అన్వేషించండి

MLA Jeevan Reddy: బీఆర్ఎస్ గెలుపుతోనే దేశానికి మలుపు, మీరే కేసీఆర్‌కు శక్తి పీఠాలు: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గా మార్చిన తరువాత జైత్రయాత్రకు మునుగోడుతో బోణీ అయిందని, సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో గెలుపు తమ జోరుకు నిదర్శనం అన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా గెలుపు బీఆర్ఎస్ దేనని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ను జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గా మార్చిన తరువాత జైత్రయాత్రకు మునుగోడుతో బోణీ అయిందని, సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో గెలుపు బీఆర్ ఎస్ జోరుకు నిదర్శనంగా నిలిచిందని ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విజయాలు కేసీఆర్ అద్భుత నాయకత్వానికి ప్రజలు ప్రధానం చేస్తున్న కీర్తి కిరీటాలు అన్నారు. 

కేటీఆర్ నాయకత్వానికి ఈ విజయాలు నిదర్శనం 
మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదునైన నాయకత్వానికి ఈ విజయాలు నిలువెత్తు నిదర్శనమని ఆయన తెలిపారు. ఇక ముందు కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ దెబ్బకు విపక్షాలు విలవిలలాడక తప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎప్పటికీ ప్రజా పక్షమేనని, వారికి మేలు చేయడానికి ఎన్ని కష్టాలు భరించడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా బీఆర్ ఎస్ ధాటికి బీజేపీ పరార్ కావడం ఖాయమని, కాంగ్రెస్ ఓటమి ఖరారు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  

సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ అవినీతికర, అవకాశవాద, దగాకోరు విధానాలతో  దేశాన్ని భ్రస్టు పట్టించిందని, మోడీ ఎనిమిదేళ్ల పాలన దేశాన్ని చీకటి మయం చేసిందని ఆయన ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ ఎస్ ఆయుధాలని ఆయన అన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ, చెరువులు బాగుచేసిన మిషన్ కాకతీయ, రూ.2016, రూ.3016 చొప్పున ఇస్తున్న ఆసరా పెన్షన్లు, పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి అపురూప పథకాల సమాహారం తెలంగాణ మోడల్ దేశాభిమానం పొందుతున్నదని ఆయన తెలిపారు.

మోసం తప్ప జనం గోస పట్టని మోడువారిన "మోడీ మోడల్" దేశానికి హానికరమని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అన్నారు. సబ్బండ వర్గాల అండదండలే కేసీఆర్ కు శక్తి పీఠాలని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఒక అమ్మకం పార్టీ అని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నదని,కాంగ్రెస్ ఒక అపనమ్మకపు పార్టీ అని, వయోభారంతో కాటికికాలుజాపిన ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. బీఆర్ ఎస్ గెలుపు తోనే దేశానికి మలుపు అని, యావత్తు దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని జీవన్ రెడ్డి పునరుద్ఘాటించారు.

సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల జీవన్ రెడ్డి  హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లాలో సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను పట్టం కట్టిన ఓటర్లు  మంత్రి కేటీఆర్  నాయకత్వం పై అచంచల విశ్వాసం కనపర్చారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన  పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అఖండ విజయం చేకూర్చిన ఓటర్లకు జీవన్ రెడ్డి  ధన్యవాదాలు తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget