అన్వేషించండి

త్వరలోనే తెలంగాణ రోడ్లపైకి ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు- వాటర్‌ బాటిళ్ల అమ్మకం కూడా ప్రారంభం

పార్సిల్‌ సర్వీస్ ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్న ఆర్టీసీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందన్నారు బాజిరెడ్డి. ఆర్టీసీ ప్రత్యేక బ్రాండ్‌పేరుతో జీవ వాటర్ బాటిళ్లను త్వరలో ప్రారంభించనుంది.

టిఎస్‌ ఆర్టీసీలో మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ సహాయంతో  2022- 2023 ఆర్థిక సంవత్సరంలో అన్ని డిపోలను లాభాల బాటల్లోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో చేపట్టిన సంస్కరణలతోపాటు భవిష్యత్‌లో అమలు చేయబోతున్న నిర్ణయాలు వెల్లడించారు. 
 
రాష్ట్రంలో  ప్రగతి చక్రం పరుగులు పెడుతోందని అన్నారు బాజిరెడ్డి. సంస్కరణలు అమలుతో ఆదాయం పెంపుతోపాటు నష్ట నివారణ చర్యలు తీసుకొని ఆర్టీసీని గాడిన పెడుతున్నట్లు చెప్పారు. త్వరలోనే 300ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించనున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని హకీంపేట్‌లో ఒకటి, వరంగల్‌లో రెండు ఐటీఐ కాలేజీలు తరగతులను ప్రారంభించబోతున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే 1200 ఉద్యోగాలు విడతలవారీగా కారుణ్య నియామకాలు చేయబోతున్నామన్నారు. 
 
ఇప్పటికే పార్సిల్‌ సర్వీస్ ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్న ఆర్టీసీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందన్నారు బాజిరెడ్డి. ఆర్టీసీ ప్రత్యేక బ్రాండ్‌పేరుతో జీవ వాటర్ బాటిళ్లను త్వరలోనే ప్రారంభించనుంది. సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి అక్టోబర్ నెల జీతంతోపాటు ఒక డీఏను అందిస్తామన్నారు. అతి త్వరలోనే ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో సూపర్ లగ్జరీ, డీలక్స్ స్వీపర్ క్లాసెస్ బస్సులు ప్రవేశపెట్టనున్నామని తెలిపారు బాజిరెడ్డి గోవర్ధన్.
 
టీఎస్ ఆర్టిసిలో ఆదాయం పెంచుకొవటానికి 30 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని బాజిరెడ్డి చెప్పారు. ఇటు ప్రయాణికులకు మరోవైపు సంస్థ సిబ్బందికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సిబ్బంది, ప్రయాణికుల మన్ననలను పొందామని అన్నారు. సంస్థ సిబ్బందికి రావాల్సిన బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లిస్తామన్నారు. సిబ్బందికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని. సిబ్బంది పూర్తి విశ్వాసంతో సైనికుడిలా పనిచేసి సంస్థ నష్ట నివారణకు కృషి చేయాలని బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. 
 
టిఎస్ ఆర్టీసి తార్నాక ఆసుపత్రిలో సిబ్బంది కోసం మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు బాజిరెడ్డి గోవర్దన్. సంస్థ కోసం కృషి చేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ వి సి సజ్జానార్, ఇతర సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులకు అబినందనలు తెలిపారు. తాను ఛైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన నుంచి అనేక సంస్కరణలు అమల్లోకి తెచ్చామన్నారు. సంస్థ నష్టాల్లో ఉన్నందున జీతభత్యాలు కూడా వదులుకున్నట్టు తెలిపారు.
 
టిఎస్ ఆర్టిసి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు బాజిరెడ్డి. ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, జాతీయ పండగలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రాయితీలతో, ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తున్నామన్నారు.  తిరుపతి వెంకన్న దర్శనం కోసం ఆర్టీసీ బస్సులోనే 9.7.2022 నుంచి తిరుపతికి బస్‌టికెట్‌తోపాటు  దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ప్రతిరోజు తిరుపతికి 1,000 మంది ప్రయాణికులను చేర్చుతున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రయాణికులు ఫిర్యాదులు తెలుసుకొని తక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Embed widget