News
News
X

ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ - శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా తదుపరి ప్రక్రియల్లోనూ సఫలీకృతమై నూటికి నూరు శాతం పోలీసు కొలువులు సాధించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

FOLLOW US: 

Telangana SI and Constable Jobs 2022: నిజామాబాద్: తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చేపట్టిన కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమ్స్ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా తదుపరి ప్రక్రియల్లోనూ సఫలీకృతమై నూటికి నూరు శాతం పోలీసు కొలువులు సాధించాలని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ శాసనసభా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఎంపికయ్యేలా తోడ్పాటును అందించడంలో భాగంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో హైదరాబాద్ లోని ప్రముఖ కోచింగ్ సెంటర్లకు ఏమాత్రం తీసిపోనివిధంగా నిష్ణాతులైన ఫ్యాకల్టీచే సుమారు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇప్పించిన విషయం విదితమే. ఈ శిబిరంలో శిక్షణ పొంది ప్రిలిమ్స్ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలకు (TS SI and Constable Events) సన్నద్ధం చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ముందస్తు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి వేముల సోమవారం వేల్పూర్ క్రీడా మైదానంలో లాంఛనంగా ప్రారంభించారు. 

మరికొంత మంది గ్రూప్ ఎగ్జామ్స్‌పై ఫోకస్ 
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, 400 మందికి శిక్షణ ఇప్పించగా, 168 మంది పోలీసు ఉద్యోగాల కోసం ప్రిలిమ్స్ లో అర్హత సాధించారని, వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇక్కడ ప్రీ కోచింగ్ తీసుకున్న వారిలో మరికొంత మంది గ్రూప్ ఎగ్జామ్స్ కు సన్నద్ధమయ్యారని తెలిపారు. ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన 168 మంది ఫిజికల్ ఈవెంట్స్ లోనూ సత్తాను చాటి పోలీసు కొలువులను చేజిక్కించుకోవాలని ఆకాంక్షించారు. గట్టిగా కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా సాధించగలరని సూచించారు. ప్రిలిమ్స్ రాత పరీక్ష తరహాలోనే, ఫిజికల్ ఈవెంట్స్ కు కూడా సెగ్మెంట్లోని వేల్పూర్, మోర్తాడ్, భీంగల్, బాల్కొండ, కమ్మర్పల్లి కేంద్రాలలో ముందస్తు శిక్షణ అందించేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలీసు అధికారులు, పీ.ఈ.టీ లు శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పోలీసు ఉద్యోగాలకు ఎంపికై జీవితంలో స్థిరపడాలని హితవు పలికారు. 
దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించేందుకు పురుష అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు పందెం, నాలుగు మీటర్ల లాంగ్ జంప్, 7.26 కిలోల బరువు కలిగిన షాట్ ఫుట్ ను 6మీటర్ల దూరం విసరాల్సి ఉంటుందని వివరించారు. మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగు పందెం, 2.5 మీటర్ల లాంగ్ జంప్, 4కిలోల బరువు కలిగిన షాట్ ఫుట్ ను నాలుగు మీటర్ల దూరం విసరాల్సి ఉంటుందన్నారు. పై అంశాల్లో అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభ చాటి పోలీసు ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు అంకితభావంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని మంత్రి వేముల పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో  ఆర్మూర్ ఏ.సీ. పీ ప్రభాకర్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, జెడ్పిటిసి భారతి తదితరులు పాల్గొన్నారు.

Published at : 21 Nov 2022 11:44 PM (IST) Tags: Telangana Jobs Vemula Prashanth Reddy constable exam SI Exam

సంబంధిత కథనాలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

YS Sharmila Effigy Burnt: షర్మిల దిష్టిబొమ్మ దహనం, మారకపోతే మరింత బుద్ధి చెబుతామన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

YS Sharmila Effigy Burnt: షర్మిల దిష్టిబొమ్మ దహనం, మారకపోతే మరింత బుద్ధి చెబుతామన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Nizamabad News: జనవరి 10 కల్లా అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు

Nizamabad News: జనవరి 10 కల్లా అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

టాప్ స్టోరీస్

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే