News
News
వీడియోలు ఆటలు
X

తెలంగాణ యూనివర్సిటీలో కీలక పరిణామాలు, వీసీపై విజిలెన్స్‌, ఏసీబీకి ఫిర్యాదు

తెలంగాణ యూనివర్సిటీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాలనను గాడిలో పెట్టేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది.

FOLLOW US: 
Share:

- ఆ ముగ్గురు రిజిస్ట్రార్లపై క్రిమినల్‌ కేసులకు సిఫార్సు..
- మళ్లీ టీయూ రిజిస్ట్రార్‌గా యాదగిరి
తెలంగాణ యూనివర్సిటీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాలనను గాడిలో పెట్టేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) కీలక భేటీ జరిగింది. దీంట్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుని తీర్మానాలు చేశారు. ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం టీయూను గాడిలో పెట్డడంలో భాగంగానే ఈసీ మీటింగు, తీర్మానాలు చేయించినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా వీసీ రవీందర్‌ గుప్తాపై ఏసీబీకి, విజిలెన్స్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేయాలని తీర్మానం చేశారు.

గత కొంత కాలంగా నిత్యం యూనివర్సిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. వీసీ చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయాలని తీర్మానం చేయడంతో పాటు ..వీసీ అనధికారికంగా నియమించుకున్న ముగ్గురు రిజిస్ట్రార్లు శివశంకర్‌, విద్యావర్ధిని, నిర్మలాదేవీ లపై క్రిమినల్ కేసులకు చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గతంలో నియమించిన రిజిస్ట్రార్‌ ఏడాది గడువు కాలం పూర్తికాకముందే అతన్ని తొలగించినందున.. మళ్లీ అతన్నే రిజిస్ట్రార్‌గా నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది ఈసీ. దీంతో ప్రభుత్వం ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈసీ మీటింగులో మారయ్య గౌడ్‌, నసీం, హారతి, రవీందర్‌ రెడ్డి, వసుంధర, గంగాధర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ యూనివర్సిటీలో వివాదాలు సద్దుమణగుతాయా? 

అధికారుల మధ్య సమన్వయం లోపించి ఏడాదిన్నర కాలంగా సమావేశాలు లేక వర్సిటీలో ఏం జరిగిందో తెలియని పరిస్థితి. వారం కింద జరిగిన భేటీలో అనూహ్య నిర్ణయాలతో అందరిని ఆశ్చర్య పరిచింది పాలక మండలి. తాజాగా మరోమారు జరిపిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. వీసీపైనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానించడం, ఇన్ఛార్జి రిజిస్ట్రార్ గా ఉన్న ప్రొఫెసర్ విద్యా వర్ధినిని సస్పెండ్ చేశారు. వీసీపై ఏసీబీ విచారించాలని నిర్ణయించడం సంచలన నిర్ణయమే. అకడమిక్ కన్సల్టెంట్ విధుల్లో నుంచి తొలగింపు నిర్ణయంతో పాటు వారం రోజుల్లోనే పదోన్నతుల రద్దు, అడ్వాన్సులు తీసుకున్న వారికి రికవరీ నోటీసుల జారీ వంటి నిర్ణయాలు జరిగిపోయాయి.

2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఇంకా బడ్జెట్ ఆమోదం పొందలేదు. రెండు సమావేశాల్లో దీనిపై చర్చించినా చేసిన ఖర్చులకు సరైన లెక్కలు లేవని అధికారులు సమాధానం ఇచ్చారు. గడిచిన 8 నెలల కాలంలో వివిధ కార్యక్రమాల పేరిట పెద్ద మొత్తంలో వ్యయాలు చేసినట్లు వివరించారు. ఎక్కువ మొత్తం నోట్ ఫైల్ లేకుండా డబ్బులు డ్రా చేయటం జరిగిందని చెప్పారు. వీటిని ఏ ప్రాతిపదికన చేశారు? ఇప్పుడెలా లెక్క చూపాలి? అన్నది తేలాల్సి ఉందన్నారు. చెల్లింపుల విషయంలో నిబంధనలు పాటించలేదని వివరించారు. దీంతో మళ్లీ బడ్జెట్ పక్కకు పెట్టారు. దీనికి ఆమోదం లభిస్తేనే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 పద్దు ప్రతిపాదనల ఆమోదంపై ముందుకెళ్లాల్సి ఉంటుంది. దీంతో రెండు బడ్జెట్లపై పీటముడి వీడలేదు. సమస్యను అధిగమించేందుకు నిధుల దుర్వినియోగం అంశంపై విచారణ పూర్తిచేయాలని నిర్ణయించింది.

నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఖర్చులపై విచారించేందుకు ఐదుగురి సభ్యుల కమిటీ వర్సిటీకి రానుంది. బడ్జెట్ ఆమోదం లేకుండా ఎంత ఆర్థిక వ్యయాలు చేశారు? అందులో నోట్ ఫైల్ లేకుండా ఎన్ని ఉన్నాయి? వాటిని ఎందుకు చేశారో? పరిశీలించనున్నారు. ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి చంద్రకళ నేతృత్వంలో కమిటీ ఆయా అంశాలు పరిశీలించనుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఫైళ్ల ఆధారంగా సిద్ధం చేయాలని ఇప్పటికే రిజిస్ట్రార్ కు సూచించింది. సిబ్బంది ద్వారా కొంత సమాచారం సిద్ధం చేసినట్లు సమాచారం. వీటిల్లో కీలకంగా ఉత్తర్వులు లేకుండా జరిపిన చెల్లింపులు, వర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు చేసిన ఖర్చులున్నాయి. వీటిపై వివరాలు సేకరించి చెక్కులు తయారు చేయటానికి ఉన్న నిబంధనలు పాటించారా? ఆ చెక్కును అనుమతిస్తూ సంతకాలు చేసేప్పుడు సరి చూశారా? అనే విషయాలు కీలకం కానున్నాయి.  

Published at : 05 May 2023 11:20 PM (IST) Tags: Hyderabad Telangana University ACB Telangana NIZAMABAD

సంబంధిత కథనాలు

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్‌ టూర్‌లో కేటీఆర్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్‌ టూర్‌లో కేటీఆర్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం