అన్వేషించండి
ఆలూరులో దంపతులు ఆత్మహత్య- అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు
నిజామాబాద్ జిల్లా ఆలూరులో విషాదం. దంపతుల అనుమానాస్పద మృతి చెందారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని గ్రామస్తులు అనుమానం.
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో విషాదం నెలకొంది. దంపతుల ఆత్మహత్య పలు అనుమానాలకు తావిస్తోంది. ఆలూర్ గ్రామానికి చెందిన కుమ్మరి పడగెల గంగారం, గంగామణి ఇంట్లో ఉరి వేసుకుని విగతజీవులుగా కనిపించారు. వారిని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటన స్థలానికి ఆర్మూర్ ఏసిపి ప్రభాకర్ రావుతోపాటు సిఐ సురేష్ బాబు, ఎస్ఐ శివరాం చేరుకున్నారు. పోలీసులు డాగ్స్ స్కాడ్, క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. అయితే గంగారం దంపతులను కుటుంబ సభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు.
మృతి చెందిన దంపతులకు ఉన్న కుమారుడు 15 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందాడు. 2016 సంవత్సరంలో ఓంకార్ అనే వ్యక్తిని ఈ దంపతులు దత్తత తీసుకున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ దంపతులు ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదంటున్నారు స్థానికులు. ఆస్తి కోసమే వీరిని చంపిఉంటారన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు తెలిసే అవకాశాలున్నాయ్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion