(Source: Poll of Polls)
Nizamabad News: మరో అరుదైన రికార్డు సాధించిన మలావత్ పూర్ణ
సాహసమే ఆమె ఊపిరి. మరో అరుదైన ఘనత సాధించిన మలావత్ పూర్ణ. నార్త్ అమెరికా ఖండంలో డెనాలీ పర్వతాన్ని అధిరోహించిన పూర్ణఇందూరు కీర్తిని మరోసారి చాటిన మౌంటెనీర్ మలావత్ పూర్ణ
ఇందూరు ఆడబిడ్డలు జిల్లా పేరును ప్రపంచస్థాయికి వినిపిస్తున్నారు. క్రీడారంగాల్లో...చదువుల్లో రాణిస్తూ...శభాష్ అనిపిస్తున్నారు. ఇటీవలే ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ పతకాన్ని కొట్టి ఔరా అనిపించింది నిఖత్ జరీన్. సీవిల్స్‌లో జిల్లా 134వ ర్యాంక్ సాధించి ఇందూరు పేరును నిలబెట్టింది అరుగుల స్నేహ. ఇండియా హాకీ జట్టులో స్థానం సాధించిన యెండల సౌందర్య, అటు ఫుట్ బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది గుగులోత్ సౌమ్య ప్రస్తుతం మలావత్ పూర్ణ మరోసారి తన సత్తాచాటి జిల్లా పేరు మారుమోగిపోయేలా చేసింది.
డెనాలీ పర్వతాన్ని అధిరోహించిన పూర్ణ
మలావత్ పూర్ణ 13 ఏళ్ల వయస్సులోనే ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి శభాష్ అనిపించింది. తాజాగా నార్త్ అమెరికా ఖండంలోని డెనాలీ పర్వతాన్ని అధిరోహించింది. దీంతో ఈ విశ్వంలోని ఏడు శిఖరాలను అధిరోహణ పూర్తి చేసిన అరుదైన ఘనతను సాధించింది మలావత్ పూర్ణ. పేదరికంలో పుట్టినా... ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలే అయినా... మొక్కవోని విశ్వాసం మలావత్ పూర్ణది. చిన్న తినంలోనే ఎవరెస్టు శిఖరం అవలీలగా ఎక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ అడవి బిడ్డ.
మలావత్ పూర్ణ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామం. చిన్న గ్రామం నుంచి పుట్టిన మలావత్ ఎంతో ఎత్తుకు ఎదిగింది. మలావత్ సాహసాల వెనుక అమె కృషి, పట్టుదల, కఠినమైన శ్రమ ఈ స్థాయికి తీసుకోచ్చింది. పూర్ణ.. తల్లిదండ్రులు దేవీదాస్, లక్ష్మి వ్యవసాయ కూలీలు. అన్నయ్య నరేశ్. మలావత్ పూర్ణ ఐదో తరగతి వరకూ పాకాల గ్రామంలోనే చదివింది. ఆరో తగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తాడ్వాయి గిరిజన గురుకుల పాఠశాలలో చదివింది. కామారెడ్డిలో డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదువుతోంది.
చిన్నతనం నుంచే కొండలు అవలీలగా ఎక్కేది పూర్ణ
పాకాలలో కొండలు గుట్టలు ఉంటాయ్. చిన్నతనంలో తల్లిదండ్రులతో పూర్ణ కొండలు, గుట్టలు ఎక్కేది. అందుకే పర్వతారోహణ శిక్షణలో ఆమెకు బాగా కలిసిసోచ్చింది. అయితే తాడ్వాయిలో చదువుకునే రోజుల్లో భువనగిరి రాక్ లైమింగ్ సెంటర్‌లో ట్రైనర్ పూర్ణను ఎంపిక చేశారు. ఇక్కడ ట్రెక్కింగ్, పర్వతారోహణలో శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత లడక్‌లో ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ సంస్థలో ట్రైయిన్డ్ అయ్యింది పూర్ణ. అక్కడ చలికాల పరిస్థితుల్లో ఎత్తైన ప్రదేశాలు ఎక్కడంలో శిక్షణ ఇస్తుంటారు. ఏడాది తిరగకుండానే ఎవరెస్ట్ ఎక్కేందుకు ఎంపికైన బృందంలో చోటు దక్కించుకొంది మలావత్ పూర్ణ. అప్పట్లో గురుకులాల కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూర్ణను బాగా ప్రోత్సహించారు. అలా పిన్న వయసులోనే ఎవరెస్ట్ అధిరోహించిన ఆమెను రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. ఏడు పర్వతాలు ఎక్కేందుకు పూర్ణకు ఎనిమిదేళ్లు పట్టింది.
చిన్న తనంలో ఎవరెస్ట్ ఎక్కిన పూర్ణ తాజాగా సాధించిన ఘనత ఆమె జీవతంలో మైలురాళ్లుగా నిలిచిపోతాయ్. కృషి, పట్టుదల, శ్రమ ఉంటే పేదరికం దేనికీ అడ్డురాదని నిరూపించింది మలావత్ పూర్ణ.