News
News
X

Revanth Reddy: కారు స్టీరింగ్ అసద్ చేతిలో, బ్రేకులు మోదీ చేతిలో ఉన్నాయి: రేవంత్ రెడ్డి

సురేష్ రెడ్డికి కాంగ్రెస్ అన్నీ ఇచ్చింది.. స్పీకర్ ను చేసింది. కానీ కేసీఆర్ మోచేతి నీళ్లు తాగి సురేష్ రెడ్డి కాంగ్రెస్ కు అన్యాయం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.

FOLLOW US: 
Share:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో ఇక్కడ ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్యేలు ఆర్మూర్ కు కీర్తి తెచ్చారు. సురేష్ రెడ్డికి కాంగ్రెస్ అన్నీ ఇచ్చింది.. స్పీకర్ ను చేసింది. కానీ కేసీఆర్ మోచేతి నీళ్లు తాగి సురేష్ రెడ్డి కాంగ్రెస్ కు అన్యాయం చేశారని విమర్శించారు. దొర గడీలో సురేష్ రెడ్డి బానిస బతుకు బతుకుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను నట్టేట ముంచినోళ్లు కొందరైతే... కాంగ్రెస్ కార్యకర్తలను చంపించి ఎమ్మెల్యే అయినవారు ఇంకొకరు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ కవిత ధనదాహానికి నందిపేట సెజ్ బలైపోయిందని అన్నారు రేవంత్ రెడ్డి. బీడీలను నిషేధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ఆడబిడ్డల పొట్ట కొట్టాయి. గుత్ప, శ్రీరాం సాగర్ నిర్మించి రైతులు ఆత్మగౌరవంతో బతికేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.
అసద్ చేతిలో స్టీరింగ్, బ్రేక్, ఎక్స్ రేటర్ మోదీ చేతిలో! 
బీఆరెస్ కారు స్టీరింగ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉంటే... బ్రేక్, ఎక్స్ రేటర్ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ చేతిలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. దక్షిణాఫ్రికా నియంత ఈడీ అమీన్ ఉండేవాడు.. మనుషులను కోసుకుని తినేవాడట. మనుషుల రక్తం తాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ ఈడీ అమీన్. ఎవరు లే అవుట్ చేసినా జీవన్ రెడ్డి సోదరులకు కప్పం కట్టాల్సిందేనట. దుబాయ్ షేక్ లకే సున్నం పెట్టి వచ్చిన ఘనుడు జీవన్ రెడ్డి. తళారి సత్యంను చంపించిండు అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు ఏమీ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉంటే.. రాష్ట్ర ప్రజలకు ఏమీ రావు. నిజామాబాద్ కు పసుపు బోర్డు తెస్తానని అరవింద్ మోసం చేశాడు. కవితకు పట్టిన గతే అరవింద్ కు పట్టేలా చేయాలని అన్నారు. ఇక్కడి గల్ఫ్ బాధితుల గోసలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు రైతు బీమా మాదిరిగా  గల్ఫ్ బీమా తీసుకొస్తామని అన్నారు రేవంత్. తద్వారా గల్ఫ్ లో చనిపోయిన కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ అందిస్తాం. ఇన్నీ మంచి పనులు చేయాలంటే తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు రేవంత్. ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యంతోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన సాధ్యమవుతుందని అన్నారు రేవంత్.
సెజ్ ను సందర్శించిన రేవంత్
అంతకు ముందు నందిపేట్ మండలంలో ఉన్న లక్కంపల్లి సెజ్ ను సందర్శించిన రేవంత్ రెడ్డి.... సెజ్ లోని ఆగ్రో ఫుడ్ పార్క్ లో సంబంధిత సిబ్బందిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2008లో నందిపేట స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ కు యూపీఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 421 ఎకరాల భూమిని సేకరించి పరిశ్రమల కోసం సెజ్ ను ఏర్పాటు చేసింది. ఇందులో పసుపు, మొక్కజొన్న, సొయా బీన్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని 2016 బీజేపీ ప్రభుత్వం చెప్పింది. పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా ముందుకు తీసుకెళతామని ప్రభుత్వం మాట ఇచ్చింది. ఓ తెలంగాణ పారిశ్రామిక వేత్త ముందుకు వచ్చినా సీఎం కేసీఆర్ అందుబాటులోకి రాలేదు. 

‘ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనకు పెట్టుబడులు లేకుండా వాటాలివ్వాలని బెదిరించారని అన్నారు రేవంత్. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణ పారిశ్రామికవేత్తను ఎమ్మెల్యే బెదిరించారు. టీఎస్ఐఐసీ నుంచి ఇక్కడ ఒక సూపర్ వైజర్ ను నియమించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేవు.  నందిపేట సెజ్ కల్వకుంట్ల అవినీతికి బలై పోయింది. కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనల్లో నిజం లేదు. ఇక్కడ ఎలాంటి పనులు జరగడం లేదు. అభివృద్ధి జరగడం లేదు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి 30 శాతం కప్పం కట్టాల్సిందేనట. అభివృద్ధికి అడ్డంకిగా మారిన జీవన్ రెడ్డిని ఈ ప్రాంత రైతులు ఓడించండి’ అని పిలుపునిచ్చారు.

బీజేపీ ఎంపీ కేంద్రం నుంచి కావాల్సిన నిధులు తెచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చూడాలి. గతంలో పతంజలి కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత పెద్ద ప్రచారం చేశారు. కానీ ఇప్పటికీ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు కాలేదని అన్నారు రేవంత్. రాందేవ్ బాబాతో మాట్లాడి పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసేలా ఇక్కడి ఎంపీ కృషి చేయాలి. తక్షణమే ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుపై కేసీఆర్ రివ్యూ చేయాలి. ఇందుకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్. 

రేవంత్ రెడ్డిని కలిసిన దళిత ప్రజా సంఘాల జేఎసీ
పాదయాత్ర కోసం ఆర్మూర్ వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని దళిత ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ  కలిసింది. దళితులపై అఘాయిత్యాలను నిరోధించడానికి, సంక్షేమ పథకాల అమలుకు  ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని నేతలు రేవంత్ కు వివరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, సంక్షేమ పథకాల్లో అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయడంలేదని ఆయనకు విన్నవించుకున్నారు. ఎమ్మెల్యేలను చక్రవర్తులను చేసి దళితులను అడుక్కునే స్థాయికి దిగజార్చారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ కాన్ సెంట్ వల్ల పేద లబ్ది దారులకు న్యాయం జరగడంలేదన్న నేతలు. సమస్యలపై పోరాటానికి తనవంతు సహకారం అందిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలులో డ్రా విధానం తెస్తే అవినీతికి తావుండదన్న రేవంత్ అన్నారు. సబ్ ప్లాన్ అమలుపై న్యాయ పోరాటానికి అండగా ఉంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Published at : 18 Mar 2023 12:36 AM (IST) Tags: CONGRESS Revanth Reddy Telangana KCR NIZAMABAD

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!

TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!

Summer Holidays: తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం! సమ్మర్ హాలీడేస్ ఎన్నిరోజులంటే?

Summer Holidays: తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం! సమ్మర్ హాలీడేస్ ఎన్నిరోజులంటే?

Nizamabad Crime News: కాలువ వద్ద రాత్రంతా కూర్చున్న మహిళ- ఆరా తీస్తే షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి

Nizamabad Crime News: కాలువ వద్ద రాత్రంతా కూర్చున్న మహిళ- ఆరా తీస్తే షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

Adilabad News: జామడ బాలికల పాఠశాలలో స్వర్ణోత్సవాలు - స్టెప్పులతో అదరగొట్టిన ఆదివాసీ విద్యార్థులు 

Adilabad News: జామడ బాలికల పాఠశాలలో స్వర్ణోత్సవాలు - స్టెప్పులతో అదరగొట్టిన ఆదివాసీ విద్యార్థులు 

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు