అన్వేషించండి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కవితను ఓడగొట్టారు, కారణం చెప్పిన కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి !

MLC Jeevan Reddy On TRS MLC Kavitha: గత లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో గెలిచిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

MLC Jeevan Reddy comments againt TRS MLC Kavitha: వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుండగా, మరోసారి నెగ్గి హ్యాట్రిక్ కొడతామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఎమ్మెల్సీ కవిత విషయంపై మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో గెలిచిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారణమని వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కవిత ఎంపీగా గెలిస్తే తమపై పెత్తనం చెలాయిస్తుందని భావించి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కలిసి నిజామాబాద్‌లో ఆమె కనబడకుండా చేయాలని, కుట్రపూరితంగా వెన్నుపోటు పొడిచి ఆమెను లోక్ సభ ఎన్నికల్లో ఓడగొట్టారని జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత ఓడిపోవడంతో ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ స్వతంత్రం వస్తుందని వారు భావించారని, అందుకే ఎమ్మెల్యేలు నిజామాబాద్ ఎంపీగా కవిత ఓడిపోయేలా చేశారని వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కవితపై కుట్ర చేశారు ! 
రాజకీయాల్లో ఎక్కడైనా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి, నేతల్ని ఓడించేందుకు అవతలి పార్టీలు వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. కానీ నిజామాబాద్ లో గత లోక్ సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. బీజేపీ నేత ధర్మపురి అరవింద్ చేతిలో నిజామాబాద్ ఎంపీగా కవిత ఓడిపోయారు. అయితే ఇందుకు ప్రతిపక్ష పార్టీలు కారణం కాదని, టీఆర్ఎస్ పార్టీలోనే కుట్రలు జరిగాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కవిత ఎంపీగా గెలిస్తే తమకు నిజామాబాద్ లో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉండదని టీఆర్ఎస్ నేతలు భావించారని జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం కింద వచ్చే ఏడుగురు ఎమ్మెల్యేలు నెగ్గినా, కవిత ఓటమి కోసం పని చేశారని కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.

కవిత అమయాకురాలు కాదు, కానీ తప్పని ఓటమి !
తమపై కవిత ఆధిపత్యం చెలాయించకూడదంటే ఎంపీగా ఆమె ఓడిపోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావించారని, 30 వేలకు పైగా మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ పని చేశారన్నారు. కవిత నిజామాబాద్ లో లేకుంటే తమకు స్వేచ్ఛ, అధికారం వస్తాయని భావించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కవిత ఓటమిని కోరుకున్నారని, కుట్ర చేశారని జీవన్ రెడ్డి పునరుద్ఘాటించారు. అంటే గత ఎన్నికల్లో కవిత ఎంపీగా ఓడిపోవడానికి ప్రత్యర్థి పార్టీలు కారణం కాదని, గులాబీ నేతల పాత్ర ఉందన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈ విషయం ముందుగానే తెలుసునని వ్యాఖ్యానించారు. అయితే కవిత అమాయకురాలు కాదని, కానీ అనుకోని పరిస్థితులు, సొంత పార్టీ నేతల కుట్రల ఫలితంగా ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు. ఆమెకు ఇంటెలిజెన్స్ రిపోర్టులున్నాయని, అన్ని విషయాలు తెలుసు కానీ సొంత పార్టీ నేతల కుట్రల్ని కప్పి పుచ్చేందుకు కవిత ప్రయత్నిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు.

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy America Tour Cancelled: తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget