NH 44 Traffic Jam: కామారెడ్డి హైవేపైకి ఎక్కొద్దు ప్లీజ్.. 25 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్.. నరకం చూస్తున్న వాహనదారులు
Telangana వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల ప్రభావంతో ట్రాఫిక్ సమస్య తారా స్దాయికి చేరింది. కామారెడ్డి జాతీయరహాదారిపై ఏకంగా 25కిలోమీటర్లకు పైగా ట్రాపిక్ స్ధంభించింది. వాహానాలు కదలక నరకం కనిపిస్తోంది.

Telangana Rains | కామారెడ్డి: తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజుల నుండి దంచికొడుతున్న వర్షాలు, వరదలు గ్రాామాలను, వాగులనే ఏకంగా చేయడమేకాదు.. వందల కిలోమీట్ల మేర రహదారులను సైతం ధ్వంసం చేశాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు కోతకు అవ్వడం, భారీగా గోతులు పడటంతో ఊహించని స్దాయిలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కామారెడ్డి జాతీయ రహాదారి (NH-44) పై అనేక చోట్ల ధ్వంసమవ్వడంతో హైదరాబాాద్ కు వెళ్లే వాహానదారులు నరకం కనిపిస్తోంది.
హైదరాబాద్, కామారెడ్డి వైపు దారిలో నరకమే
కామారెడ్డి మీదుగా హైదారాబాద్ వెళ్లే వాహానాలతో జాతీయ రహాదారి నిండి పోయింది. ఏకంగా 25 కిలోమీటర్లకు పైగా కామారెడ్డి హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. కలవరాలు నుండి బిక్నూర్ వరకూ హైవే పై ఎక్కడిా వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.హెవీ వెహికల్స్, ట్రక్స్ , కార్లు, లారీలు ఇలా వరుసగా హైవేపై వాహనాల దండ కట్టినట్లుగా కిలోమీటర్ల మేర అష్టధిగ్భందన తలపిస్తోంది కామారెడ్డి వద్ద భారీ ట్రాఫిక్ జామ్.ఈ నేపధ్యంలో అధికారులు అప్రమత్తమైయ్యారు. కామారెడ్డి నుండి హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన వారు తాత్కాలికంగా ప్రయాణాలు వాయిదా వేసుకోవడం లేదా ఇతర మార్గాల ద్వారా హైదరాబాద్ చేరుకోవాలని, హైవే ఎక్కొద్దు ప్లీజ్ అంటున్నారు.
యుద్ధ ప్రాతిపదికన రహాదారుల మరమత్తులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పట్లో సాధ్యం కాని నేపధ్యంలో ప్రత్నాన్మయ మార్గాల ద్వారా వెళ్లాలని వాహనాదారులకు సూచిస్తున్నారు. అతి భారీ వర్షాలకు , వరదల తీవ్రతకు హైవేలపై అనేక చోట్ల భారీ గోతులు, హైవే కుంగిపోవడంతో పాటు భారీ నష్టం వాటిల్లింది. సదాశివ నగర్ నుండి ట్రాపిక్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. టేక్రియాల్ , సారంపల్లి వద్ద హైవేపై ఉన్న బ్రిడ్జి కోతకు గురైయ్యింది. నిన్న ఉదయం నుండి కామారెడ్డి జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కష్టాలు వాహనదారులను వెంటాడుతున్నాయి. రహాదారుల మరమత్తలు వెంటనే చేయాలని, ట్రాఫిక్ జామ్ వల్ల నరకం చూస్తున్నామంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెవీ వెహికల్స్ జాతీయ రహాదారులపై రాకవడం వల్ల ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిందని, రోడ్ల మరమత్తులు పూర్తయ్యేవరకూ లారీలు నిలిపివేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.





















