అన్వేషించండి

Nizamabad News: దూకుడు పెంచిన నిజామాబాద్‌ జిల్లా బీజేపీ లీడర్లు- కేంద్ర ప్రభుత్వ సంక్షేమాలపై స్పెషల్ ఫోకస్

నిజామాబాద్ జిల్లాలో దూకుడు పెంచారు బీజేపీ నేతలు. రాష్ట్ర, కేంద్ర నాయకులతో ఉమ్మడి జిల్లాల్లో సభలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీజేపీ తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. అవకాశం ఉన్న చోటల్లా తమ గళం విప్పుతున్నారు బీజేపీ నాయకులు. పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కమలం పార్టీ ప్రధాన నాయకులు కార్యకర్తల్లో జోష్ నింపేలా కామెంట్స్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో కేంద్రం వాటా ఎంత అనేది ప్రజలకు స్పష్టంగా తెలుపుతున్నారు.

నిజామాబాద్ జిల్లా బీజేపీ నాయకత్వం పార్టీని బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి నరేంధ్రనాథ్ పాండే రప్పించిన జిల్లా ఎంపీ అరవింద్ ఆయన్ని రెండ్రోజుల పాటు జిల్లాలోనే ఉంచి ప్రజలతో మాట్లాడించారు. ఆర్మూర్‌లోని పెర్కిట్‌లో సభ ఏర్పాటు చేయించి కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు వివరించేలా చేశారు.

జిల్లా నాయకత్వం సైతం సభల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల అంశాన్ని ఎక్కువగా లేవనెత్తున్నారు. కేంద్రమంత్రి నరేంధ్రనాథ్ పాండే జిల్లాలో రెండు రోజులు మకాం వేసి జిల్లాలో పార్టీ పరిస్థితిని తెలుసుకున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతం కోసం జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రస్తావించినట్లు సమాచారం. జిల్లాలోని ముఖ్యనాయకులంతా కేంద్రమంత్రిని కలిసి తమ తమ నియోజకవర్గాల్లోని పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. పార్టీని ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా సూచనలు చేసినట్లు సమాచారం.

దూకుడు పెంచిన బీజేపీ జిల్లా నాయకత్వం

కేంద్రమంత్రి నరేంధ్రనాథ్ పాండే వెళ్లిన మరుసటి రోజే కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ లో బీజేపీ నాయకులు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. జిల్లా ఆధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఇందులో బాన్సువాడ ఇంఛార్జ్ మల్యాద్రి రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోని పలువురు నేతలు హాజరయ్యారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నేతలు బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టారు. అధికార పార్టీ నేతలు సాగిస్తున్న దందాలను ఎండగట్టారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అవశ్యకతపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్ర ఇస్తున్న వాటా ఎంతో వివరించారు. పేద ప్రజలకు బీజేపీ చేస్తున్న మేలును వివరించారు. స్థానిక నాయకులు అధికార పార్టీ నేతలపై స్వరం పెంచారు. కార్యకర్తల్లో జోష్ వచ్చేలా ప్రసంగాలు సాగాయి. గతానికి భిన్నంగా బీజేపీ నాయకులు దూకుడుగా ప్రజలను, కార్యకర్తలను అట్రాక్ట్ చేసే విధంగా స్పీచ్ లు ఇస్తున్నారు. 

ఆకట్టుకున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్  స్పీచ్

బీర్కూర్ బహిరంగ సభ ద్వారా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తమ గళం వినిపించారు. తాను టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో జరిగిన అనుభవాలను ప్రజలకు తెలిపారు. సీఎం కేసీఆర్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం విలువ ఉండదని ఆయన ఓ రాజులాగా ఫీల్ అవుతారంటూ ప్రసంగం మొదలు పెట్టి సామాన్య ప్రజానికానికి అర్ధమయ్యే విధంగా ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల వెనుక దాగి ఉన్న నిజాలివే అంటూ ప్రజలకు వివరించారు. వ్యక్తుల పరంగా దూషణలకు పోకుండా బీజేపీ పార్టీ కేంద్రంలో సాగిస్తున్న పాలన గురించి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు. ఈటెల స్పీచ్ ను ప్రజలు, కార్యకర్తలు ఆసక్తిగా విన్నారు.

వరుసగా జిల్లా బీజేపీ కీలక నేతలు ప్రజల్లోకి వెళుతూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అరవింద్ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను గెలుచుకంటామన్న ధీమాను వ్యక్తం చేస్తూ... నియోజకవర్గాల్లోని బీజేపీ నాయకులను యాక్టివ్ చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. పార్టీ సీనియర్, జూనియర్ నాయకులను కలుపుకుని పోతూ... కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నారని... దీంతో సెకండ్ క్యాడర్, కార్యకర్తల్లో పార్టీ నాయకత్వంపై నమ్మకం పెరుగుతోందని లోకల్‌గా టాక్ వినిపిస్తోంది. బీజేపీ జిల్లా నాయకులు దూకుడు చూస్తుంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమే అన్నట్లు సంకేతాలిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Hemant Soren: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bachhala Malli Teaser: 'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
Telangana: మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
Embed widget