Nizamabad News: ఎట్టకేలకు నుడా మాస్టర్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్

ఎట్టకేలకు నుడా మాస్టర్‌ ప్లాన్‌కు సర్కార్ గ్రీన్ సిగ్నల్. ప్లాన్‌లోకి వచ్చిన గ్రామాల జాబితా..నుడా పరిధి 568.32 చదరపు కి.మీ. 73 గ్రామాలతో బృహత్‌ ప్రణాళిక. ప్లాన్‌కు ఓకే చెప్పిన ప్రభుత్వం 

FOLLOW US: 

నిజామాబాద్‌ అర్బన్ డెవలప్ మెంట్ నుడా మాస్టర్‌ ప్లాన్‌ ఓకే అయ్యింది. 73 గ్రామాలను కలుపుకొని మొత్తం 568.32 చదరపు కిలోమీటర్ల మేర నుడా పరిధిలోకి తీసుకొచ్చారు. మాస్టర్‌ ప్లాన్‌ను ఖరారు చేసే పనిలో నిమగ్నమైన అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్లాన్‌కు డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారులు ఆమోదం తెలిపారు. నుడా పరిధిలోకి తీసుకొచ్చిన గ్రామాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలకు గడువు కూడా ఇచ్చారు. అభ్యంతరాలను నుడా కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు. వాటిని పరిష్కరించాక నుడా పరిధిని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి.

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌తో కలిపే నుడా పరిధిని ఖరారు చేశారు. తొమ్మిది విలీన గ్రామాలను కలిపి 318.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కార్పొరేషన్‌ మాస్టర్‌ప్లాన్‌ను మూడేళ్ల క్రితమే రూపొందించారు. కానీ, ఆ తర్వాత 73 గ్రామాలను కలిపి నుడాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తొలుత రూపొందించిన కార్పొరేషన్‌ మాస్టర్‌ప్లాన్‌ను కలుపుకొని నుడా బృహత్‌ ప్రణాళికను తయారు చేశారు. కార్పొరేషన్‌ మాస్టర్‌ప్లాన్‌ పరిధి 318.50 చ.కి.మీ.కి తోడు నగర పాలక సంస్థ వెలువల ఐదు కిలోమీటర్ల రేడియల్‌ విస్తీర్ణం 249.82 చదరపు కి.మీ.తో కలిపి నుడా మాస్లర్‌ప్లాన్‌ పరిధిని ఖరారు చేశారు. 

నుడా మాస్టర్‌ ప్లాన్‌లోకి వచ్చిన గ్రామాలు 
నిజామాబాద్‌ రూరల్‌ మండలం 19 గ్రామాలు: ధర్మారం(ఎం), ధర్మారం(టి), గుండారం, రామ్‌నగర్, శాస్త్రినగర్, శ్రీనగర్, జలాల్‌పూర్, కేశాపూర్, కొండూరు, లక్ష్మాపూర్, మల్కాపూర్‌(ఎ), మల్కాపూర్‌(ఎం), మల్లారం, చక్రధర్‌నగర్‌(టి), గాంధీనగర్, ముత్తకుంట, లింగితండా, పాల్దా, తిర్మన్‌పల్లి, డిచ్‌పల్లి మండలం(10 గ్రామాలు): అమృతపూర్, దేవ్‌నగర్‌క్యాంపు, ఆరేపల్లి, బర్ధీపూర్, ధర్మారం(బి), మెంట్రాజ్‌పల్లి, నాక తండాా, వెస్లీనగర్‌ తండాా, ముల్లంగి(ఐ), నడిపల్లి 

మాక్లూర్‌ మండలం(13 గ్రామాలు): అమ్రాద్, అమ్రాద్‌ తండాా, బొంకన్‌పల్లి, చిన్నాపూర్, మదన్‌పల్లి, సట్లాపూర్‌ తండాా, మాక్లూర్‌ కింద తండా, సింగంపల్లి తండా, మామిడిపల్లి, ముల్లంగి(బి), వడ్డేటిపల్లి, సింగంపల్లి 
మోపాల్‌ మండలం(11 గ్రామాలు): కంజర, ఒడ్డెర కాలనీ, కులాస్‌పూర్, కులాస్‌పూర్‌ తండా, ముదక్‌పల్లి, గుడి తండా, శ్రీరామ్‌నగర్‌(టి), మోపాల్, న్యాల్‌కల్, సిర్‌పూర్, ఠానాకుర్దు
నవీపేట మండలం(8 గ్రామాలు): అబ్బాపూర్‌(ఎం), అభంగపట్నం, స్టేషన్‌ ఏరియా, అనంతగిరి, ధర్మారం(ఏ), మహంతం, మోకన్‌పల్లి, నారాయణపూర్‌
ఎడపల్లి మండలం(10గ్రామాలు): జైతాపూర్, జంలం, ఎం.ఎస్‌.సీ.ఫారం, జానకంపేట, కుర్నాపల్లి, మల్లాపహాడ్, మంగల్‌పహాడ్, పోచారం, ఠాణాకలాన్, బాపునగర్‌
రెంజల్‌ మండలం(1): దూపల్లి 
వర్ని మండలం(1): మాలాయిపూర్‌ 

నుడాకు సరిహద్దు గ్రామాలు.. 
ఉత్తరం: ధరియాపూర్, నవీపేట, కమలాపూర్, పోతంగల్, జన్నేపల్లి, మెట్‌పల్లి, గొట్టిముక్కల, వెంకటాపూర్, కల్లెడ, గుత్ప 
దక్షిణం: డిచ్‌పల్లి, ఘన్‌పూర్, దూస్‌గాం, చిన్నాపూర్, బాడ్సి, మంచిప్ప, కాల్పోల్, బాజిదాపూర్, ఫారెస్టు ఏరియా, చింతకుంట 
తూర్పు: మిట్టాపల్లి, బీబీపూర్‌ తండా, సుద్దపల్లి, యానంపల్లి, పుప్పాలపల్లి, సికింద్రాపూర్, మాదాపూర్, మునిపల్లి 
పడమర: మోస్రా, అమ్దాపూర్, ఇబ్రహీంపూర్, ఎరాజ్‌పల్లి, ఎడపల్లి, ఏఆర్‌పీ క్యాంపు, బ్రాహ్మణపల్లి, కల్యాపూర్, రెంజల్‌

Published at : 12 Mar 2022 09:49 AM (IST) Tags: nizamabad Nizamabad news Nizamabad Latest News Nizamabad Updates

సంబంధిత కథనాలు

TRS Questions PM Modi: తెలంగాణలో కాలుపెట్టక ముందే ప్రధాని మోదీకి అధికార టీఆర్ఎస్ బిగ్ షాక్

TRS Questions PM Modi: తెలంగాణలో కాలుపెట్టక ముందే ప్రధాని మోదీకి అధికార టీఆర్ఎస్ బిగ్ షాక్

BJP Plenary in Hyderabad: 2 రోజులు, 2 దెబ్బలు - హైదరాబాద్‌ వేదికగా బీజేపీ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తుందంటే !

BJP Plenary in Hyderabad: 2 రోజులు, 2 దెబ్బలు - హైదరాబాద్‌ వేదికగా బీజేపీ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తుందంటే !

BJP Plenary Food Menu: బీజేపీ ప్లీనరీలో అదిరిపోయే వంటకాలు, తెలంగాణ స్పెషల్ ఐటమ్స్‌తో మెనూ చూశారా !

BJP Plenary Food Menu: బీజేపీ ప్లీనరీలో అదిరిపోయే వంటకాలు, తెలంగాణ స్పెషల్ ఐటమ్స్‌తో మెనూ చూశారా !

Nizamabad BJP : నిజామాబాద్‌ బీజేపీలో జోష్ - తిరుగుండదని నేతల ధీమా

Nizamabad BJP : నిజామాబాద్‌ బీజేపీలో జోష్ - తిరుగుండదని నేతల ధీమా

Nizamabad News: తెలంగాణ కేసీఆర్‌ ఏటీఎం- బీజేపీ సీనియర్ లీడర్ తీవ్ర ఆరోపణలు

Nizamabad News: తెలంగాణ కేసీఆర్‌ ఏటీఎం- బీజేపీ సీనియర్ లీడర్ తీవ్ర ఆరోపణలు

టాప్ స్టోరీస్

Breaking News Telugu Live Updates: తెలంగాణలో బీజేపీ పుంజుకుందని అనుకోవడం భ్రమ: ఎమ్మెల్యే

Breaking News Telugu Live Updates: తెలంగాణలో బీజేపీ పుంజుకుందని అనుకోవడం భ్రమ: ఎమ్మెల్యే

CM NTR Banners: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...

CM NTR Banners: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...

High Alert in Hyderabad: భద్రతా వలయంలో భాగ్యనగరం - హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హై అలెర్ట్‌

High Alert in Hyderabad: భద్రతా వలయంలో భాగ్యనగరం - హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హై అలెర్ట్‌

Defence Ministry: ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు

Defence Ministry:  ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు