Gussadi Kanaka Raju: గుస్సాడీ కనకరాజు మృతిపై రేవంత్, కేసీఆర్, కేటీఆర్ సంతాపం- గిరిజన సంస్కృతిని చాటి చెప్పిన కళాకారుడిగా గుర్తింపు
Telangana News: పద్మశ్రీ కనకరాజు మృతి గిరిజన ప్రజలకు పూడ్చుకోలేని లోటుగా నేతలు అభిప్రాయపడ్డారు. సీఎం, ప్రధాని సహా ప్రముఖులు తమ సంతాప సందేశాన్ని అందించారు.
Adilabad News: గుస్సాడీ నృత్యాన్ని విస్తృత పరిచిన 94ఏళ్ల పద్మశ్రీ కనకరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. గిరిజన బిడ్డల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్యంతో కనకరాజు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సొంతూరు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గ్రామం. ఈయన గత కొంత కాలంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనేక ఆసుపత్రుల్లో చూపించిన ప్రయోజనం లేకపోయింది.
గుస్సాడీ నృత్యాన్ని కాపాడుతూ వచ్చిన వ్యక్తిగా పేరు ఉన్న కనకరాజుకు కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును నవంబర్ 9న అందుకున్నారు. వందల మంది యువకులు ఆయన వద్ద గుస్సాడీ నృత్యం నేర్చుకొని శిష్యులుగా మారారు.
గిరిజన బిడ్డలకు ఎంతో ఇష్టమైన గుస్సాడీ నృత్యానికి వన్నెత తేవడమే కాకుండా పద్మశ్రీ అందుకొని తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచిన కనకరాజు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేస్తామని ప్రకటించారు.
గుస్సాడీ నృత్య కళాకారుడు,
— Revanth Reddy (@revanth_anumula) October 26, 2024
పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం…
దిగ్భ్రాంతిని కలిగించింది.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని…
భగవంతుడిని ప్రార్థిస్తూ…
ఆయన కుటుంబ సభ్యులకు…
నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/byLkXXdttP
Hailing from the Raj Gond tribe, Sh #KanakaRaju, also known as Gussadi Raju, dedicated over four decades to popularizing Telangana's rhythmic folk dance, #Gussadi, capturing the nation’s imagination. (1/3) #BharatKiNrityaKala #PeopleOfCulture pic.twitter.com/YZdcxUeHyh
— Ministry of Culture (@MinOfCultureGoI) October 26, 2024
కనకరాజు అద్భుతమైన నృత్యకారుడు సాంస్కృతిక దిగ్గజం అని ప్రధానమంత్రి కొనియాడారు. అలాంటి వ్యక్తి మరణించినందుకు విచారం వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యాన్ని పరిరక్షించడంలో ఆయన అందించిన గొప్ప సహకారం రాబోయే తరాలను ఎల్లప్పుడూ చైతన్యవంతం చేస్తుందన్నారు. ఆయన అంకితభావం, అభిరుచి సాంస్కృతిక వారసత్వం ముఖ్యమైన అంశాలు వాటి ప్రామాణికమైన రూపంలో వృద్ధి చెందేలా చూసిందని అభిప్రాయపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు ప్రధానమంత్రి.
Saddened by the passing of Shri Kanaka Raju Ji, a prolific dancer and cultural icon. His rich contribution to preserving Gussadi dance will always motivate the coming generations. His dedication and passion ensured that important aspects of cultural heritage can flourish in their… pic.twitter.com/RAu3C8v4d1
— Narendra Modi (@narendramodi) October 26, 2024
గిరిజన సాంప్రదాయ నృత్యమైన ‘గుస్సాడి’కి ప్రత్యేక గుర్తింపు తీసుకుకొచ్చిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు ఇకలేరని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలోని మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్ కుమురం భీం జిల్లా నుంచి వచ్చి.. గుస్సాడికి గుర్తింపు తీసుకురావడం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన కనకరాజు మృతి తెలంగాణకు మరీ ముఖ్యంగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు తీరని లోటుగా అభివర్ణిచంచారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు, గిరిజన సమాజానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
కనకరాజు మృతికి బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్, వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర నేతలు తీవ్ర సంతాపం తెలియజేశారు. కనకరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎర్రకోటపై నృత్యాన్ని ప్రదర్శించి తెలంగాణ ఆదివాసీ సంస్కృతిని తెలియజేశారని అన్నారు కేటీఆర్.
Deeply saddened by the loss of Shri Kanaka Raju Ji, a true cultural ambassador.
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) October 26, 2024
His selfless contribution to preserving Gussadi dance has left an indelible mark on our cultural landscape, inspiring generations with his passion & dedication. Condolences to his loved ones in this… pic.twitter.com/v82Hn0kkHJ