అన్వేషించండి

Food poison: కన్నేపల్లి కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 20 మంది విద్యార్థులకు అస్వస్థత

ఫుడ్ పాయిజన్ కారణంగా కన్నేపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతున్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

మంచిర్యాల జిల్లా కన్నేపల్లి కేజీబివి పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ కారణంగా కన్నేపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతున్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొందరు విద్యార్థులు ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతో విద్యార్థులను బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

మంచిర్యాల జిల్లా కన్నేపల్లి కస్తూర్బా పాఠశాలలో శనివారం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కొంతమంది విధ్యార్థులు, కడుపు నొప్పితో పాటు వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. రాత్రీ భోజనం చేసిన తరువాత మరి కొంతమంది విద్యార్థులు వాంతులు విరేచనాలు చేసుకున్నారు. కొందరు కళ్ళు తిరిగీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని ఉదయం తెల్లవారు జామున అంబులెన్స్ లో బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేజీబివి పాఠశాల స్పెషల్ ఆఫీసర్, ఏఎన్ఎం, స్థానికంగా లేకపోవడంతో ఇంచార్జ్ గా ఇంగ్లీష్ టీచర్ పాఠశాలలో ఉండగా నైట్ వాచ్మెన్ మహిళా, విద్యార్థుల పరిస్థితిని ఆమె దృష్టికి తీసుకెళ్లగా ఆమె నిర్లక్ష్యంగా మాట్లాడిందని విద్యార్థులు నటన చేస్తున్నారని, హేళన చేసిందని తెలిపారు.

కనీసం విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ సమాచారం ఇప్పటివరకు అందించలేదనీ, పరిస్థితి బాలేకపోవడంతో విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన చెందుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుండి ఇలా జరుగుతున్న కనీసం పట్టించుకోవడంలేదంటూ విద్యార్థులు వాపోతున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్తులను ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించి సెలైన్ ఎక్కించి వైద్యం అందిస్తున్నారు. ఆహారం కల్తీ కారణంగానే ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

సిబ్బంది పై విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ 

విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణం అంతా కిటకిటలాడింది. పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టారంటూ పాఠశాల సిబ్బందిపై ఫైర్ అవుతున్నారు. మీ వల్లే మా పిల్లలకు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం బాగాలేకపోతే ఇంత మంది పిల్లల పరిస్థితి ఏమయ్యుండేదో అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక నుంచి అయినా పిల్లల ఆహారం నాణ్యత విషయంలో దృష్టి పెట్టాలంటూ సూచిస్తున్నారు.

కస్తూర్భ పాఠశాలలో గత రాత్రి భోజనం చేసినప్పటి నుంచి విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అస్వస్థతతు గురయ్యారు. అయినా నిర్వాహకులు పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా రియాక్ట్ కాలేదని అంటున్నారు. చివరకు పరిస్థితి చేయిదాటిపోతుందన్న టైంలో ఫుడ్‌ పాయిజన్ అయిన విద్యార్థులకు అక్కడే వైద్య చికిత్సలు అందించారని చెలుస్తోంది.

ఇంత జరిగినా ఇంతవరకు విద్యార్ధినీల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థులకు ప్రమాదం లేదని అసలు ఎందుకిలా జరిగిందో తెలుసుకుంటున్నామని చెబుతున్నారు వైద్యులు. కలుషిత నీరు కారణంగా ఇలా జరిగిందా.. లేకుంటే ఆహారం వల్లే ఇది జరిగిందా అనేది పిల్లలు కోలుకున్న తర్వాతే తెలుస్తుందని అంటున్నారు. 

ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంత  జరిగినా తల్లిదండ్రులకు ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వకపోవడంపై వారంతా మండిపడుతున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను స్టానిక ప్రజా ప్రతినిధులు పరామర్శించారు. భయపడాల్సిన పని లేదని వైద్యులు చికిత్స అందిస్తున్నారని త్వరగా కోలుకుంటారని భరోసా ఇచ్చారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget