అన్వేషించండి

TSRTC ప్రయాణికులకు గుడ్‌న్యూస్ - టోల్ ప్లాజా వద్ద తెలంగాణ ఆర్టీసికి ప్రత్యేక లైన్, ఆరుగురు సిబ్బందితో పర్యవేక్షణ

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతికి బంపర్ ఆఫర్లు, రాయితీలు ఇవ్వడంతోపాటు ప్రయాణికులను వేగంగా గమ్యానికి చేర్చేందుకు సరికొత్త ఐడియాతో రేపటి నుంచి (మంగళవారం నుంచి) టోల్ ప్లాజా వద్ద రంగంలోకి దిగనుంది.

వినూత్న నిర్ణయాలు, వేగంగా పరుగులు.. ఇలా రోజురోజుకూ అభివృద్దివైపు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దూసుకుపోతోంది. గతంలో చేసిన తప్పిదాలు, అవి తెచ్చిన అప్పులు ఇలా అప్పుల ఊబినుండి గట్టెక్కి, సాధ్యమైనంత త్వరగా పునర్వైభవం తెచ్చేందుకు ఆర్టీసి అధికారులు సరికొత్త పంథాలో ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఒకేసారి వెయ్యి బస్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయడంతో పాటు కొత్త టెక్నాలజీతో సూపర్ లగ్జరీ, స్లీపర్ బస్సులను రోడ్లెక్కించి ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన తెలంగాణ ఆర్టీసి. తాజాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతికి బంపర్ ఆఫర్లు, రాయితీలు ఇవ్వడంతోపాటు ప్రయాణికులను వేగంగా గమ్యానికి చేర్చేందుకు సరికొత్త ఐడియాతో రేపటి నుంచి (మంగళవారం నుంచి) టోల్ ప్లాజా వద్ద రంగంలోకి దిగనుంది.

సంక్రాంతి పండుగ సెలవులు మొదలైన రోజు నుంచి హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రోడ్లుపై బస్సులు బారులు తీరుతాయి. ఇక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులైతే చెప్పనక్కర్లేదు. ఓవైపు ఆర్టీసి, మరోవైపు పోటీగా ప్రైవేటు ట్రావెల్స్ ఇలా గమ్యస్దానాలు చేరేవరకూ రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ జామ్.. ఒక్కోసారి బస్సులు టోల్ ప్లాజా దాటాలంటే రెండు మూడు గంటలు ఇక్కడే అయిపోతుందా అనిపిస్తుంది. ఇకపై ఈ పరిస్దితికి చెక్ పెట్టేందుకు తెలంగాణా ఆర్టీసి వినూత్నంగా ఆలోచించింది. 
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టింది. టోల్‌ప్లాజాల వద్ద సులువుగా ఆర్టీసీ బస్సులు వెళ్లేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రధాన మార్గాల్లోని  టోల్‌ ప్లాజాల వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్‌లను కేటాయించాలని కోరుతూ నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌.హెచ్‌.ఎ.ఐ), తెలంగాణ ఆర్‌ అండ్‌ బీ విభాగాలకు లేఖలు రాసింది. ఇదే అంశంపై టోల్‌ ప్లాజా నిర్వాహకులనూ సంప్రదించింది. తమ సంస్థ బస్సులకు ప్రత్యేక లేన్‌ను కేటాయించాలని కోరింది. ఆర్టీసి అభ్యర్దననకు ఆయా విభాగాల నుండి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరి 10వ తేదీ నుంచి ఈ 14 తేదీ  వరకు టీఎస్‌ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజా వద్ద  ప్రత్యేక లేన్‌ను కేటాయిస్తామని సమాచారం అందింది. 

ఇప్పటికే టోల్‌ ప్లాజాల వద్ద టీఎస్‌ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్‌ - విజయవాడ మార్గంలోని పతంగి, కోర్లపహాడ్‌, హైదరాబాద్‌-వరంగల్‌ మార్గంలోని గూడురు, హైదరాబాద్‌-సిద్దిపేట మార్గంలోని దుద్దేడ, హైదరాబాద్‌-నిజామాబాద్‌ మార్గంలోని మనోహరబాద్‌, హైదరాబాద్‌-కర్నూలు మార్గంలోని రాయికల్‌ టోల్‌ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ఆయా టోల్‌ ప్లాజాల వద్ద ఆరుగురు ఆర్టీసీ సిబ్బంది మూడు షిప్ట్‌ల్లో 24 గంటలపాటు విధులు నిర్వహించేందుకు ఇప్పటికే ఉద్యోగులకు ఆదేశాలు జారీచేశారు ఆర్టీసి అధికారులు. ఆర్టీసీ బస్సులు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక లేన్‌ నుండి బయటకు వెళ్లేందుకు స్థానిక పోలీసుల సహకారం కూడా టీఎస్‌ఆర్టీసీ తీసుకోబోతోంది. 

సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌, ఎంజీబీఎస్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రద్దీ సమయాల్లో టోల్‌ ప్లాజాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆర్టీసీ ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే చర్యలు తీసుకునేందుకు సర్వం సిద్దం చేశారు. ఈ సంక్రాంతికి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది టిఎస్ ఆర్టీసి 4,233 ప్రత్యేక బస్సులను మంగళవారం నుంచి 14వ తేది వరకు నడుపుతున్నారు. ఈ వినూత్న నిర్ణయం ఆర్టీసికి ఈ సంక్రాంతికి లాభాల పంట పండించేలా కనిపిస్తోంది. ప్రైవేట్‌ బస్సులో వెళ్లి టోల్‌ ప్లాజాల వద్ద ఇబ్బందులు పడే కన్నా.. టీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రయాణికులను కోరుతోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget