By: ABP Desam | Updated at : 26 Feb 2023 02:32 PM (IST)
Edited By: jyothi
డాన్సు చేస్తుండగా పడిపోయిన యువకుడు
Nirmal News: పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో బరాత్ లో డ్యాన్స్ చేస్తూ.. ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి వరకు హాయిగా డ్యాన్స్ చేసిన ఆయన నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవడంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు.
అసలేం జరిగిందంటే..?
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డీ (కే) గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుని వివాహం శుక్రవారం జరిగింది. శనివారం పార్డి(కె)లో వివాహ వేడుకకు సంబంధించిన విందు జరిగింది. ఇందులో పెళ్లి కుమారుని సమీప బంధువు... మిత్రుడైన మహారాష్ట్రలోని శివ్ ని గ్రామానికి చెందిన 19 ఏళ్ల ముత్యం అనే యువకుడు కూడా విందుకు హాజరయ్యాడు. అయితే బరాత్ లో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు యువకుడిని లేపి పరిశీలించగా ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో హుటహూటిన వైద్య సేవల కోసం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి కోసం వచ్చి బంధువులు, స్నేహితులు కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
గతేడాది డిసెంబర్ లో యూపీలోనూ ఇలాంటి ఘటనే
ఓ వివాహ వేడుకలో విషాదం జరిగింది. ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. వారణాసిలో జరిగిన ఓ వివాహ వేడుకలో డాన్స్ చేస్తూ గుండె పోటుతో ఓ వ్యక్తి నేలపై కుప్పకూలిపోయి చనిపోయాడు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని మనోజ్ విశ్వకర్మ గా గుర్తించారు. వివాహ వేడుకలో పాల్గొనేందుకు నవంబర్ 25న చేట్గాంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పిపలని కట్రాకూ అతను వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వేడుకలో డాన్స్ చేస్తూ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు.
एक और हंसते-गाते-नाचते मौत LIVE
— Narendra nath mishra (@iamnarendranath) November 29, 2022
वाराणसी में शादी में डांस करते हुए एक व्यक्ति की मौक़े पर मौत।
कितनी ऐसी मौत के बाद हमें एहसास होगा कि इसपर चिंता करने की ज़रूरत है pic.twitter.com/NvwdaXzwk3
వేడుకల్లో డాన్స్ చేస్తూ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇంతక ముందు తన వదిన పెళ్ళిలో డాన్స్ చేస్తూ రాజస్థాన్ లోని పాలి జిల్లాకు చెందిన వ్యక్తి మరణించాడు. అలాంటి ఘటనే దహోడ్ జిల్లాలోని దేవగాడ్ బరియాలో 'రాస్' కార్యక్రమం నిర్వహించేటప్పుడు 51 ఏళ్ల వ్యక్తి మరణించాడు.
A man died performing raas at a function at relative place in devgadh baria in dahod district #Gujarat pic.twitter.com/PRGg3fApel
— Vineet Sharma (@vineetsharma94) October 18, 2022
సెప్టెంబర్ లో కూడా ఉత్తర్‌ప్రదేశ్ లోని మణిపూరిలో గణపతి మంటపంలో హనుమంతుడి వేషధారణలో ఉన్న రాజీవ్ శర్మ అనే వ్యక్తి స్పృహ కోల్పోయి కిందపడగా, ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించాడు. గత నెలలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. జమ్ము కాశ్మీర్ లోని బిష్ణా లో గణేష్ పూజ కార్యక్రమంలో డాన్స్ చేస్తూ యోగేష్ గుప్తా అనే 20 ఏళ్ల వ్యక్తి మరణించాడు.
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
TS SSC Exams: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ!
TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!
“ఆరోగ్య మహిళ" స్కీమ్ అంటే ఏంటి? ఏయే టెస్టులు చేస్తారో తెలుసా
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల