By: ABP Desam | Updated at : 18 Jul 2022 05:14 PM (IST)
నిజామాబాద్ జిల్లాకు పొంచి ఉన్న గండం - ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకోండి !
Nizamabad High Alert : నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తతతో చర్యలు చేపట్టారు. ప్రత్యేక అధికారుల నేతృత్వంలో మంగళవారం మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ కింది అధికారులను ఆదేశించారు. మండల స్థాయి సమావేశం నిర్వహించడానికి ముందు క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి నివాస ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు, రక్షిత మంచి నీటి సరఫరా జరిగేలా పర్యవేక్షణ జరపాలని, ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు ఏర్పడితే వెంటనే సరి చేసుకోవాలని హితవు పలికారు.
వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు
ట్యాంకు వారీగా మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించాలని, నివాస ప్రాంతాల నడుమ వర్షపు జలాలు నిలువ ఉండకుండా చూడాలన్నారు. ఎక్కడైనా నీరు నిలువ ఉంటే దోమల వ్యాప్తిని నిరోధించేందుకు వీలుగా ఆయిల్ బాల్స్ వేయించాలని అన్నారు. ప్రజలు దోమతెరలు వాడేలా అవగాహన కల్పిస్తూ, విస్తృత ప్రచారం చేయాలన్నారు. శానిటేషన్, తాగునీటి సరఫరా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావు కల్పించినా, సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున అధికారులు, సిబ్బంది అందరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఆదేశించారు.
వర్షాలకు పాడాైన వాటికి తక్షణం మరమ్మత్తులు
సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు చెందిన విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వీలుగా వారిని బయటకు వెళ్లేందుకు అనుమతించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటన జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ తో విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నందున, అవసరమైన చోట తక్షణ మరమ్మతులు జరిపించాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో 557 విద్యుత్ స్తంభాలు, 109 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని, వీటిని వెంటనే సరిచేస్తూ విద్యుత్ సరఫరా వ్యవస్థకు ఆటంకం లేకుండా యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. నివాస ప్రాంతాలకు కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా పకడ్బందీగా వ్యవహరించాలని, ఎక్కడైనా సాంకేతిక సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించాలన్నారు.
విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారం
ముఖ్యంగా వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను రెండుమూడు రోజుల్లోపే అన్ని ప్రాంతాల్లో సరిచేస్తూ సేద్యపు రంగానికి కరెంటు సరఫరా యధాతథంగా జరిగేలా చొరవ చూపాలన్నారు. వర్షాల కారణంగా ఎన్ని నివాస గృహాలు పాక్షికంగా, ఎన్ని పూర్తిగా దెబ్బతిన్నాయన్నది క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ గ్రామాల వారీగా నివేదికలు సమర్పించాలని, బాధితులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిహారం అందించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. వరద నీటి ప్రవాహానికి దెబ్బతిన్న రహదారులను గుర్తిస్తూ, తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు.
Nizamabad News: వర్షం పడింది- మొక్కజొన్నకు డిమాండ్ పెరిగింది
Nizamabad News: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తెలంగాణ యూనివర్శిటీ
Mobile Hospital: ఏజెన్సీ గ్రామాల్లో మొబైల్ ఆస్పత్రి, గిరిజనుల కోసం మెగా వైద్య శిబిరం!
TU Students Dharna: తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థుల రెండో రోజు నిరసన
Weather Updates: మరో అల్పపీడనం ముప్పు, ఏపీలో ఎఫెక్ట్ ఇలా - తెలంగాణలో 2 రోజులు IMD ఎల్లో అలర్ట్
IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!
Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?
ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?
Rajinikanth as Governor: రజనీకాంత్‌కు గవర్నర్ పోస్ట్ ! బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?