Acid Mixing in Liquor: మందులో నీళ్లకు బదులు యాసిడ్ మిక్సింగ్! మత్తులోనే తాగేసిన వ్యక్తి
Mancherial Man Death: మందులో మంచి నీళ్లకు బదులుగా యాసిడ్ కలుపుకొని తాగాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
Man Mixes Acid in Liquor: మద్యం మత్తు ప్రాణాలు తీసిన సందర్భాలు లెక్కే లేవు. తాగిన వారిలో చాలా మంది రోజూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం మత్తులో తెలివితో పని చేయలేక ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. అధిక రోడ్డు ప్రమాదాలకు కూడా ఈ మద్యం మత్తే కారణం. తాగిన మైకంలో ఏం చేస్తుంటారో సోయి ఉండదు. స్పృహలో లేకుండా ప్రవర్తిస్తుంటారు. అలా ప్రవర్తించిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మందులో మంచినీళ్లకు బదులుగా యాసిడ్ కలుపుకొని తాగాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్లలో మహేశ్ అనే 29 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనే మందులో మంచి నీళ్లకు బదులుగా యాసిడ్ కలుపుకొని తాగేశాడు. అతని ఇంట్లో యాసిడ్ కూడా రంగు లేకుండా నీళ్ల తరహాలో కనిపించడంతో ఈ పొరపాటు జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. యాసిడ్ మందులో తాగినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు అతణ్ని వెంటనే అతణ్ని వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూనే ఉన్నాడు. తాజాగా ఆదివారం చనిపోయినట్లుగా హాజీపూర్ పోలీసులు వెల్లడించారు. మహేశ్ కు భార్య స్వర్ణలత, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు లక్ష్మి, స్వర్ణలత కూడా వారితోనే ఉంటున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
ఈ ఎండల్లో ఊపు మీద మద్యం అమ్మకాలు
తెలంగాణలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా, బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. తెలంగాణలో గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ సమ్మర్ సీజన్ లో బీర్ల అమ్మకాలు ఏకంగా 90 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ఈ టైంలో లాక్ డౌన్ ఉండడంతో ఈ ఏడాది భారీ మొత్తంలో అమ్మకాలు నమోదయ్యాయి. బ్రాందీ, విస్కీ లాంటి లిక్కర్ అమ్మకాలు కూడా 3 శాతం పెరిగాయి. రాష్ట్రంలో అన్ని రకాల మద్యం అమ్మకాలు సేల్ విలువ పరంగా గత ఏడాదితో పోల్చితే 19 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి 49,84,285 కేసుల బీర్లు, 27,69,998 కేసుల సాధారణ మద్యం సీసాలు అమ్ముడుపోయాయి.
2021-22 లో లిక్కర్ 26,87,808 కేన్లు అమ్ముడయితే, బీర్లు 26,12,694 కేన్లు అమ్మేశారు. 2022-23లో లిక్కర్ 27,69,998 కేన్లు తాగితే బీరు ఏకంగా 43,84,285 కేన్లు తాగేశారు. తెలంగాణల బీర్ల అమ్మకాల్లో 10 జిల్లాల్లో టాప్ లో నిలిచింది. 150 శాతం వరకూ అక్కడ బీర్ల అమ్మకాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత 146 శాతం, కామారెడ్డిలో 124 శాతం అమ్మకాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 122 శాతం చొప్పున అమ్మకాలు ఎక్కువగా జరిగాయని అబ్కారీ అధికారులు చెబుతున్నారు.