News
News
X

Yuvraj Singh: యువరాజ్‌ యు ఆర్‌ గ్రేట్‌... నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకొనే పని చేసిన మాజీ ఆల్‌రౌండర్

నిజామాబాద్ జిల్లా ప్రజలకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సర్‌ప్రైజ్ చేశారు. యూవీకేన్ ఫౌండేషన్ తరఫున ఐసీయూ పడకలు అందించారు.

FOLLOW US: 

నిజామాబాద్ జిల్లా కేంద్రలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి మరో 120 ఐసీయూ పడకలు అందుబాటులోకి వచ్చాయి. క్రికెటర్ యువరాజ్ సింగ్ తాను స్థాపించిన యూవీకెన్ ఫౌండేషన్ ద్వారా ఈ 120 ఐసీయూ పడకలను అందించారు. ఈ మేరకు ఈ బెడ్లను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి బుధవారం ప్రత్యక్షంగా ప్రారంభించగా, క్రికెటర్ యువరాజ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్ తో పాటు, జిల్లాకు చెందిన వైద్య శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. 

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడారు. కొన్నేళ్ల క్రితం క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ తో బాధ పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ బాధను అనుభవించిన ఆయన ఇంకొకరు తాను పడిన బాధ పడకూడదని భావించి ఈ సాయం అందించారని కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడించారు.

కేవలం నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి 120 ఐసీయూ పడకలు అందించారని, ఇంకా యూవీకెన్ ఫౌండేషన్ తరపున వెయ్యి ఐసీయూ పడకలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని వెల్లడించారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం అని పేర్కొన్నారు. నిజామాబాద్ ఆస్పత్రికి అందించిన 120 పడకల్లో అక్కడి నుంచే పలురకాల నమూనా పరీక్షలు చేసే 18 పడకలలో మల్టీ ఛానల్ మానిటర్స్ కూడా ఉన్నాయని వివరించారు. 

కరోనా మొదటి రెండో దశలలో జిల్లా యంత్రాంగం, వైద్య సిబ్బంది కలిసి ఎంతో అంకితభావంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించారని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. కోవిడ్ వ్యాప్తిని తగ్గించడానికి వారి వంతుగా అహోరాత్రులు కృషి చేశారని, ఒక పోరాటం చేశారని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం అందజేసిన ఈ క్రిటికల్ కేర్ బెడ్స్ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని అందుకుగాను, యువరాజ్ సింగ్ పౌండేషన్ కు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. 

అదేవిధంగా, ఈ పడకలు ఇక్కడికి తెప్పించడానికి తన వంతుగా కృషి చేసిన ఎమ్మెల్సీ కవితకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ఏ ఉద్దేశంతో ఈ  యువరాజ్ సింగ్ పౌండేషన్ పడకలు అందించిందో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కూడా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అరవింద్ బాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర, ఐఎంఏ అధ్యక్షులు జీవన్ రావ్ తదితరులు పాల్గొన్నారు. యువీ కెన్ ఫౌండేషన్ ప్రతినిధులు సృజన్, వెంకట్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Published at : 29 Jul 2021 07:00 AM (IST) Tags: Cricketer yuvraj singh icu beds to nizamabad hospital youwecan foundation nizamabad govt hospital

సంబంధిత కథనాలు

Dussehra Wishes: ధర్మ స్థాపనకు నిదర్శనం, తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలి: కేసీఆర్ సహా నేతల దసరా శుభాకాంక్షలు

Dussehra Wishes: ధర్మ స్థాపనకు నిదర్శనం, తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలి: కేసీఆర్ సహా నేతల దసరా శుభాకాంక్షలు

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు: IMD

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు  వర్షాలు: IMD

Nizamabad News: తమకిష్టంలేని పెళ్లి చేసుకుందని గర్భిణీని బలవంతంగా లాక్కెళ్లిన కుటుంబ సభ్యులు

Nizamabad News: తమకిష్టంలేని పెళ్లి చేసుకుందని గర్భిణీని బలవంతంగా లాక్కెళ్లిన కుటుంబ సభ్యులు

బుల్లెట్ బైక్‌లే టార్గెట్‌గా చోరీలు, 2 నెలల్లో 100కు పైగా మాయం - మిస్టరీగా మారిన కేసు

బుల్లెట్ బైక్‌లే టార్గెట్‌గా చోరీలు, 2 నెలల్లో 100కు పైగా మాయం - మిస్టరీగా మారిన కేసు

Weather Updates: బలపడుతోన్న అల్పపీడనం - అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

Weather Updates: బలపడుతోన్న అల్పపీడనం - అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

టాప్ స్టోరీస్

National Party: పేరు మారిస్తే జాతీయ పార్టీ అయిపోతుందా ? అసలు రూల్స్ ఇవిగో !

National Party:  పేరు మారిస్తే  జాతీయ పార్టీ అయిపోతుందా ? అసలు రూల్స్ ఇవిగో !

Godfather Movie Review - 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

Godfather Movie Review - 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

కేసీఆర్‌ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన ఏంటీ?

కేసీఆర్‌ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన ఏంటీ?

The Ghost Review: ది ఘోస్ట్ రివ్యూ: ఘోస్ట్‌గా నాగార్జున హిట్ కొట్టారా?

The Ghost Review: ది ఘోస్ట్ రివ్యూ: ఘోస్ట్‌గా నాగార్జున హిట్ కొట్టారా?