అన్వేషించండి
Advertisement
Nizamabad News: గవర్నమెంట్ స్కూల్స్‌లో యాప్ ద్వారా అటెండెన్స్, టీచర్లకు పరీక్ష మొదలైంది !
ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులకు డిజిటల్ అటెండెన్స్. మొబైల్ యాప్ ద్వారా హాజరు వేస్కున్న టీచర్లు. విద్యాశాఖ వినూత్న ప్రయత్నం. కొన్ని చోట్ల యాప్ లో లోకషన్ తప్పుగా చూపిస్తున్న వైనం.
Teachers Attendance With Geo Attendance : ప్రభుత్వ స్కూళ్లల్లో ఉపాధ్యాయుల అటెండెన్స్ పై వినూత్న రీతిలో డిజిటల్ పద్దతిని ప్రవేశపెట్టింది. గతంలో రిజిస్ట్రార్ పై సంతకం పెట్టడం కాకుండా మొబైల్ లోనే యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకునే వెసులు బాటు కల్పించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాప్ ద్వారా టీచర్లు అటెండెన్స్ ఫాలో అవుతున్నారు. ఉపాధ్యాయుల హాజరుపై పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గత 15 రోజులుగా జియో అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో సత్ఫలితాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విధానంపై ఓ ఉపాధ్యాయుడ్ని ఏబీపీ దేశం వివరణ అడగగా... ఉదయం 9 గంటలకు స్కూల్ కి వెళ్లి యాప్ ఓపెన్ చేసి అటెండెన్స్ వేస్తున్నాం. కానీ మేము ఉన్న లోకేషన్ కు బదులు వేరే లోకేషన్ చూపిస్తోందని... స్కూల్ రాగానే ఇన్ పంచ టైప్ లో ఉదయం యాప్ లో ఫొటో దిగి అటెండెన్స్ వేసుకోవాలి. తర్వాత స్కూల్ ముగియగానే మరోసారి ఔట్ పంచ్ మాదిరి అటెండెన్స్ వేయాలి. రెండు సార్లు అటెండెన్స్ వేస్తున్నా గ్రీన్ మార్క్ రాకుండా రెడ్ మార్క్ వస్తుండటంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు అటెండెన్స్ పడిందా లేదా అన్న అయోమయంలో ఉంటున్నారు. అటెండెన్స్ పడితే గ్రీన్ మార్క్ చూపించాలి. కానీ రెడ్ మార్క్ చూపిస్తుండటంతో వారు ఇబ్బంది పడుతున్నారు.
జిల్లాలో 1,196 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.... ఇందులో 1.20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యాశాఖలో 5,500 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని బడులకు సమయానికి వెళ్లకపోవడం, వంతుల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారనే ఫిర్యాదులు అందాయి. వీటికి పరిష్కారంగా ఉపాధ్యాయుల హాజరుశాతాన్ని పెంచి, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గత 14న ఉపాధ్యాయులకు యాప్ ఇన్స్టాలేషన్, వినియోగంపై అవగాహన కల్పించారు.
అటెండెన్స్‌లో లోపాలు...
కొన్ని సందర్భాల్లో సమయానికి వచ్చినా ఆలస్యమైనట్లు చూపుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఉదయం టైంఇన్ అయినా సాయంత్రానికి టైంఅవుట్ చూయించట్లేదని మరికొందరు చెబుతున్నారు. ఆఫ్‌లైన్ లో సమర్థవంతంగా పనిచేయడం లేదని చెబుతున్నారు.
వాడే విధానం....
గూగుల్ ప్లేస్టోర్ నుంచి Geo-attendance యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యూజర్ ఐడీ, పాస్వర్డ్ లాగిన్ అయిన తర్వాత నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. పాఠశాలకు వచ్చినప్పుడు 'టైంఇన్'.. వెళ్లేటప్పుడు 'టైంఅవుట్' ఆప్షన్లలో సెల్ఫీ దిగాల్సి ఉంటుంది. లొకేషన్ ఆధారంగా బడిలో ఉన్నారా లేదా అనేది తెలిసిపోతుంది. సెలవు, ఇతర ప్రభుత్వ పనిపై బయటికి వెళ్లాల్సి వచ్చిన వాటికి సంబంధించిన ఆప్షన్లు ఉంటాయి. స్థానికంగా నెట్వర్క్ లేకపోయినా ఆఫ్లైన్లో హాజరు నమోదు చేసుకొని ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని వెబ్సైట్లోకి అప్లోడ్ చేసేలా రూపొందించారు. అయితే ప్రస్తుతం ఈ యాప్ యూజ్ చేస్తున్నారు యాప్ లో తలెత్తుతున్న లోపాలపై విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు అధికారులు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
ఛాట్‌జీపీటీ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion