అన్వేషించండి

నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌లో కనిపించని అభయ హస్తం- చేజారిపోతున్న ద్వితీయ శ్రేణి నాయకులు

కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి లీడర్లను బీజేపీ, టీఆర్‌ఎస్‌ టార్గెట్ చేశాయి. సొంత పార్టీలో భరోసా ఇచ్చే హస్తం లేకపోవడంతో వాళ్లు కూడా తమ దారి తాము చూసుకుంటున్నారు.

నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. హస్తం పార్టీకి బలమైన క్యాడర్, లీడర్లు ఉన్న పార్టీ. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలకు తొమ్మిదింటిని కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్న చరిత్ర. ఒకప్పుడు ఇందూరు జిల్లాలో తిరుగులేని పార్టీగా హస్తం హవా కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన నేతలు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉన్న పార్టీ కాంగ్రెస్. బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితులు, జిల్లాలోని కీలక నేతలు టీఆర్ఎస్, బీజేపీ వైపు వెళ్లటం... క్యాడర్ ను పట్టించుకునే లీడర్ కరవవ్వటంతో ప్రస్తుతం జిల్లాలో పార్టీ డీలా పడింది. రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక జిల్లా కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచే ఇటు బీజేపీ, ఆటు టీఆర్ఎస్ పార్టీలకు వెళ్తున్నారు. వాటిని చెక్ పెట్టడంలో జిల్లా నేతలు విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. 

డీఎస్ లాంటి అపార అనుభవం ఉన్న నాయకులు సైతం కారెక్కారు. బలమైన నేత పార్టీ మారటంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన చాలా మంది నాయకులు టీఆర్ఎస్ వైపు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో పడ్డాయ్ కమలం, గులాబీ పార్టీలు. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ భూపతి రెడ్డిని బీజేపీ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. ఆర్మూర్ నియోజవకర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చాలా వరకు బీజేపీ, టీఅర్ఎస్ పార్టీల్లోకి వెళ్లిపోయారు. మాజీ మున్సిపల్ చైర్మన్ సహా కౌన్సిలర్లు ఇలా హస్తం పార్టీ నుంచి గెలిచిన చాలా మంది నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ వెంకటరమణ రెడ్డి కాంగ్రెస్ లో యాక్టివ్ లీడర్ గా పనిచేశారు. ఆయన బీజేపీ పార్టీలోకి చేరిపోయారు. 

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన జాజుల సురేంధర్ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటింది. ఆర్మూర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆకుల లలిత చివరి క్షణంలో టీఅర్ఎస్ కు మద్దతు ఇచ్చారు. అయినా అమెకు 40 వేల పైచీలుకు ఓట్లు వచ్చాయ్. అక్కడా కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉండింది. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీనియర్ పోలిటీషియన్ సురేష్ రెడ్డి సైతం కాంగ్రెస్ నుంచి కారెక్కిన వారే. 

ఇటీవల బీజేపీలోకి చేరిన బోధన్ నియోజకవర్గ నాయకుడు మోహన్ రెడ్డి సైతం ఒకప్పటి కాంగ్రెస్ లీడర్. కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న అరుణ తార సైతం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన నాయకురాలు. ఇలా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు టార్గెట్ చేసి కండువాలు కప్పేస్తున్నాయ్. ప్రస్తుతం ఉన్న వారిని సైతం కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు జిల్లా కాంగ్రెస్ నాయకులు. 

పార్టీని వీడిన వారిని తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు కూడా చేయలేకపోవటంతో కాంగ్రెస్ అభిమానులు ఒకింత దిగాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో పునరుజ్జీవనం పోయాలంటే... ఇప్పుడున్న సీనియర్ నాయకులు పార్టీని విడిచిపెట్టిన వెళ్లినవారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దీనస్థితికి చేరుకుందంటున్నారు క్యాడర్. జిల్లా నుంచి పీసీసీలో కీలక బాధ్యతలు పోషిస్తున్న ముగ్గురు సీనియర్ నాయకులు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్ల మధ్య సరైన సఖ్యత లేకపోవటంతోనే చాలా మంది పార్టీని వీడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయ్. 

ఓవైపు సర్వేల్లో అధికార పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేల పనితీరుపై వస్తున్న ఫలితాలను చూసైనా కాంగ్రెస్ అధిష్టానం అలెర్ట్ కాకపోవటంపై క్యాడర్ గుర్రుగా ఉంటోందట. రేవంత్ రెడ్డి పీసీసీగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో చాలా కాలం పాటు పార్టీకి దూరంగా ఉన్న క్యాడర్ తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రచ్చ బండ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. అయితే ప్రస్తుతం మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మరింత బలపడటానికి కాంగ్రెస్ లోని సెకండ్ క్యాడర్ నాయకులపై కన్నేస్తున్నాయ్. సాధ్యమైనంత వరకు హస్తం పార్టీ నేతలను చేర్చుకునేందుకు స్కెచ్ లేస్తున్నాయ్.

డీఎస్ లాంటి సీనియర్ నాయకులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటే జిల్లాకు చెందిన కొందరు నాయకులు అడ్డుకోవటం, మరోవైపు మాజీ మేయర్ సంజయ్ సైతం కాంగ్రెస్ పార్టీలోకి చేరుతానంటే అడ్డుకోవటం వంటి అంశాల వల్ల జిల్లా కాంగ్రెస్ నాయకత్వంపై క్యాడర్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paripoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABPWhy did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Embed widget