అన్వేషించండి

NPS Sanchay Scheme: అసంఘటిత కార్మికులకు నెల నెలా పెన్షన్.. NPS సంచయ్ స్కీమ్ కు అర్హతలు, దరఖాస్తు విధానం ఎలా?

NPS Sanchay Scheme: తక్కువ పెట్టుబడితో అసంఘటిత రంగాల్లోని కార్మికులు సైతం పెన్షన్ పొందేందుకు కేంద్ర ఎన్పీఎస్ సంచయ్ స్కీమ్ ను ప్రారంభించింది.

NPS Sanchay Scheme: NPS సంచయ్ పదవీ విరమణ పెట్టుబడి స్కీమ్. నేషనల్ పెన్షన్ స్కీమ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీ్మ్ లో చందాదారులు పెట్టుబడి మాన్యువల్‌గా ఎంచుకోవాల్సిన అవసరం లేకుండా, డిఫాల్ట్ పెట్టుబడి పెట్టే సదుపాయం ఇందులో అందుబాటులో ఉంది. ఈ స్కీమ్  చేరడం ద్వారా తక్కువ పెట్టుబడితో నెలకు రూ.1 లక్షకు పైగా పెన్షన్ పొందవచ్చు. 

NPS సంచయ్ అంటే ఏమిటి?

ఎన్‌పీఎస్ సంచయ్  జాతీయ పింఛన్ వ్యవస్థలోని మల్టీ స్కీ్మ్ ఫ్రేమ్‌వర్క్ (MSF) కింద ప్రారంభించిన పెన్షన్ స్కీమ్. 'సంచయ్' అనే పదానికి పొదుపు అని అర్థం. పదవీ విరమణ పొదుపు కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్లు, గిగ్ వర్కర్లు, స్వయం ఉపాధి కార్మికులు, రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు  ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. PFRDAలో రిజిస్టర్ అయిన అన్ని పెన్షన్ ఫండ్‌లు మల్టీ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ కింద NPS సంచయ్‌ స్కీమ్ కు అర్హులు. పెట్టుబటి ఆప్షన్లను చాలా సులభంగా ఎంచుకునేందుకు, అసెట్ కేటాయింపులను సైతం ఎంచుకునే వీలు కల్పిస్తున్నారు.మే 6, 2026న  పీఎఫ్ఆర్‌డీ ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేసింది. మే 6 నుంచే ఈ పథకం అమలులోకి వస్తుందని పేర్కొంది. 

ముఖ్యాంశాలు  

18 - 85 ఏళ్ల మధ్య వయస్సు గలవారు అర్హులు 
టైర్-I అకౌంట్ కు ప్రతి విరాళానికి రూ.500, ఏడాదికి రూ.1,000
eNPS, ఫిన్ టెక్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో, పీవోపీ కేంద్రాల ద్వారా ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.   

పెట్టుబడి ఎలా?

ఈ పథకంలో పెట్టుబడి.. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)/NPS/అటల్ పెన్షన్ యోజన వంటి ప్రభుత్వ రంగ పథకాలకు ప్రస్తుతం ఉన్న పెట్టుబడి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. జాతీయ పింఛను పథకం మాదిరిగానే నిబంధనలు ఉంటాయి. ఇందులో కనీస పెట్టుబడి రూ.1000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో మార్కెట్ ఆధారంగా రిటర్న్స్ ఉంటాయి. కనీసం 10 శాతం రాబడి అంచనా వేయవచ్చు. 

20 ఏళ్ల వయసులోని వ్యక్తి నెలకు రూ.5000.. 60 ఏళ్ల వయసు వరకు పెట్టుబడి పెడితే రూ.3.1 కోట్ల మెచ్యూరిటీ పొందతారు. అదే 30 ఏళ్ల వ్యక్తి అయితే రూ.1.1 కోట్లు, 40 ఏళ్ల వ్యక్తి అయితే రూ.38 లక్షలు మెచ్యూరిటీ మొత్తం పొందవచ్చు. అందులో నుంచి 40 శాతం యాన్యుటీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 20 ఏళ్ల వ్యక్తి తనకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఎన్‌పీఎస్ కార్పస్ నుంచి 40 శాతం అంటే రూ. 1,27,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పెట్టుబడి దానిపై వచ్చే రాబడి ఆధారంగా నెల నెలా పెన్షన్ వస్తుంది.  

NPS సంచయ్‌ అర్హతలు 

  1. భారత పౌరుడై ఉండాలి. 
  2. వయోపరిమితి 18- 85 సంవత్సరాలు
  3. పౌరులందరూ, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు అర్హులు
  4. NPS ఖాతా తప్పనిసరి కాదు
  5.  సబ్‌స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫారం తప్పనిసరి

NPS సంచయ్ అకౌంట్ ఎలా తెరవాలి?

ఆన్‌లైన్ పద్ధతి

ప్రోటీన్ (eNPS)

Step 1: eNPS హోంపేజీలోని '  ఇండివిడ్యువల్ సబ్‌స్క్రైబర్' , 'రెసిడెంట్ ఇండియన్' సెలెక్ట్ చేసుకోవాలి.

Step 2:  ఇ-కేవైసీ కోసం  ఆధార్ లేదా  పాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

Step 3: ఆల్ సిటిజన్ మోడల్ ను ఎంచుకోండి. మల్టీ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ లో 'NPS సంచయ్' ఆప్షన్ ఎంచుకోండి.  

Step 4: మీ వివరాలను పొందేందుకు  ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.

Step 5 : మీ వ్యక్తిగత, బ్యాంకు వివరాలను ధృవీకరించి, డిజిటల్ సైన్ కాపీని అప్‌లోడ్ చేయండి.

Step 6: మీ శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (PRAN)ను రూపొందించడానికి కనీసం  రూ.500 కనీస చందా. 

ఆఫ్‌లైన్ పద్ధతి

  • రిజిస్టర్ అయితే పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్  సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఆఫ్ లైన్ లో ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.  
  • సబ్‌స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫారంలో వివరాలు నమోదు చేసి, KYC పత్రాలు, ఫొటో, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించండి. 
  • మొదటి చందా అందించి, PRAN నెంబర్ పొందవచ్చు.  

విత్ డ్రా రూల్స్  

  • చందాదారులు పాక్షిక విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.  
  • ఈ పెట్టుబడి విత్ డ్రాకు 3 సంవత్సరాలు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 
  • చందాదారుడి సబ్ స్క్రిప్షన్ లో  25% వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. 
  • ఉన్నత విద్య, వివాహం, అనారోగ్యం, ఇంటి కొనుగోలు, వ్యాపారానికి విత్ డ్రా చేసుకోవచ్చు.  

ఎగ్జిట్ రూల్స్ 

  • ఎన్పీఎస్ సంచయ్ ను ఎగ్జిట్ అవ్వడానికి చందాదారుడికి  60 సంవత్సరాలు నిండిన లేదా  15 సంవత్సరాల పెట్టుబడిని పూర్తి చేసుకుంటే.. ఏది ముందుగా జరిగితే అది... సాధారణ ఎగ్జిట్ కు అవకాశం కల్పిస్తుంది.  
  • 60 ఏళ్ల వయసులో ఈ స్కీమ్ నుంచి బయటకు రావాలనుకుంటే 40% కార్పస్‌ను యాన్యుటీ కొనుగోలుకు ఉపయోగించాలి. మిగిలిన 60%ను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • 60 ఏళ్ల లోపే ఎగ్జిట్ అయితే కనీసం 80% కార్పస్‌ను యాన్యుటీ కొనుగోలుకు ఉపయోగించాలి.  20%ను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • చందాదారుడు మరణిస్తే నామినీ/చట్టబద్ధమైన వారసులకు మొత్తం సేవింగ్స్ చెల్లిస్తారు.  

Frequently Asked Questions

NPS సంచయ్ పథకం అంటే ఏమిటి?

NPS సంచయ్ అనేది నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం. 'సంచయ్' అంటే పొదుపు, ఇది పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందించే లక్ష్యంతో రూపొందించబడింది.

NPS సంచయ్ పథకంలో ఎవరు చేరవచ్చు?

18 నుండి 85 సంవత్సరాల మధ్య వయస్సు గల భారత పౌరులు ఈ పథకంలో చేరవచ్చు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

NPS సంచయ్ పథకంలో పెట్టుబడి ఎలా పెట్టాలి?

ఈ పథకంలో కనీసం రూ.1000 తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. పెట్టుబడి మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది, సుమారు 10% రాబడిని అంచనా వేయవచ్చు.

NPS సంచయ్ పథకం నుండి డబ్బును ఎప్పుడు తీసుకోవచ్చు?

సాధారణంగా 60 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత లేదా 15 సంవత్సరాల పెట్టుబడి పూర్తయిన తర్వాత డబ్బును తీసుకోవచ్చు. 60 ఏళ్ల తర్వాత 60% వరకు, అంతకుముందు 20% వరకు ఒకేసారి విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
El Nino Effect: వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
Telangana SIR Electoral Roll Purge: ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget