News
News
X

Nizamabad: కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకున్న వ్యక్తి - తల్లి, భార్యాపిల్లల ముందే ఆత్మహత్యాయత్నం

Nizamabad: పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే సమయంలో అక్కడున్న జర్నలిస్టులు పెట్రోల్ బాటిల్ లాగేసి అగ్గి పెట్టెను లాక్కున్నారు.

FOLLOW US: 

Nizamabad Collectorate: నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే సమయంలో అక్కడున్న జర్నలిస్టులు పెట్రోల్ బాటిల్ లాగేసి అగ్గి పెట్టెను లాక్కున్నారు. వివరాల్లోకి వెళితే, నందిపేట్ మండలం కుద్వాన్ పూర్ గామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మాక్లూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన శ్రీరాముల సత్యనారాయణ, కృష్ణ అనే వ్యక్తుల వద్ద 2 లక్షల 10 వేల ఇన్సూరెన్స్ ను ఫైనాన్స్ గా కన్వర్ట్ చేసుకున్నారు.

దీంతో ఇరువురు బాధితుడు శ్రీనివాస్ వద్ద 10 రూపాయల మేర వడ్డీ వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై అనేక సార్లు పోలీసులకు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని, పోలీసులు సైతం వారికే వత్తాసు పలుకుతున్నారని వాపోయాడు. 

ఇటీవల కోర్టు నుంచి బాధితుడికి నోటీసులు పంపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. దిక్కుతోచని స్థితిలో భార్యా పిల్లలు, తల్లితో కలెక్టరేట్ వద్దకు వచ్చారు. ప్రజావాణికి సెలవు కావటంతో తనకు న్యాయం జరిగే పరిస్థితి లేదని భావించి తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం కలెక్టర్ వస్తున్నది గమనించి కలెక్టర్ వాహనానికి అడ్డుగా వెళ్లి తన గోడు వెళ్ళ బోసుకున్నాడు. కలెక్టర్ నారాయణ రెడ్డి బాధితుడి సమస్యను తెలుసుకున్నారు. న్యాయం చేస్తానని కలెక్టర్ చెప్పటంతో బాధితుడు శ్రీనివాస్ వెనక్కి తగ్గాడు.

మంచిర్యాల జిల్లాలో అమానుషం

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవపూర్ గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. మద్యానికి బానిసైన తల్లిదండ్రులు కుమారుడు బిక్షాటన చేసిన డబ్బులతోనే జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే బాలుడు బిక్షాటన చేసి డబ్బులు ఇంటికి తీసుకువచ్చాడు. తండ్రి మద్యానికి డబ్బులు కావాలని అడగడంతో కుమారుడు ఇవ్వడానికి నిరాకరించాడు. కోపంతో తండ్రి కుమారున్ని  మూడు రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించాడు. ఆదివారం (జూలై 25) కాగుతున్న వేడి నూనెను రెండు చేతులపై పోశాడు. బాలుడు గట్టిగా అరవడంతో స్థానికులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలుడికి చికిత్సను అందించారు. ఇలాంటి పైశాచిక తండ్రిని పోలీసులు కఠినంగా శిక్షించాలని స్థానికులు తెలుపుతున్నారు.

Also Read: Kamareddy Monkeypox: ఫీవర్ ఆస్పత్రిలో కామారెడ్డి మంకీపాక్స్ కేసు, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏమన్నారంటే

Published at : 25 Jul 2022 02:51 PM (IST) Tags: nizamabad suicide attempt Nizamabad Latest News Nizamabad Collector nizamabad collectorate

సంబంధిత కథనాలు

Weather Updates: ఏపీలో మరో 24 గంటలు వర్షాలు - తెలంగాణలో వాతావరణం ఇలా

Weather Updates: ఏపీలో మరో 24 గంటలు వర్షాలు - తెలంగాణలో వాతావరణం ఇలా

Poker Players Arrest: టాస్క్ ఫొర్స్ పోలీసుల మెరుపు దాడి, 13 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ - భారీగా నగదు స్వాధీనం

Poker Players Arrest: టాస్క్ ఫొర్స్ పోలీసుల మెరుపు దాడి, 13 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ - భారీగా నగదు స్వాధీనం

Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD

Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD

Swine Flu in Adilabad: ఆదిలాబాద్ లో స్వై‌న్ ఫ్లూ కలకలం, ఆందోళనలో ప్రజలు

Swine Flu in Adilabad: ఆదిలాబాద్ లో స్వై‌న్ ఫ్లూ కలకలం, ఆందోళనలో ప్రజలు

Asifabad: ఆసిఫాబాద్‌ జిల్లాలో కుంగిన బ్రిడ్జి, పక్కకు ఒరిగిపోయిన పిల్లర్ - ఏ క్షణమైనా కూలే ఛాన్స్!

Asifabad: ఆసిఫాబాద్‌ జిల్లాలో కుంగిన బ్రిడ్జి, పక్కకు ఒరిగిపోయిన పిల్లర్ - ఏ క్షణమైనా కూలే ఛాన్స్!

టాప్ స్టోరీస్

BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్‌లో బీజేపీ వ్యూహం ఫలించేనా?

BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్‌లో బీజేపీ వ్యూహం ఫలించేనా?

Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం

Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!