళ్లీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని  రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Harish Rao: పల్నాడు స్కీమ్‌ ఆపుతానని రేవంత్ రెడ్డి ఎందుకు అనలేదు? చంద్రబాబుకు గురుదక్షిణ కోసమా?: హరీష్ రావు
పల్నాడు స్కీమ్‌ ఆపుతానని రేవంత్ రెడ్డి ఎందుకు అనలేదు? చంద్రబాబుకు గురుదక్షిణ కోసమా?: హరీష్ రావు
Kamble Mukesh Kumar: కాంబ్లె ముకేశ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు.. హీరో సుమన్ చేతుల మీదుగా నియామక పత్రం, ఎవరీయన
కాంబ్లె ముకేశ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు.. హీరో సుమన్ చేతుల మీదుగా నియామక పత్రం, ఎవరీయన

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
This Week Movies : శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
TVK MLA Arul Vignesh: మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం!
మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Gaganayan Mission: గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
Embed widget