Telangana New Mandals: సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్, ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా మూడు మండలాలు
New Mandals In Telangana: కొత్తగా మండలాలు ఏర్పడినా ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా అదిలాబాద్ జిల్లాలో సోనాల, సాత్నాల నూతన మండలాలు ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.
New Mandals In Adilabad District:
- సోనాల, సాత్నాల, బోరజ్ మండలాల ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్
- సీఎం కేసీఆర్ కి మాజీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే జోగు రామన్న ప్రత్యేక ధన్యవాదాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నూతన జిల్లాలతో పాటు నూతన మండలాలు ఇదివరకే ఏర్పడ్డాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలోను కొత్తగా మండలాలు ఏర్పడినా ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా అదిలాబాద్ జిల్లాలో సోనాల, సాత్నాల నూతన మండలాలు ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ కళ ఎట్టకేలకు నెరవేరింది.
ఆదిలాబాద్ జిల్లాల్లోనీ ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా కొన్ని నూతన మండలాలు ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న తరుణంలో.. శుక్రవారం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సిఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులు మాజీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మేల్యే జోగు రామన్నతో కలిసి సిఎం కేసీఆర్ దృష్టికి నూతన మండలాల విషయాన్ని తీసుకెల్లారు. దీంతో వెంటనే స్పందిచిన సీఎం కేసీఆర్ తన ఫోన్ లో అధికారులతో మాట్లాడి నూతన మండలాలు ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో వారు సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందులో నూతనంగా సోనాల, సాత్నాల, బోరజ్ మూడు మండలాల పేర్లు ఖరారైనట్లు వారు తెలిపారు.
ప్రజల వెసులుబాటు, సకల సౌకర్యాల కొసం నూతన మండలాల ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో ఆ మండలాల్లోనీ ప్రజలు తమ ప్రజా ప్రతినిదులైన మాజీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మేల్యే జోగు రామన్న లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, తాంసి, భీంపూర్ జడ్పీటీసీలు టి.రాజు, కుమ్రం సుధాకర్ తదతరులు ఉన్నారు.
ధరణి తీసేస్తే రైతుబంధు కూడా అందదు, కాంగ్రెస్ నేతలవి అవాకులు చవాకులు - కేసీఆర్
తెలంగాణ వచ్చాకే గిరిజన, తండాలను డెవలప్ చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు అంటురోగాలతో ఉమ్మడి ఆదిలాబాద్ తల్లడిల్లిపోయిందని, ఇప్పుడు పరిస్థితి మొత్తం సద్దుమణిగిపోయిందని అన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు అయిందని అన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రెండు మూడు నెలల్లో మారుమూల తండాలకు, పొలాలకు కూడ త్రీ ఫేస్ కరెంట్ ఇస్తామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో 47 వేల ఎకరాల పోడు భూములను పంపిణీ చేస్తామని అన్నారు.
కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు పేల్చుతున్నారని అన్నారు. ధరణి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ నేతలు మాత్రం తీసేయాలని అంటున్నారని అన్నారు. ధరణి వల్లే భూములు ఇతరుల పేరు మీదకు మార్చడం కుదరదని, రైతు మరణించగానే రూ.5 లక్షల బీమా అందుతోందని అన్నారు. ధరణి లేకపోతే దళారీల రాజ్యం వస్తుందని, రకరకాల ఇబ్బందులు వస్తాయని అన్నారు. అదే తీసేస్తే రైతు బంధు కూడా అందే పరిస్థితి కూడా ఉండబోదని అన్నారు. మహారాష్ట్రలో కూడా ప్రజలు బీఆర్ఎస్ పథకాల పట్ల ఆకర్షితులు అవుతున్నారని, మాకు కూడా ఆ పథకాలు కావాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారని అన్నారు.