అన్వేషించండి

Nizamabad News: టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రాధాన్యత లేకుండా పోయిందని షకీల్‌ అసంతృప్తి!

తెలంగాణలోనే టీఆర్ఎస్ లో ఏకైక మైనార్టీ ముస్లిం ఎమ్మెల్యే షకీల్. బోధన్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచినా తగిన ప్రాధాన్యం లేదని అలక. అనుచరుడి కోసం నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అడిగినా చుక్కెదురు.

టీఆర్ఎస్ పార్టీలో ఏకైక ముస్లిం ఎమ్మెల్యే షకీల్. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు వరుసగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మైనార్టీ లీడర్ కావటంతో ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కుతుందని మొదటి నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు షకీల్. 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన షకీల్ కు టీఆర్ఎస్ మొదటి సారిగా ఏర్పాటైన ప్రభుత్వంలోనే మైనార్టీ కోటా కింద ఆయనకు మంత్రి పదవి దక్కుతుందన్న ఆశ పెట్టుకున్నారు. కానీ ఆయన ఆశలు అడియాశలే ఆయ్యాయ్. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనకు కార్పొరేషన్ పదవి దక్కినట్లే దక్కి చేజారిపోయింది. కనీసం కార్పోరేషన్ పదవి కూడా రాలేదన్న ఆవేదన షకీల్‌లో ఉండిపోయింది. మైనార్టీలో ఏకైక ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు మంచి పదవి వస్తుందన్న ఆశలో ఉన్న అనుచరులకు సైతం నిరాశే మిగిలింది.

2019 ఎన్నికల్లోనూ బోధన్ నుంచి షకీల్ రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. కనీసం రెండోసారి ప్రభుత్వంలోనైనా షకీల్ కు కేసీఆర్ టీంలో అవకాశం ఉంటుందని దండిగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ అతని మంత్రి పదవి దక్కలేదు. దీంతో మరింత తీవ్ర నిరాశకు గురయ్యారు షకీల్. మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కించుకునేందుకు షకీల్ చాలానే ప్రయత్నాలు చేసినా సీఎం కేసీఆర్ విముఖత వ్యక్తం చేశారు.

రెండుసార్లు ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేగా గెలిచినా తనకు సరైన ప్రాధాన్యం దక్కలేదన్న బాధను షకీల్ చాలా సార్లు తన అనుచరుల వద్ద బాధపడినట్లు ప్రచారం కూడా జరిగింది. రెండో సారైనా ఏదైనా కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని మైనార్టీ కోటా కింద కట్టబెడుతారని అనుకున్నా.... షకీల్ అశలు ఏ మాత్రం ఫలించలేదు. మైనార్టీ నాయకుడైన ఎమ్మెల్సీ మహమూద్ అలీకి కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. హోంశాఖ మంత్రిగా మహమూద్ అలీకి బాధ్యతలు ఇవ్వటంతో ఎమ్మెల్యే షకీల్ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయ్.

ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డు ఉత్తర తెలంగాణలో రెండో పెద్ద మార్కెట్ యార్డుగా చెప్పుకుంటారు. ప్రస్తుతం మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి ఖాళీగా ఉంది. గత వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికాలం ముగిసిపోయి రెండేళ్లు గడుస్తున్నా.... ఇప్పటి వరకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ను డైరెక్టర్లను నియమించలేదు. ఎమ్మెల్యే షకీల్ నిజామాబాద్ మార్కెట్ కమిటీకి ఛైర్మన్‌గా తన అనుచరుడైన నర్సింగ్ రావుకు ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి కూడా పెట్టుకున్నారు. కనీసం ఆ పదవినైనా తన అనుచరుడికి ఇప్పించుకోవాలన్న ఆశ కూడా షకీల్ కు దక్కకుండా పోయిందన్న బాధలో షకీల్ ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ వద్దకు ఈ పంచాయతీ వెళ్లటంతో బోధన్ లోని రెంజల్, నవీపెట్ మండలాలను కలుపుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్ షకీల్ కు సూచించినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయ్.

కనీసం మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని సైతం తన అనుచరులకు దక్కించుకోలేకపోయాను అన్న భావనలో షకీల్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనా మైనార్టీ కోటా నుంచి సముచిత న్యాయం జరగలేదన్న బాధలో షకీల్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండోసారి షకీల్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ను కలిసిన విషయం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయ్. కేటీఆర్ సర్ధిచెప్పినట్టు కూడా తెలిసింది. కేటీఆర్‌తో షకీల్ చాలా సన్నిహిత సంబంధాలు మెయింటెన్ చేస్తారు. అప్పుడు షకీల్ ఈ వ్యవహారాన్ని ఈజీగా కొట్టిపారేశారు. నియోజకవర్గంలో కేంద్రం నుంచి వచ్చే అభివృద్ధి నిధుల కోసం కలిశానని షకీల్ చెప్పుకొచ్చారు. 

కనీసం తన అనుచరుడికి కూడా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని ఇప్పించుకోలేక పోయానన్నా ఆందోళనను తన అనుచరుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎప్పటి నుంచి తనకు మంచి పదవి వరిస్తుందని ఆశలు పెట్టుకున్న షకీల్ కు నిరాశే మిగులుతోంది. ఇక సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళితే మాత్రం షకీల్ కు ఎమ్మెల్యే తప్ప మరే పదవి దక్కే అవకాశం లేదన్న భావనలో షకీల్ ఉన్నట్లు తెలుస్తోంది. తనతోటి సహచరుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి పీయూసీ ఛైర్మన్ పదవితోపాటు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు సీఎం కేసీఆర్. కానీ షకీల్ మాత్రం అదృష్టం వరించలేదన్న ప్రస్టేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మైనార్టీ కోటా కింద ప్రజల చేత అసెంబ్లీ అభ్యర్థిగా గెలిచినా సీఎం కేసీఆర్ షకీల్ కు సరైనా గౌరవం ఇవ్వలేదన్న ఆలోచనలో షకీల్ ఉన్నట్లు సమాచారం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Embed widget