By: ABP Desam | Updated at : 10 Apr 2023 05:07 PM (IST)
కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
Congress Meeting In Mancherial District:
- ఈనెల 14న మంచిర్యాలలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
- బహిరంగ సభకు రానున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావ్ నేతృత్వంలో సభకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్ మున్సిపాలిటీలో ఈనెల 14వ తేదీన కాంగ్రెస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు. ఈ విషయాన్ని సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ వెల్లడించారు.
నస్పూర్ లో నిర్వహించే సభా మైదానంను సోమవారం వారు పరిశీలించారు. కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఈ నెల 14వ తేదీన ఖరారు అయినట్లు తెలిపారు. మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో తొలిసారి మంచిర్యాలలో ఏర్పాటు చేస్తున్న సభకు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బాఆర్ అంబేద్కర్ జయంతి రోజున సభను ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ సభ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని ప్రేమ్ సాగర్ తెలిపారు. ఈ భారీ భహిరంగ సభకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, జైరాం రమేష్, కొప్పుల రాజు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జాతీయ, రాష్ట్రీయ ముఖ్య నేతలు హాజరవుతారని వారు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని కొక్కిరాల ప్రేమ్ సాగర్, కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు.
PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!
Bandi Sanjay - Kavitha: నిజామాబాద్‌లో ఆసక్తికర సీన్! ఆత్మీయంగా పలకరించుకున్న బండి సంజయ్, కల్వకుంట్ల కవిత
RTO Vehicle Registration: రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, సర్వర్ డౌనే కారణం
Eklavya Model Schools Results: ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
TS Police Training: ఎస్‌ఐ, కానిస్టేబుల్ శిక్షణకు ఏర్పాట్లు, జులై నుంచి అభ్యర్థులకు ట్రైనింగ్!
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!