అన్వేషించండి

Viral News: స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ గెట్ టుగేదర్ చూశారు, 40 ఏళ్ల తరువాత ఓ గ్రామ ప్రజల గెట్ టుగేదర్ చూస్తే వావ్!

Adilabad News | స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ గెట్ టుగేదర్ పేరుతో కొన్నేళ్లకు కలుసుకోవడం తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే 40 ఏళ్ల తరువాత ఓ గ్రామ ప్రజలు గెట్ టుగేదర్ ఏర్పాటు చేసుకున్నారు.

Village Get Together | 40 ఏళ్ల కిందట ఆ గ్రామం సాత్నాల ప్రాజెక్టులో ముంపునకు గురయింది. దీంతో ఆ గ్రామస్తులు జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. తాత ముత్తాతల కాలంగా నివాసమున్న తాము పుట్టిన ఊరులో.. ఆ నేలతల్లిని మర్చిపోలేని గ్రామస్తులకు తోచిన ఓ ఆలోచన అందరినీ ఏకం చేసింది. ఒక్కొకరుగా సమాచారం అందించి 40ఏళ్ల కిందట ఉన్న వారంతా ఏకమయ్యారు. పుట్టిన నేల తల్లి పై ఓ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. 40 ఏళ్ల కిందటి గ్రామ ఆనవాళ్లు చూస్తూ అప్పటి గ్రామస్తులంతా ఒకరినొకరు కలుసుకోని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అదిలాబాద్ జిల్లా బేల మండలంలోని తోయగూడ గ్రామస్తుల ఆత్మీయ సమ్మేళనంపై abp దేశం ప్రత్యేక కథనం. 

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని తోయగూడ గ్రామస్తులు 40 ఏళ్ల తరువాత ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 1975 లో ఈ ప్రాంతంలో ఏడు నదులు కలిసే చోట సాత్నాల ప్రాజెక్టు ఏర్పాటుకు దారి తీసింది. 1976లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేతుల మీదుగా సాత్నాల ప్రాజెక్టు శంకు స్థాపన జరిగింది. ఆపై ప్రాజెక్టు ఏర్పాటుతో తోయగూడా గ్రామం ముంపునకు గురయింది. 1979 నుండీ 1983 మధ్య తోయగూడ గ్రామం ఖాళీ అయింది. గ్రామంలోని అందరు ఒక్కో దారి పట్టుకొని జీవనోపాధి కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు.


Viral News: స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ గెట్ టుగేదర్ చూశారు, 40 ఏళ్ల తరువాత ఓ గ్రామ ప్రజల గెట్ టుగేదర్ చూస్తే వావ్!

40ఏళ్ల కిందట తోయగూడలో రైతులు సారవంతమైన నేలలో ఎన్నో రకాల పంటలు పండించేవారు. గ్రామంలోని పాఠశాలలో నేర్చుకున్న పాఠాలతో ఎంతోమంది విద్యావేత్తలయ్యారు. కానీ సాత్నాలా ప్రాజెక్టు ఏర్పడడంతో తోయగూడ గ్రామం ముంపుకు గురై ఖాళీ అయింది. వివిధ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం వెళ్ళిపోయిన వారంతా ఉన్న ఊరిలో నేల తల్లి పై ఉన్న ప్రేమ అనుబంధాన్ని పంచుకుంటూ కలుసుకునేలా సంబరంగా ఓ వినూత్న ప్రయత్నం చేశారు.


Viral News: స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ గెట్ టుగేదర్ చూశారు, 40 ఏళ్ల తరువాత ఓ గ్రామ ప్రజల గెట్ టుగేదర్ చూస్తే వావ్!

40 ఏళ్ల తర్వాత ఒకరి సహాయంతో ఒకరు సమాచారం చేరవేసుకొని తోయగూడా గ్రామస్తులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఊరిలో ఉన్న ఆనవాళ్లను చూస్తూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అందరూ ఒకే చోట కలుసుకొని భావోద్వేగానికి గురవుతూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు కలుసుకుంటూ ప్రేమానురాగాలను పంచుకున్నారు. అందరూ ఎంతో సంబరంగా అప్పటి కాలంలో పెద్దలను గుర్తు చేసుకుంటూ గ్రామంలోని వారంతా తమ పిల్లాపాపలతో కలిసివచ్చి వారి చిన్ననాటి జ్ఞాపకాలను పరిచయం చేసుకున్నారు. ఆడుతు పాడుతు డప్పు చప్పుల మధ్య తమ గ్రామ దేవతకు మొక్కులు చెల్లించారు.


Viral News: స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ గెట్ టుగేదర్ చూశారు, 40 ఏళ్ల తరువాత ఓ గ్రామ ప్రజల గెట్ టుగేదర్ చూస్తే వావ్!

గ్రామంలో నిజాం కాలంలో నిర్మించిన బావి, పాఠశాల, దేవాలయం తమ ఇళ్ళను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు కలుసుకుంటూ బంధుమిత్రులను కలుసుకున్నారు. ఆడుతు పాడుతు సంబరంగా తమ పుట్టిన నేల తల్లి పై సంబరంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆపై అందరు భోజనాలు చేసుకుని తిరిగి తమ తమ గ్రామాలకు బయలుదేరారు. గత మూడు ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తోయగూడ గ్రామస్తులు abp దేశంతో వివరించారు. తమ పాత జ్ఞాపకాలను వివరిస్తూ పలువురు భావోద్వేగానికి లోనై అక్కడి పాతకాలం నాటి ఆనవాళ్లను పరిచయం చేశారు. తాము పుట్టి పెరిగిన నేల తల్లిని మర్చిపోకుండా అందరూ కలుసుకునేలా మూడేళ్లుగా ఈ పాత తోయగూడా గ్రామస్తుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

Also Read: New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
Konda Surekha: కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
CM Revanth Reddy US Visit: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget