అన్వేషించండి

Tiger News: నిర్మల్ ప్రజలను వణికిస్తున్న పెద్దపులి, భుర్కరేగిడి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడితో కలకలం

Tiger in Nirmal District | నిర్మల్ జిల్లా ప్రజలను పులి భయం వెంటాడుతోంది. భర్కరేగిడి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి ఓ ఎద్దుపై దాడి చేసి చంపడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది.

Tiger in Niramal District  | నిర్మల్ జిల్లా మామడ రేంజి పరిధిలోని భర్కరేగిడి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. రెండు రోజుల క్రితం నిర్మల్ ఘాట్ దాటి మామడ రేంజి పరిధిలోకి సంచరించిన పెద్దపులి..  మామడ రెంజ్ పరిధిలోని పెంబి రేంజికి సమీపంలో భుర్కరేగిడి అటవీ ప్రాంతంలోని పత్తి చేనుకు సమీపంలో ఓ ఎద్దు పై పులి దాడి చేసి హతమార్చింది. 

స్థానిక రైతులు విషయం తెలుసుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో మామడ, తాండ్ర, పెంబి మూడు రేంజ్ల అధికారులు, బాసర జోన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, టాస్క్ ఫోర్స్ టీమ్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పులి దాడి చేసి హతమార్చిన ఎద్దు,ను పరిశీలించారు. పత్తి చేనులో సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను సేకరించారు. పులి ఏ ప్రాంతం వైపు వెళ్లిందో దాని అడుగుజాడలను చూసుకుంటూ, వైల్డ్ లైఫ్ టీమ్, అటవీ శాఖ బేస్ క్యాంప్ సిబ్బంది వాచ్ చేస్తున్నారు. అక్కడి ప్రాంతంలో రెండు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం నుండి సమీప గ్రామాలకు వెళ్లే రహదారిని మూసివేశారు. ఆ ప్రాంతాల వైపు ఎవరు వెళ్లకూడదని సమీప గ్రామాల ప్రజలకు సమాచారం చేరవేస్తున్నారు. 

భయాందోళన చెందవద్దు
పులి వచ్చిందని ఎవరు భయాందోళనకు గురవకూడదని, పులికి ఎలాంటి హాని చేయకూడదని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. పంట పొలాల్లో ఉచ్చులు, విద్యుత్ తీగల కంచేకలను పెట్టొద్దని, ఎక్కడైనా ఉంటే వాటినీ తిల్గించాలని చెబుతున్నారు. మృతి చెందిన పశువు యజమాని కుమ్ర గంగాధర్ కు అటవీశాఖ తరఫున పరిహారం అందిస్తామన్నారు. పులి సంచారం విషయమై ఏబీపీ దేశం.. మామడ, పెంబి రేంజ్ అధికారలు, రాథోడ్ అవినాష్, రమేష్ లతో ఫోన్ ద్వారా వివరణ కోరగా... పులి తమ రేంజి పరిధిలో ఉందని సమీప అటవీ ప్రాంతాల్లో అది సంచరిస్తోందన్నారు. భుర్కరేగిడి అటవీ సమీపంలో ఓ ఎద్దుపై దాడి చేసిందన్నారు. రైతు కుమ్ర గంగాధర్ కు చెందిన ఎద్దు పై పులి దాడి చేసి చంపడంతో అతనికి అటవీశాఖ తరఫున తాత్కాలికంగా 5000 రూపాయలను అందించారు. మిగతా పరిహారం పంచనామా అనంతరం అందించడం జరుగుతుందని మామడ రేంజ్ అధికారి అవినాష్ తెలిపారు. 


Tiger News: నిర్మల్ ప్రజలను వణికిస్తున్న పెద్దపులి, భుర్కరేగిడి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడితో కలకలం

పులి దాడిలో ఎవరి పశువులైన హతమయితే తమకు సమాచారం అందించాలని, పులి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నందున సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పంట పొలాల్లో చేనులలో పనిచేసే వ్యవసాయ రైతులు కూలీలు తమ పనులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల లోపే గుంపులు గుంపులుగా ఇద్దరు ముగ్గురు ఉంటూ చేసుకోవాలన్నారు. పంటచేలలో అడవి పందులకు అమర్చే విద్యుత్ కంచేలను తొలగించాలని గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పులి సంచారం నేపథ్యంలో ఎవరు కూడా భయాందోళనకు గురవద్దని, అప్రమత్తంగా ఉండాలన్నారు.

Also Read: Revanth Reddy: ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget