By: ABP Desam | Updated at : 03 Feb 2023 09:10 PM (IST)
సీఎం కేసీఆర్ ని కలిసిన RGSS నాయకులు
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాజ్ గోండ్ సేవా సమితి నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీలైన గొండ్, కొలాం, నాయకపోడ్, ప్రధాన్, తోటి, మన్నెవార్, కోయ, ఆంద్, చెంచు మొదలగు ఆదివాసీ తెగలవారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని రాజ్ గొండ్ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోరేంగ దౌలత్ రావ్ మోకాసి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విశ్వంరావ్ లు సిఎం కేసిఆర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఏపీలో సీఎం జగన్ అమలు చేశారు !
ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపునిస్తు గోండి భాష అభివృద్ధికి కొరకు ప్రత్యేక బోర్డ్ ఏర్పాటు చేయాలని, గోండి భాషను రాజ్యాంగంలో చేర్చాలని కోరారు. ఆదివాసీల జీవనోపాధికి తోడ్పాటునందించేలా వ్యవసాయ అభివృద్ధి కొరకు అవసరమున్న చోటా కోత్తగా ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా ఆదివాసీల ఆరాధ్య దైవ పుణ్యక్షేత్రాలైన 1, జంగో లింగో దీక్ష సంస్థాన్ జంగావ్, 2, కప్లై సిద్దికాస, 3, బైరందేవ్ మహాదేవ్ ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. అందులో ముఖ్యంగా గోండి ధర్మ కోయం పున్నెం కోడ్ ను అసెంబ్లీలో చట్టం ఎర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో సిఎం జగన్ అమలు చేశారని గుర్తు చేశారు. జివో నెం.3 చట్టం పునరుద్దరించాలని, ఆదివాసీల కోసం ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సి నిర్వహించాలని, పొడు భూములుకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు విద్య,వైద్య సౌకర్యాలు కల్పించాలని, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు.
అంతకు ముందు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావును కలిసి ఆదివాసీల సమస్యలు తెలియజేశారు. మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసులకు వైద్య సౌకర్యాలు లేక వైద్యులు లేక చాలా మంది గర్భిణులు మరణిస్తూన్నారని, అలాగే వర్షకాలంలో రోడ్డు సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది కావున ఆదివాసీల అభివృద్ధికి తోడ్పాటునందిస్తు అభివృద్ధి చేయాలని కోరారు.
ఆదివాసీల మేడారం మినీ జాతర
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క, సారలమ్మ తల్లుల మేడారం మినీ జాతర మూడు రోజుల కిందట ఘనంగా ప్రారంభమైంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు జాతరకు బారులు తీరారు. గుడి లేని దేవతలు, గిరిజనుల ఆరాధ్య దైవాలు, ఆదివాసీ గిరిజన పల్లె ప్రజల ఇలవేల్పు సమ్మక్క సారలమ్మ తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చే భక్తులకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. చీరలు, సారెలు పసుపు, కుంకుమలు.. కొబ్బరికాయలు సమర్పించి కోళ్లను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకునేందుకు గ్రామీణ ప్రజలు సమయాత్తమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమ్మక్క- సారలక్కల పూనకాలతో భక్తుల సందడి మొదలైంది. మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాల వద్ద పూణ్య స్నానాలు ఆచరించి.. పుట్టు వెంట్రుకలు, మొక్కుడు వెంట్రుకలు సమర్పిస్తారు.
TSPSC Paper Leak: ఉదాసీనతే కొంప ముంచిందా? విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు హాజరైన కమిషన్ ఉద్యోగులు! అయినా నో రెస్పాన్స్!
SSC Exam Hall Tickets: 'టెన్త్' హాల్టికెట్లు మార్చి 24న విడుదల, 'బిట్ పేపర్' విషయంలో కీలక నిర్ణయం!
TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్పీఎస్సీ గుడ్బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్లైన్లోనే!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
TS SSC Exams: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ!
300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన
పేపర్ లీకేజీపై గవర్నర్ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ
Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్బుక్ పోస్ట్తో ఇంటి గుట్టు బయటకు
TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు