అన్వేషించండి

Viral Video: వాంకిడిలో రైతును బురిడీ కొట్టించి 75 వేలు చోరీ.. పట్టపగలే సినిమా సీన్ తరహాలో

Robbery in Wankidi Watch Video | కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో రైతును బురిడీ కొట్టించిన నలుగురు దుండగులు 75 వేలు దోచుకెళ్లారు. ఈ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Robbery in Wankidi | వాంకిడి: దొంగలు తెలివి మీరిపోతున్నారు. ప్లాన్ ప్రకారం నగలు, డబ్బు, ఖరీదైన వస్తువులు కొట్టేస్తున్నారు. కొందరు ఏకంగా టెక్నాలజీతో సైబర్ క్రైమ్ చేసి లక్షల నుంచి కోట్ల వరకు కొల్లగొడుతూ సామాన్యులకు మోసం చేస్తున్నాయి. క్షణం ఏమరపాటున ఉన్నా మన వద్ద ఉన్న నగదు దోచేస్తారు. సరిగ్గా అలాంటి ఘటనే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో జరిగింది. 

ప్లాన్ చేసి రైతు డబ్బు కొట్టేసిన కేటుగాళ్లు

పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. తపసే శ్యామ్ రావు అనే రైతును లక్ష్యంగా చేసుకుని, నలుగురు దుండగులు పథకం ప్రకారం రెక్కీ నిర్వహించారు. ఆయన వద్ద ఉన్న ₹75,000 నగదును దోచుకెళ్లారు. రైతు శ్యామ్ రావు బ్యాంకు నుండి నగదు డ్రా చేసుకుని తన బైక్‌పై తిరిగి వెళ్తున్నారు. ముందుగానే ఆయన వద్ద నగదు ఉన్న విషయాన్ని పసిగట్టిన దొంగలు ఆ నగదు కొట్టేయాలని ప్లాన్ చేసి, ఆయనను ఫాలో అయ్యారు. 

తక్కువ రద్దీ ఉన్న ప్రాంతంలో ఆయనను గమనించిన దొంగలు, బైక్ నుండి ఏదో కింద పడిపోయిందని నమ్మించారు. రైతు తన బైక్ దిగి చూసుకునేందుకు అటువైపు వెళ్లగా, పక్కనే ఉన్న దొంగ ా బైక్ కవర్‌లో ఉన్న నగదు బ్యాగును లాక్కుని క్షణాల్లో పరారయ్యాడు. మొత్తం రెండు బైకులపై నలుగురు దొంగలు ఈ చోరీకి ప్లాన్ చేశారు. మొదట ఓ వ్యక్తి ఏదో కవర్ పడిపోయిందని చెప్పాడు.. అప్పటికే మరో బైకుతో పికప్ చేసుకునేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. బాధిత రైతు నగదు కోసం ఓవైపు వెళ్లగా అటు నుంచి వచ్చిన మరో దొంగ ఇంకో బైక్‌ ఎక్కి పరారయ్యారు. 

నలుగురు నిందితులు ఈ చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ చోరీకి సంబంధించిన మొత్తం దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా ముఖానికి వైట్ క్లాత్ కట్టుకున్నారని పోలీసులు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilbad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Embed widget