Adilabad News: నేడు ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్య నేతల పర్యటన - పోలీసుల భారీ బందోబస్తు
ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి పర్యటించనున్నారు. ఇటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్న
Adilabad Politics | నేడు ఆదిలాబాద్ జిల్లాలో అటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇన్చార్జి మంత్రి సీతక్కతో పాటు తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు పలు అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో మహిళా శక్తి క్యాంటీన్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సీతక్క ముఖ్య నేతలతో కలిసి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి పార్లమెంటరీ స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు.
ఇంద్రవెల్లికి ఎమ్మెల్సీ కవిత
మరోవైపు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద కవిత నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించనున్నారు. అక్కడి నుంచి వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించిన విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
పోలీసులు భారీ బందోబస్తు
ఆదిలాబాద్, ఆసిఫాబాద్ రెండు జిల్లాల్లోనూ కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ రెండు పార్టీల ముఖ్య నేతల పర్యటనలు ఉండటంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అసలే ఫుడ్ పాయిజన్ సమస్యపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఓ ప్రభుత్వ పాఠశాల హాస్టల్ నుంచి దాదాపు 300 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు వచ్చి ఇంటికి తీసుకెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ఎంఈవో, డీఈవో సైతం స్పందించారు. అక్కడ ఏం జరుగుతుందని, విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటికి ఎందుకు తీసుకెళ్లారు, అనుమతి ఇవ్వడానికి గల కారణాలపై ఆరా తీశారు.
Also Read: HYDRA: 'హైడ్రా' దూకుడు మళ్లీ షురూ - మాదాపూర్‌లో 5 అంతస్తుల భవనం కూల్చివేత