By: ABP Desam | Updated at : 06 Jun 2023 04:18 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి సమీపంలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనంలో సోదాలు చేశారు. అనినీతి ఆరోపణల రావడం వల్ల విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. అకౌంట్ సెక్షన్, ఏవో సెక్షన్, ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్లలో సోదాలు చేశారు. యూనివర్సిటీలోని కళాశాల భవనాల్లోనూ విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈసీ మెంబర్లకు, వీసీకి మధ్య నెలకొన్ని గొడవలపై కూడా అధికారులు దృష్టి సారించారు.
యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని ఈసీ చర్యలకు దిగింది. వీసీ రవీందర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని రిజిస్ట్రార్‌ను మారుస్తామని ఈసీ ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా కొత్త రిజిస్ట్రార్‌ను నియమిస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ గందరగోళంగా మారింది. ఈసీ మెంబర్లకు, వీసీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. అక్రమ నియామకాలు, లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తాజాగా రంగంలోకి దిగారు.
అక్రమాలపై విచారణ కోసం ఇటీవలే ఏకగ్రీవ తీర్మానాలు
హైదరాబాద్‌లోని రూసా భవనంలో జూన్ నెల 3వ తేదీన పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన పరిణామాలు, గతంలో పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకషంగా చర్చించారు. ఆ 60వ పాలక మండలి సమావేశానికి వీసీ రవీందర్ మరోసారి డుమ్మాకొట్టారు. వీసీ అక్రమాలు చేశారని, దానిపై విచారణ కమిటీ వేయాలని సమావేశంలో పాలకమండలి మెంబర్లు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. వీసీ చేసిన అక్రమ నియామకాలు, ఇతరుల పేర్ల మీద బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేయడం, దినసరి ఉద్యోగం కింద పని చేసిన వారికి ఈసీ అనుమతి లేకుండానే బ్యాంకు నుంచి రూ.28 లక్షలు చెల్లించిన అంశాలకు సంబంధించి కమిటీని వేసి చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు.
NEET-MDS: నీట్ ఎండీఎస్ కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
Army School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
KNRUHS: ఎంబీబీఎస్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం
MLA Durgam Chinnaiah: రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలి - నోరుజారిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?
Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
/body>