అన్వేషించండి

Bandi Sanjay: హిందుత్వంపై నో కాంప్రమైజ్ - మజ్లిస్ కు దమ్ముంటే అన్ని స్థానాల్లో పోటీ చేయాలి: బండి సంజయ్ సవాల్

మజ్లిస్ నేతలకు దమ్ముంటే ఆదిలాబాద్ జిల్లా సహా తెలంగాణలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆదిలాబాద్ జిల్లాలో బండి సంజయ్ శనివారం పర్యటించారు.

‘హిందుత్వం విషయంలో నో కాంప్రమైజ్. నా దారి రహదారి.. బరాబర్ హిందుత్వం గురించి మాట్లాడతా. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కుండ బద్దలు కొట్టారు. మజ్లిస్ నేతలకు దమ్ముంటే ఆదిలాబాద్ జిల్లా సహా తెలంగాణలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆదిలాబాద్ జిల్లాలో బండి సంజయ్ శనివారం పర్యటించారు. బండి సంజయ్ రాకతో కార్యకర్తల్లో పెద్ద ఎత్తున జోష్ నెలకొంది. వందలాది వాహనాలతో వేలాది మంది బండి సంజయ్ వెంట నడిచారు. 

దాదాపు 13 కి.మీల మేరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జనార్దన్ రెడ్డి గార్డెన్స్ లో జరిగిన సభలో టీఆర్ఎస్ సీనియర్ నేత రఘుపతికి కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతోపాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు దారట్ల జీవన్, దుర్గం రాజేశ్వర్, గంటా సంతోష్, శివ,  నాగేందర్, రాజు, సతీష్, కేశవ్ పటేల్, క్రాంతి పటేల్, మోహన్, జైపాల్, రామన్ రాజు, దశరథ్ సహా పలువురు నేతలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు పాయల్ శంకర్, రమాదేవి, జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ సుహాసినీరెడ్డి, కంది శ్రీనివాసరెడ్డి  తదితరులు హాజరయ్యారు.

బండి సంజయ్ ఏమన్నారంటే...
తాను మిస్టర్ ఇండియా చూసిన... కానీ ఇక్కడ మిస్టర్ 40 శాతం కమిషన్ మంత్రిని చూస్తున్న. ఈ జిల్లా మంత్రుల దోపిడీని తట్టుకోలేక ఆ పార్టీ నేతలంతా బీజేపీలో చేరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తాగడానికి నీళ్లు లేవు. సౌకర్యాల్లేవు అన్నారు. వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిమ్స్ కు రూ.130 కోట్లు ఇస్తే.. స్టాఫ్ లేరు, సౌకర్యాల్లేకుండా చేస్తున్నారు. చనాకా – కొరటా ప్రాజెక్టు అంచనాలు పెంచి కమీషన్లు దోచుకుంటున్నరు. కానీ ఇక్కడి వాళ్లకు చుక్క నీరు రాలేదు. పిప్పల్ కోట బ్యారేజీ కోసం వెయ్యి ఎకరాలిచ్చిన రైతులకు నాలుగేళ్ల  క్రితం ఎకరాకు రూ.8 లక్షలలిస్తే... ఇప్పుడు రూ.7 లక్షలే ఇస్తానంటూ రైతుల ఉసురు తీసుకుంటున్నారు.

ఇంటికో ఉద్యోగమన్నారు. ఒక్కరికీ ఉద్యోగమియ్యలే. నిరుద్యోగ భ్రుతి ఇస్తానన్నడు. ఒక్కరికీ ఇయ్యలే. కేసీఆర్ సర్కార్ ను తీసుకుపోయి కుంటాలలో విసిరిపారేద్దాం. నరేం ద్రమోదీ ప్రభుత్వం ఈ ఏడాదిలోనే 10 లక్షల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చింది. రోజ్ గార్ మేళా తో గత మూడు నెలల్లో 2.16 లక్షల ఉద్యోగాలను అపాయిట్ మెంట్లతో భర్తీ చేశారు. కానీ కేసీఆర్ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిండా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇక్కడ ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలే. ఆయన మాత్రం 100 రూముల ఇల్లు కట్టుకున్నడు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో నిలువనీడలేని పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం. దీంతోపాటు ఉచిత విద్య, వైద్యం కూడా అందిస్తాం అన్నారు.

‘దేశమంతా కేసీఆర్ ను చూసి నవ్వుతోంది. ప్రజల కష్టాల పట్టని కేసీఆర్ రాత్రింబవళ్లు తాగడం తప్ప చేసిందేమీ లేదు. ఇచ్చిన హామీలైన రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడానికి డబ్బుల్లేవన్నడు. దేశం నవ్వుతుంటే తెలంగాణ ప్రజలు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. పోడు భూములకు పట్టాలిస్తానని హామీ ఇఛ్చి మోసం చేసిండు. కుర్చీ వేసుకుని కూర్చుంటానని చెప్పి మోసం చేశాడు.  ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారు. ఒక్కొక్కరి పేరిట రూ.1.20 లక్షల అప్పు భారం మోపిండు. తెలంగాణలో ఎట్లాగూ బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి లేదు. పొరపాటున కేసీఆర్ గెలిస్తే ఒక్కొక్కరిపై రూ.5 లక్షల అప్పు భారం మోపుతారు.

ఎంఐఎం లీడర్లకు దమ్ముంటే ఆదిలాబాద్ జిల్లాలో పోటీ చేయ్... మీ సంగతి చూస్తాం. ఈ గడ్డమీద పచ్చ జెండాకు స్థానం లేదు. కాషాయ జెండా నుండి వచ్చే భగభగలకు నీ జెండా మాడిమసై పోతది. ఈ గడ్డమీద ఎగిరేది కాషాయ జెండా మాత్రమే అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో 80 శాతమున్న హిందువుల గురించి మాట్లాడితే బండి సంజయ్ ను మతతత్వ వాదిగా చిత్రీకరిస్తున్నారు. బరాబర్ 80 శాతం హిందువుల గురించి మాట్లాడి తీరుతా అన్నారు. బిహార్, మహారాష్ట్ర, గుజరాత్ లో ఎంఐఎం పార్టీ లేనేలేదు. కానీ 12 శాతం ఓట్లతో బీహార్ లో 5 సీట్లు గెలిస్తే... 80 శాతం హిందువులున్న తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలవాలో ఆలోచించాలన్నారు.

పోడు భూముల సమస్యపై పోరాడింది. రైతుల పక్షాన లాఠీ దెబ్బలు తిన్నది, 317 జీవో పై ఉద్యోగుల పక్షాన కొట్లాడింది బీజేపీ పార్టీ మాత్రమే. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీయే. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నరు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు ఓటేశాం... ఈసారి బీజేపీకి అవకాశం ఇయ్యాలని ప్రజలంతా భావిస్తున్నారు. 1983 నుండి నేటి వరకు రాష్ట్రంలో అధికార పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీలకు మాత్రమే ఓటేశారు. ఈసారి బీజేపీకి ఓటేయబోతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ సమితిగా మారిపోయింది. నాందేడ్ పోయి ఛత్రపతి శివాజీ ఫోటో పెట్టుకుని సభ నిర్వహించిన కేసీఆర్ తెలంగాణలో మాత్రం శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేసే బీజేపీ కార్యకర్తలను లాఠీలతో కొట్టించారని మండిపడ్డారు.

ప్రజల నడ్డి విరుస్తున్న కేసీఆర్
బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలుసహా అన్ని రకాల పెంచి ప్రజల నడ్డి విరుస్తుండు. 24 గంటల కరెంట్ ఇస్తున్నానని చెప్పి మోసం చేస్తున్నడు. నేను ఎక్కడికి వెళ్లినా కరెంట్ కట్ చేస్తున్నడు.. ఇట్లనే చేస్తే కేసీఆర్ కరెంట్ చేయడం తథ్యం. ఇసుక, ల్యాండ్, డ్రగ్స్, లిక్కర్ దందాలతో బీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారు. అభివృద్ధి పనులకు కేంద్రమే నిధులిస్తోంది. వాటిపై కేసీఆర్ తన ఫోటోలు పెట్టుకుని ఊరేగుతున్నరు. మద్యం ద్వారా రూ.40 వేల కోట్లు సంపాదిస్తూ... రైతు భీమా, కళ్యాణ లక్ష్మీ, పెన్షన్ల కోసం 30 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నడు అని బండి సంజయ్ అన్నారు. 
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలంటే... సంక్షేమ పథకాలు అమలు కావాలంటే.. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే. అప్పుడే పేదలకు న్యాయం జరుగుతుంది. పొరపాటున పెద్దల రాజ్యం వస్తే అంతే సంగతులు. పేదలు గల్లా ఎగరేసుకుని తిరిగే పరిస్థితి రావాలంటే బీజేపీ రావాలి. గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిద్దాం అని యువతకు పిలుపునిచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP DesamNita Ambani Saree and jewelry | Trump Swearing Ceremony లో ప్రధాన ఆకర్షణగా నీతా,ముకేశ్ అంబానీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ  బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
CM Chandrababu: 'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Mahakumbh Viral Girl Monalisa: కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను  కట్టిపడేసింది. 
కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను  కట్టిపడేసింది. 
Nara Lokesh: 'మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా' - టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు
'మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా' - టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు
Embed widget